Rishabh Pant : చేజేతులా నాశనం..పంత్ కు ఇక వన్డేల్లో చోటు లేనట్టే

Rishabh Pant : ఐపీఎల్ అంటే యువ క్రికెటర్లందరికీ చక్కని వేదిక.. జాతీయ జట్టులోకి వచ్చేందుకు గొప్ప అవకాశం ఈ టోర్నీ.

Rishabh Pant

ఐపీఎల్ అంటే యువ క్రికెటర్లందరికీ చక్కని వేదిక.. జాతీయ జట్టులోకి వచ్చేందుకు గొప్ప అవకాశం ఈ టోర్నీ. కేవలం యువ ఆటగాళ్లకు మాత్రమే కాదు ఫామ్ కోల్పోయి టీమిండియాకు దూరమైన ప్లేయర్స్ కు సైతం ఐపీఎల్ మంచి అవకాశం. ఇక్కడ మళ్లీ ఫామ్ అందుకుంటే జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వొచ్చు. ఒకవేళ దానిని చేజార్చుకుంటే టీమిండియాలో ప్లేస్ ను కూడా చేజార్చుకున్నట్టే. ప్రస్తుతం రిషబ్ పంత్(Rishabh Pant) ది ఇదే పరిస్థితిగా కనిపిస్తోంది.

టెస్ట్ జట్టులో మాత్రమే నిలకడగా చోటు దక్కించుకుంటున్న పంత్ పరిమిత ఓవర్ల ఫార్మాట్ కు మాత్రం దూరమవుతూనే ఉన్నాడు. ఐపీఎల్ లో సత్తా చాటి మళ్లీ టీ20 లేదా వన్డే జట్టులోకి రీఎంట్రీ ఇస్తాడనుకుంటే వైఫల్యాల బాటను వీడడం లేదు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన పంత్ ఆట మాత్రం తుస్సుమంటోంది. గ

తేడాది మెగా వేలంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ అతడిని ఏకంగా రూ. 27 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే అతను ఈ ధరకు ఏమాత్రం న్యాయం చేయడం లేదు. గతేడాది 13 ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 269 పరుగులే చేయగలిగాడు. కెప్టెన్ గా సైతం ఫ్లాప్ అయ్యాడు. జట్టును ఏడో స్థానంలో నిలిపాడు. తాజాగా ఈ ఏడాది అతడి ప్రదర్శన మరింత దిగజారింది. ఇప్పటికి ఎనిమిది ఇన్నింగ్స్‌లో కలిపి 189 పరుగులే చేశాడు. అదే సమయంలో కెప్టెన్ గానూ ఆకట్టుకోలేకపోతున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటి వరకూ కేవలం రెండే మ్యాచ్ లు గెలిచింది.

తాజా పేలవ ప్రదర్శనతో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పంత్‌ భవిష్యత్‌ అగమ్యగోచరంగా తయారైంది 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచి జట్టులో ప్లేయర్ గా ఉన్న పంత్(Rishabh Pant) కు ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ టీంలో చోటే లేకుండా పోయింది. టీమిండియా తరఫున 2024లో చివరి టీ20 ఆడిన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.. అదే ఏడాది చివరిసారిగా వన్డే ఆడాడు.

Rishabh Pant

తాజాగా ఐపీఎల్‌లోనూ వైఫల్యాల నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్‌-2027 జట్టు ఎంపికలో పంత్‌ పేరును పరిగణనలోకి తీసుకునే అవకాశాలు లేనట్టే. జాతీయ మీడియా కథనాల ప్రకారం పంత్ కంటే కూడా వన్డేల్లో కీపర్ గా కేఎల్ రాహుల్ కే సెలక్టర్లు ప్రాధాన్యత ఇస్తున్నారు. రాహుల్ కు బ్యాకప్ గా సంజూ శాంసన్, జురెల్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ లో భారత్ విజేతగా నిలిచినప్పుడు సంజూ శాంసన్ పరుగుల వరద పారించాడు. అదిరిపోయే బ్యాటింగ్ తో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. దీంతో రాహుల్, సంజూ, జురెల్ పైనే సెలక్టర్లు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.

Ashu Reddy : మీడియాపై కోర్టుకెళ్లిన అషు రెడ్డి..తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

Exit mobile version