Rajasthan Royals
ఐపీఎల్ 19వ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) మళ్లీ గెలుపు బాట పట్టింది. వరుసగా రెండు ఓటముల తర్వాత బౌన్స్ బ్యాక్ అయింది. లక్నో సూపర్ జెయింట్స్ పై అద్భుత విజయాన్ని అందుకుంది. బౌలింగ్ బాగుంటే స్కోరు భారీగా లేకున్నా మ్యాచ్ నిలబెట్టుకోవచ్చన్న విషయాన్ని రాజస్థాన్ రుజువు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో ఫీల్డింగ్ ఎంచుకుంది.
అయితే రాజస్థాన్(Rajasthan Royals) కు సరైన ఆరంభం దక్కలేదు. జైశ్వాల్ (22) పర్వాలేదనిపించినా వైభవ్ సూర్యవంశీ(8) , జురెల్ (0) విఫలమయ్యారు. వీరంతా ఒక ఓవర్ వ్యవధిలో ఔటయ్యారు. తర్వాత కెప్టెన్ జురెల్ , హెట్ మెయిర్ కాసేపు ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కూడా స్వల్ప వ్యవధిలో ఔటవడంతో 120 పరుగులు కూడా చేయడం అనుమానంగానే కనిపించింది.
ఈ దశలో రవీంద్ర జడేజా, ఫెరీరా మరోసారి కీలక పార్టనర్ షిప్ నెలకొల్పారు. ఫెరీరా 22 రన్స్ కు ఔటవగా.. జడేజా (29 బంతుల్లో 43) మాత్రం దూకుడు పెంచాడు. దూబేతో కలిసి భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఫలితంగా రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్లకు 159 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో షమీ, ప్రిన్స్ యాదవ్ , మోనిస్ ఖాన్ కు రెండేసి వికెట్లు దక్కాయి.
తర్వాత ఛేజింగ్ లో మరోసారి లక్నో సూపర్ జెయింట్స్ చేతులెత్తేసింది. బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు పనిచేయలేదు. ఆయుశ్ బదోనీ , పంత్ , మార్కరమ్ ముగ్గురూ డకౌటయ్యారు. దీంతో కేవలం 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే మార్ష్ ఒకవైపు పోరాడుతున్నా మిగిలిన బ్యాటర్ల నుంచి సపోర్ట్ లేకుండా పోయింది.
ఆదుకుంటాడనుకున్న పూరన్ (25) భారీస్కోరు చేయలేకపోయాడు. మరోవైపు మిఛెల్ మార్ష్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నా రాజస్థాన్ బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. వరుస ఓవర్లలో వికెట్లు తీసి లక్నోను దెబ్బకొట్టారు. దీంతో లక్నో 119 పరుగులకే ఆలౌటైంది. లక్నో ఇన్నింగ్స్ లో ఏడుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే ఔటయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్ 3, బర్గర్ 2, బ్రిజేష్ శర్మ 2 వికెట్లు తీసారు. ఈ విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకొచ్చింది.
Online Games : ఇకపై ఆన్‌లైన్ ఆటలపై ప్రభుత్వ నిఘా..మే 1 నుంచి కఠిన నిబంధనలు
