MI vs CSK : వాంఖడేలో మెరిసేదెవరు ?..చెన్నైతో తలపడనున్న ముంబై

MI vs CSK : ఐపీఎల్ లో గురువారం రసవత్తర పోరు జరగబోతోంది. చిరకాల ప్రత్యర్థులు చెన్నై సూపర్ కింగ్స్ , ముంబై ఇండియన్స్ తలపడబోతున్నాయి

MI vs CSK

ఐపీఎల్ లో గురువారం రసవత్తర పోరు జరగబోతోంది. చిరకాల ప్రత్యర్థులు చెన్నై సూపర్ కింగ్స్ , ముంబై ఇండియన్స్ (MI vs CSK) తలపడబోతున్నాయి. లీగ్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్స్ గా పేరున్న ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ కు వాంఖడే స్టేడియం వేదిక కానుంది. ఈ సీజన్ లో ఇరు జట్ల పరిస్థితి దాదాపుగా ఒకటే.

ఎందుకంటే అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోతున్నాయి. ఇప్పటి వరకూ ఆరేసి మ్యాచ్ లు ఆడి రెండు విజయాలు మాత్రమే సాధించాయి. కాకుంటే రన్ రేట్ పరంగా కాస్త మెరుగైన స్థితిలో ఉన్న ముంబై చెన్నై కంటే ఒక స్థానం పైన ఉంది. నిజానికి ముంబై ఇండియన్స్(MI vs CSK) ఇలాంటి పరిస్థితుల నుంచి పుంజుకుని టైటిల్ గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి.

గత మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై ఆ జట్టు ఎలాంటి విజయాన్ని సాధించిందో అందరూ చూసారు. అసలు గెలుపే కష్టమనుకున్న దశ నుంచి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగుతేజం తిలక్ వర్మ సెంచరీతో చెలరేగిపోయాడు. ఇప్పుడు ముంబైకి రోహిత్ శర్మ రీఎంట్రీ ఇస్తాడన్న అంచనాలు మరింత జోష్ పెంచుతున్నాయి.

గాయంతో గత రెండు మ్యాచ్ లకు హిట్ మ్యాన్ దూరమయ్యాడు. అటు కీపర్ డికాక్ ఫామ్ లో ఉండగా సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా నిరాశపరుస్తున్నారు. వీరిద్దరూ కూడా ఫామ్ అందుకుంటే వాంఖడేలో ముంబైకి తిరుగుండదు. అటు బౌలింగ్ లో బుమ్రా ఫామ్ లోకి రావడం అడ్వాంటేజ్. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన అశ్విని కుమార్ 4 వికెట్లతో అదరగొట్టాడు. అలాగే ఘజన్ ఫర్, శాంట్నర్ కూడా రాణిస్తున్నారు.

మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ ది కూడా దాదాపుగా ఇదే పరిస్థితి. ఆ జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. గాయాల కారణంగానే పలువురు కీలక ఆటగాళ్లు ఈ సీజన్ కు దూరమయ్యారు. జట్టులో ఉన్న స్టార్ ప్లేయర్స్ ఎవ్వరూ కూడా రాణించడం లేదు. ధోనీ గాయంతో దూరమవడం సీఎస్కేపై గట్టిగానే ప్రభావం చూపించింది.

అయితే ముంబై(MI vs CSK)తో మ్యాచ్ కు ధోనీ ఫైనల్ ఎలెవన్ లో ఉంటాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆరంభంలో హ్యాట్రిక్ ఓటముల తర్వాత వరుసగా రెండు విజయాలతో కమ్ బ్యాక్ ఇచ్చిన చెన్నై సన్ రైజర్స్ చేతిలో ఓడిపోయింది. సంజూ శాంసన్ గత మ్యాచ్ లో నిరాశపరిచాడు.

MI vs CSK

మిగిలిన బ్యాటింగ్ లైనప్ లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. ఇక ఫామ్ లో ఉన్న ఏకైక బ్యాటర్ ఆయుశ్ మాత్రే గాయంతో సీజన్ కు దూరమవడం చెన్నైకి ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. అతని స్థానంలో ఉర్విల్ పటేల్ కు చోటు దక్కనుంది. సర్ఫరాజ్ ఖాన్, బ్రెవిస్ , దూబే నిలకడలేమితో ఇబ్బందిపడుతున్నారు.

ధోనీ తుది జట్టులోకి వస్తే మాత్రం ఖచ్చితంగా చెన్నైకి జోష్ పెరుగుతుంది. అటు బౌలింగ్ లో నూర్ అహ్మద్ తన స్పిన్ మ్యాజిక్ చూపిస్తున్నాడు. అలాగే ఓవర్టన్, అన్షుల్ కాంబోజ్ కు తోడుగా స్పెన్సర్ జాన్సన్ కూడా జత కలిస్తే చెన్నై బౌలింగ్ మరింత బలపడినట్టే. మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న వాంఖడే స్టేడియం బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది.

Rajasthan Royals : రాయల్ విక్టరీ..చిత్తుగా ఓడిన లక్నో

Exit mobile version