SRH vs DC : సన్ రైజర్స్ హ్యాట్రిక్ కొట్టేనా ?..ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్

SRH vs DC : ఐపీఎల్ 19వ సీజన్ లో వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై మరో మ్యాచ్ కు సిద్ధమైంది.

SRH vs DC

ఐపీఎల్ 19వ సీజన్ లో వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై మరో మ్యాచ్ కు సిద్ధమైంది. హోంగ్రౌండ్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్(SRH vs DC) తో తలపడబోతోంది. రాజస్థాన్ రాయల్స్ , చెన్నై సూపర్ కింగ్స్ జట్లపై అదిరిపోయే విజయాలు సాధించిన సన్ రైజర్స్ ఇప్పుడు హ్యాట్రిక్ పై కన్నేసింది.

గత మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై అద్భుత విజయాన్ని అందుకుంది. గెలుపు కష్టమే అనుకున్న దశలో బౌలర్లు మ్యాజిక్ చేసారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి దూసుకెళ్లిన ఆరెంజ్ ఆర్మీ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. వరుస విజయాలు సాధిస్తున్నా బ్యాటింగ్ లో కొందరు ఫామ్ లో లేకపోవడం ఇబ్బందిగా మారింది.

అభిషేక్ శర్మ నిలకడగా రాణించకపోవడం, హెడ్ మెరుపులు తగ్గిపోవడంతో పాటు నితీష్ కుమార్ రెడ్డి స్థాయికి తగిన ఇన్నింగ్స్ ఆడలేకపోవడం సన్ రైజర్స్ కు మైనస్ గా మారాయి. ఇషాన్ కిషన్, క్లాసెన్ మాత్రమే ఫామ్ లో ఉండగా.. మిగిలిన బ్యాటర్లు కూడా రాణిస్తే భారీస్కోరు సాధించొచ్చు. ఈ సీజన్ లో హైదరాబాద్ కు అత్యంత నిలకడగా రాణిస్తున్న క్లాసెన్ పైనే మరోసారి అంచనాలు నెలకొన్నాయి.

అటు బౌలింగ్ లో మాత్రం సన్ రైజర్స్ అదరగొడుతోంది. అసలు బౌలింగే లేదు అన్న అభిప్రాయం మారిపోయేలా గత రెండు మ్యాచ్ లలో బౌలర్లే గెలిపించారు. యువ పేసర్లు ప్రఫుల్ హింగే, హుస్సేన్ కీలకంగా మారిపోయారు. చెన్నై సూపర్ కింగ్స్ పై భారీగా పరుగులు ఇచ్చినా ప్రఫుల్ చివర్లో గెలిపించాడు.

SRH vs DC

అటు హుస్సేన్ తో పాటు స్పిన్నర్ శివాంగ్ కుమార్ కూడా రాణిస్తుండడం కలిసొచ్చే అంశం. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండు పరాజయాల తర్వాత అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించి గెలుపు తమ సత్తా నిరూపించుకుంది. ముఖ్యంగా ఢిల్లీ బౌలర్లు ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ ను కట్టడి చేయడం ఆకట్టుకుంది.

అలాగే కేఎల్ రాహుల్, స్టబ్స్ ఫామ్ లోకి రావడం ఢిల్లీకి గొప్ప రిలీఫ్. ఎందుకంటే ఈ సీజన్ లో రాహుల్ పేలవ ఫామ్ తో నిరాశపరిచాడు. కానీ ఆర్సీబీపై తన రికార్డును నిలుపుకుంటూ చిన్నస్వామిలో దుమ్మురేపాడు. అటు స్టబ్స్ కూడా మ్యాన్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. వీరితో పాటు అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్ కూడా ఫామ్ లోకి రావడంతో ఢిల్లీ(SRH vs DC) కూడా ఫుల్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తోంది. రెండు జట్లలోనూ టీ20 హిట్టర్లు ఉండడంతో ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది.

Airport : ఏపీలో ఎయిర్‌పోర్టుల జోరు.. ఏ జిల్లాలో ఏయే ఎయిర్‌పోర్టులు ఉన్నాయో తెలుసా?

Exit mobile version