Airport : ఏపీలో ఎయిర్‌పోర్టుల జోరు.. ఏ జిల్లాలో ఏయే ఎయిర్‌పోర్టులు ఉన్నాయో తెలుసా?
Airport : పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నెల్లూరు జిల్లాలో లేటెస్ట్ హంగులతో ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి సర్వం సిద్ధమైంది.
Airport
విమానయాన రంగంలో ఆంధ్రప్రదేశ్ మరో భారీ ముందడుగు వేయబోతోంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నెల్లూరు జిల్లాలో లేటెస్ట్ హంగులతో ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి సర్వం సిద్ధమైంది. దగదర్తి వేదికగా త్వరలోనే ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభం కాబోతున్నాయి.
ఇప్పటికే దీనికి ఏపీ కేబినెట్ దీనికి పచ్చజెండా ఊపడమే కాకుండా, భూసేకరణ , మౌలిక సదుపాయాల కోసం నిధులను కూడా రిలీజ్ చేసింది. ఈ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే దక్షిణ ఏపీ రూపురేఖలు మారిపోతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
సుమారు 1332 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించనున్నారు. దీనిని కేవలం ప్రయాణికుల కోసమే కాకుండా, దగ్గరలోని కృష్ణపట్నం, రామాయపట్నం పోర్టులు, నేషనల్ హైవేలు , పారిశ్రామిక జోన్లకు కనెక్టివిటీ పెరగనుంది. దీనివల్ల నెల్లూరు జిల్లా పారిశ్రామికంగా, లాజిస్టిక్స్ పరంగా గ్లోబల్ హబ్‌గా మారే ఛాన్స్ ఉంది.
తొలి దశలో ఏటా 1.4 లక్షల మంది ప్రయాణించేలా ఏర్పాట్లు చేసి, ఫ్యూచర్లో ఈ సామర్థ్యాన్ని 15 మిలియన్లకు పెంచాలని ఏపీ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ఎగుమతి, దిగుమతుల కోసం కార్గో సదుపాయాన్ని కూడా ఇక్కడ కల్పించబోతున్నారు. జూన్ , జూలైకి ఈ పనులకు శంకుస్థాపన చేసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
ప్రస్తుతం ఏపీలో 6 ప్రధాన ఆపరేషనల్ ఎయిర్‌పోర్టులు అందుబాటులో ఉన్నాయి.
ఏపీలోనే అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖపట్నం. పర్యాటకంగా, పారిశ్రామికంగా అత్యంత రద్దీ కలిగిన ఎయిర్పోర్ట్ ఇది.
రాజధాని ప్రాంతానికి గుండెకాయ వంటిది విజయవాడ (గన్నవరం) ఎయిర్ పోర్ట్. దీనికి కూడా అంతర్జాతీయ హోదా ఉంది. వ్యాపార వేత్తలకు, రాజకీయ ప్రముఖులకు ఇది ప్రధాన మార్గం.
ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రం కావడంతో తిరుపతి (రేణిగుంట) ఎయిర్ పోర్ట్‌కు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. దీనిని కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దారు.
గోదావరి తీరాన ఉన్న రాజమండ్రి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ పరంగా చాలా కీలకం. ప్రధానంగా డొమెస్టిక్ సర్వీసులకు ఇది వేదిక.
రాయలసీమ ప్రాంత డెవలప్మెంట్లో కడప ఎయిర్పోర్ట్ కీలక పాత్ర పోషిస్తోంది. ఉడాన్ పథకం కింద ఇక్కడ విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
కర్నూలు (ఓర్వకల్లు) కూడా ఇటీవలే అందుబాటులోకి వచ్చిన డొమెస్టిక్ ఎయిర్పోర్ట్. పారిశ్రామిక రంగానికి ఇది ఊతమిస్తోంది.
ఇవే కాకుండా పుట్టపర్తి , నాగార్జున సాగర్‌లో ప్రైవేట్/చిన్న ఎయిర్‌పోర్టులు ఉన్నాయి.

విజయనగరం జిల్లాలో నిర్మిస్తున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జూలైలో ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఇది ఉత్తరాంధ్ర దశను మారుస్తుందని భావిస్తున్నారు. దగదర్తి కూడా పూర్తయితే ఏపీలో మొత్తం 8 మెయిన్ ఎయిర్‌పోర్టులు అందుబాటులోకి వస్తాయి.
అంతేకాకుండా, శ్రీకాకుళం, ఒంగోలు, కుప్పం, తాడేపల్లిగూడెం , అమరావతి వంటి ప్రాంతాల్లో కూడా కొత్త ఎయిర్‌పోర్టుల కోసం ప్రతిపాదనలు ఉన్నాయి. ఇవన్నీ పూర్తయితే ఏపీలో సుమారు ప్రతి వంద కిలోమీటర్లకు ఒక ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చి, రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి.
Vijay : హీట్ పెంచుతున్న విజయ్ విడాకుల వ్యవహారం.. జూన్ 15న కోర్టులో ఏం జరగబోతోంది?





