SRH : షేక్ ఆడించిన అభిషేక్..సన్ రైజర్స్ హ్యాట్రిక్ విక్టరీ

SRH : ఉప్పల్ స్టేడియం హోరెత్తింది... సన్ రైజర్స్ అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ అభిషేక్ శర్మ బ్యాట్ నుంచి విధ్వంసకర ఇన్నింగ్స్ వచ్చేసింది

SRH

ఉప్పల్ స్టేడియం హోరెత్తింది… సన్ రైజర్స్ అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ అభిషేక్ శర్మ బ్యాట్ నుంచి విధ్వంసకర ఇన్నింగ్స్ వచ్చేసింది. అది కూడా హాఫ్ సెంచరీ కాదు ఏకంగా సెంచరీతో దుమ్మురేపేశాడు. భారీ సిక్సర్లతో ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫలితంగా భారీస్కోరు చేసిన సన్ రైజర్స్ బౌలింగ్ లోనూ రాణించి ఢిల్లీని చిత్తు చేసింది.

అంతేకాదు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఉప్పల్ స్టేడియం అంటేనే పరుగుల వరద. దీంతో ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ రెచ్చిపోయారు. ఈ సీజన్ లో ఇప్పటి వరకూ పెద్ద ఇన్నింగ్స్ ఆడని అభిషేక్ శర్మ చెలరేగిపోయాడు. బంతి పడడమే ఆలస్యం ఎడాపెడా బాదేశాడు. దీంతో ఉప్పల్ స్టేడియంలో చిరుజల్లులతో పాటు బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిసింది.

ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. గతంలోలా ఇష్టానుసారంగా బాల్స్ ను బాదకుండా చాలా పరిణితితో ఆడిన అభిషేక్ శర్మ 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నితీష్ రాణా వేసిన 15వ ఓవర్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాది 47 బంతుల్లో సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు.

ఐపీఎల్ లో అతనికి రెండో శతకం.సెంచరీ అనంతరం తన ట్రేడ్ మార్క్ లవ్ సైగలతో అభివాదం చేసాడు. ఈ సెంచరీతో పలు అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నాడు. రోహిత్ రికార్డును బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. టీ20 క్రికెట్ లో అత్యధిక శతకాలు చేసిన భారత క్రికెటర్ గా కోహ్లీతో సమంగా నిలిచాడు.

ఓవరాల్ గా టీ20 కెరీర్ లో అభిషేక్ కు ఇది 9వ సెంచరీ. అటు హెడ్ (37), ఇషాన్ కిషన్ (25), క్లాసెన్ 37 నాటౌట్ కూడా రాణించడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 242 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 68 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్సర్లతో 135 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

SRH

భారీ లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడుగానే ఆడింది. నిస్సాంక (8) త్వరగానే ఔటైనా కేఎల్ రాహుల్, నితీశ్ రాణా మెరుపులు మెరిపించారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 86 పరుగులు జోడించారు. కెఎల్ రాహుల్ 37 (1 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులకు ఔటవగా.. ఎహసాన్ మలింగ ఒకే ఓవర్లో నితీశ్ రాణా 30 బంతుల్లో 57 ( 7 ఫోర్లు, 3 సిక్సర్లు) , డేవిడ్ మిల్లర్(0) ఔట్ చేశాడు.

తర్వాత స్టబ్స్, రిజ్వీ దూకుడుగా ఆడుతూ 59 పరుగులు జోడించినా సన్ రైజర్స్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీశారు. ఫలితంగా ఢిల్లీ క్యాపిటల్స్ 195 పరుగులకే పరిమితమైంది. సన్ రైజర్స్ బౌలర్లలో మలింగ 4 , హర్ష దూబే 3 వికెట్లు తీశారు.

Trump : యుద్ధానికి సిద్ధంగా ఉండండి..ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్

Exit mobile version