Mega 158
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మరోసారి మెగా తుపాను మొదలవ్వబోతోందనే సంకేతాలు గట్టిగా కనిపిస్తున్నాయి. మెగాస్టార్ లైనప్ చూస్తుంటేనే షాక్ అవుతున్న మెగా ఫ్యాన్స్‌కి, తాజాగా బయటకొచ్చిన ఒక సాలిడ్ అప్‌డేట్ ఊపిరి ఆడకుండా చేసేస్తోంది.
యంగ్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో రానున్న వర్కింగ్ టైటిల్ మెగా 158(Mega 158) గురించిన ఊహాగానాలకు తెరదించుతూ.. టీమ్ వదిలిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఫుల్‌గా షేక్ చేస్తోంది. బాబీ పుట్టినరోజు సందర్భంగా కేవీఎన్ ప్రొడక్షన్స్ విడుదల చేసిన ఈ మేకింగ్ వీడియో చూశాక, ఈసారి బాక్సాఫీస్ లెక్కలు తారుమారు కావడం పక్కా అంటూ మెగాభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు.
వాల్తేరు వీరయ్య మూవీ క్రియేట్ చేసిన సునామీ అభిమానుల కళ్లముందే ఉంది. థియేటర్లలో రచ్చ రచ్చ చేసిన ఆ సినిమా, మెగాస్టార్‌లోని అసలైన వింటేజ్ మాస్ యాంగిల్‌ను హండ్రెడ్ పర్సెంట్ బయటకు తీసింది. బాస్ టైమింగ్, కామెడీ, మాస్ యాక్షన్ సీన్లు ఇంకా ఆడియన్స్ మర్చిపోలేదు. ఆ హిట్ ఇచ్చిన ఊపుతోనే ఇప్పుడు రెండోసారి వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి.
ఈసారి కేవలం ఒక కమర్షియల్ మూవీని మాత్రమే కాదు, ఫ్యాన్స్‌కు ఫుల్ గ్రాండ్ మీల్స్ పెట్టేలా ఒక మైండ్ బ్లోయింగ్ మాస్ ఎంటర్‌టైనర్‌ను బాబీ రెడీ చేస్తున్నాడట. మెగాస్టార్‌కి ఎలాంటి స్టోరీ పడితే బాక్సాఫీస్ షేక్ అవుతుందో పక్కాగా ఊహించి, ఆ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టు సీన్లు రాసుకున్నాడని తెలుస్తోంది.
ఇటు ఈ బర్త్‌డే స్పెషల్ వీడియోలో..ప్రతి బ్లాక్‌బస్టర్ వెనుక ఒక విజన్ ఉంటుందంటూ మొదలైన విజువల్స్ వేరే లెవెల్‌లో ఉన్నాయి. సెట్స్‌పై బాబీ ఎంత ఎనర్జిటిక్‌గా ఉంటాడో, ఒక షాట్ కోసం ఎలా పరితపిస్తాడో, మైక్ పట్టుకుని టీమ్‌ను ఎలా నడిపిస్తాడో క్లియర్ కట్‌తో కట్ చేశారు. దీంతో పని రాబట్టుకోవడంలోనే కాదు, లోకేషన్‌లో అందరిలోనూ పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయడంలో బాబీకి ఉన్న స్టైలే వేరంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి..
దీనికితోడు మూవీ ప్రొడక్షన్ విషయంలో కూడా మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ భారీ బడ్జెట్‌తో ఈ మూవీని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. మ్యూజిక్‌కు థమన్, కెమెరా వర్క్‌కి విజయ్ కార్తీక్ కన్నన్, ఎడిటింగ్‌కి ఆంటోనీ రూబెన్, ఆర్ట్‌కి అవినాష్ కొల్ల వంటి టాప్ మోస్ట్ టెక్నికల్ టీమ్ రంగంలోకి దిగింది. దీంతో మెగా 158 థియేటర్లలో ఎలాంటి మాస్ విధ్వంసాన్ని సృష్టించబోతోందో చూడటానికి మెగా ఫ్యాన్స్.. ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
Bhogapuram Airport: ఉత్తరాంధ్ర కలల ఎయిర్‌పోర్ట్ రెడీ .. బాబు, పవన్, లోకేష్ భావోద్వేగ కామెంట్స్..
