ICC Rankings : వన్డే ర్యాం”కింగ్”గిల్.. టీ ట్వంటీ టాప్ 50లోకి వైభవ్

ICC Rankings : ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో గిల్ రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. తొలి వన్డేలో 80 , రెండో వన్డేలో 77 రన్స్‌తో సిరీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ICC Rankings

ఐసీసీ ర్యాంకింగ్స్‌(ICC Rankings)లో భారత క్రికెటర్ల హవా కొనసాగుతోంది. ఇటు వన్డే, అటు టీ ట్వంటీ, టెస్ట్ మూడు ఫార్మాట్లలోనూ టీమిండియా ప్లేయర్స్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు. తాజాగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో శుభ్‌మ‌న్ గిల్ మళ్లీ అగ్రస్థానానికి దూసుకొచ్చాడు.

ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో గిల్ రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. తొలి వన్డేలో 80 , రెండో వన్డేలో 77 రన్స్‌తో సిరీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో ర్యాంకింగ్స్‌లో కివీస్ ఆల్ రౌండర్ డారిల్ మిఛెల్‌ను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్‌ను తిరిగి కైవసం చేసుకున్నాడు. విండీస్‌పై మిఛెల్ ఒక హాఫ్ సెంచరీకి పరిమితమవడంతో రెండో ప్లేస్‌కు పడిపోయాడు.

ఇదిలా ఉంటే భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ,రోహిత్ శర్మ టాప్ 5లో కొనసాగుతున్నారు. కోహ్లీ 3వ ర్యాంకులోనూ, రోహిత్ 4వ ర్యాంకులోనూ ఉన్నారు. అయితే వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో మాత్రం టాప్ 10లో ఒక్క భారత బౌలర్‌కు కూడా చోటు దక్కలేదు. కుల్దీప్ యాదవ్ 11వ స్థానంలో ఉండగా, సిరాజ్ 22, బుమ్రా 24వ స్థానంలోనూ కొనసాగుతున్నారు. వన్డేల్లో టాప్ బౌలర్‌గా ఆప్ఘన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ నిలిచాడు.

మరోవైపు టీ20 ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ బ్యాటర్ గా ఇషాన్ కిషన్ తన టాప్ ప్లేస్ నిలబెట్టుకున్నాడు. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న అభిషేక్ శర్మ మూడో స్థానానికి పడిపోగా.. తిలక్ వర్మ రెండు స్థానాలు మెరుగై ఆరో ర్యాంకులో నిలిచాడు.

ICC Rankings

కాగా భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఏకంగా 230 స్థానాలు ఎగబాకి టాప్ 50లోకి దూసుకొచ్చాడు. జింబాబ్వే టూర్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన వైభవ్ 151 పరుగులు చేశాడు. దీనిలో రెండు హాఫ్ సెంచరీలున్నాయి. ఈ ప్రదర్శనతో 48వ ర్యాంకుకు చేరుకున్నాడు.

గాయంతో జింబాబ్వే టీ20 సిరీస్‌ మొత్తానికి దూరమైన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఒక్కడే టాప్ 10లో ఉన్నాడు. అతను 8వ ర్యాంకులో నిలిచాడు. అటు టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో గిల్ 7, జైస్వాల్ 9వ ర్యాంకుల్లో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో బుమ్రా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక టీం ర్యాంకింగ్స్‌లో భారత జట్టు వన్డేలు, టీ20లు రెండింటిలోనూ టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది.

Anti-Paper Leak Bill : యాంటీ పేపర్ లీక్ బిల్లు పాస్..పేపర్ లీక్ ముఠాలకు పదేళ్ల జైలు, రూ.10 కోట్ల ఫైన్ అమలు సాధ్యమేనా?

Exit mobile version