Vijay : కోర్టు విచారణకు విజయ్ డుమ్మా..భార్యతో సెటిల్మెంట్ కు యత్నం
Vijay : తమిళ హీరో విజయ్, ఆయన భార్య సంగీత విడాకుల వ్యవహారం రాజీ దిశగా సాగుతోంది. భార్యతో విడాకుల అంశాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని విజయ్ భావిస్తున్నారు
Vijay
తమిళ హీరో విజయ్(Vijay), ఆయన భార్య సంగీత విడాకుల వ్యవహారం రాజీ దిశగా సాగుతోంది. భార్యతో విడాకుల అంశాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని విజయ్(Vijay) భావిస్తున్నారు. దీని కోసం ఇప్పటికే ఆయన తరపు లాయర్లు, సంగీత తరపు లాయర్లతో చర్చలు జరుపుతున్నారు.
ప్రస్తుతం భరణం విషయంలో ఇరు వర్గాల మధ్య సీరియస్ చర్చలు జరుగున్నాయి. ఈ క్రమంలో కోర్టు విచారణకు విజయ్(Vijay) గైర్హాజరయ్యారు. కోర్టు వెలుపల రాజీ చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, చర్చలు నడుస్తున్నాయని విజయ్ తరపు లాయర్లు న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. సానుకూల పద్ధతిలో చర్చలు జరుగుతున్నట్టు తెలిపారు.
సంగీత తరపు లాయర్లు కూడా ఇదే విషయాన్ని కోర్టుకు తెలియజేయడంతో జడ్జి తదుపరి విచారణను జూన్ 15కు వాయిదా వేశారు. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న విజయ్ భార్యతో విడాకుల అంశాన్ని ముగించుకోవాలని ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా వ్యక్తిగత వివాదాల నుంచి వీలైనంత త్వరగా బయటపడితే మంచిదని పలువురు సన్నిహితులు విజయ్ కు సూచించినట్టు తెలిసింది.
ఇదిలా ఉంటే విడాకుల కేసు కోర్టులో ఉండగా బయట జరుగుతున్న చర్చల్లో విజయ్ భార్య సంగీత భారీగా భరణం డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. రూ.250 కోట్లు భరణంగా చెల్లించాలని కోరినట్టు సమాచారం. అయితే విజయ్ మాత్రం రూ.35 కోట్ల నుంచి 50 కోట్ల వరకూ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై ఇరు వర్గాల తరపు లాయర్లు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

కేవలం చర్చలు సానుకూల పద్ధతిలో మాత్రమే జరుగుతున్నట్టు తెలిపారు. తర్వాత వాయిదా లోపు ఈ వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. కాగా విజయ్ – సంగీతలకు 1999లో వివాహమైంది. వీరికి జాసన్ సంజయ్, దివ్యసాష అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిద్దరు విడాకులు తీసుకోబోతున్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలో సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ముంగిట ఆమె ఇలా కోర్టులో కేసు వేస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. అంతేకాకుండా పిటిషన్ లో పలు సంచలన ఆరోపణలు కూడా చేసింది. తన భర్త విజయ్ కు మరో నటితో సన్నిహిత సంబంధాలున్నాయనీ ఆరోపించింది. ఆమెతో బంధం ముగిసిందంటూ తనకు చెప్పినా అది నిలబెట్టుకోలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. విజయ్ ప్రవర్తనతో విసిగిపోయానని, విడాకులు మంజూరు చేయాల్సిందిగా కోర్టును అభ్యర్థించారు.
Trump : యుద్ధానికి సిద్ధంగా ఉండండి..ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్





