Bhuvneshwar : పేస్ పదును తగ్గని భువనేశ్వర్..ఐపీఎల్ లో ఆకట్టుకున్న స్వింగ్ కింగ్

Bhuvneshwar : ఆర్సీబీ మరోసారి ఐపీఎల్ గెలుచుకోవడంలో భువనేశ్వర్ కీలకపాత్ర పోషించాడు. 16 మ్యాచ్ లలో ఏకంగా 28 వికెట్లు పడగొట్టాడు

Bhuvneshwar

ఐపీఎల్ అంటే కుర్రాళ్ల టాలెంట్ ను వెలికి తీయడం.. అంతే కాదు కొందరు సీనియర్ల కెరీర్ కు మరో అవకాశం ఇవ్వడం కూడా..తమలో ఇంకా ఆట తగ్గలేదని నిరూపించుకునేందుకు కూడా సీనియర్ ప్లేయర్స్ కు ఈ లీగ్ మంచి అవకాశమే. ప్రస్తుతం ముగిసిన ఐపీఎల్ 19వ సీజన్ లో భువనేశ్వర్(Bhuvneshwar) ఈ అవకాశాన్ని బాగా వినియోగించుకున్నాడు. వయసు మీద పడింది.. ఇక రిటైర్మెంట్ ప్రకటనే మిగిలిందన్న విమర్శల మధ్య అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

స్వింగ్ కింగ్ గా తనకున్న పేరును మరోసారి నిలబెట్టుకుంటూ అదరగొట్టాడు. తన పేస్ లో పదును ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. ముఖ్యంగా పవర్ ప్లేలోనూ, స్లాగ్ ఓవర్లలోనూ బ్యాటర్లను అద్భుతంగా కట్టడి చేశాడు. ఈ సీజన్ లో తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.

2022లో చివరిసారిగా భారత జెర్సీలో కనిపించిన భువీ తర్వాత వరుస గాయాలతో దూరమయ్యాడు. దేశవాళీ క్రికెట్ లోనూ, ఐపీఎల్ లోనూ సత్తా చాటి మళ్లీ రీఎంట్రీ కోసం ప్రయత్నించినా కుర్రాళ్ల పోటీతో వెనుకబడిపోయాడు. టీమిండియాలో చోటు దక్కలేదు.

అయినా నిరాశ చెందని భువీ ఐపీఎల్ తో పాటు దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణిస్తూ తన బౌలింగ్ సత్తాను నిరూపించుకుంటూనే ఉన్నాడు. ముఖ్యంగా 2024 ఐపీఎల్ తర్వాత సన్ రైజర్స్ వదిలేయడంతో ఆర్సీబీకి వచ్చిన భువీ ఆ జట్టులో కీలక బౌలర్ గా మారాడు. 2025 సీజన్ లో బెంగళూరు ఛాంపియన్ కావడంలో అతనిదే కీలకపాత్ర. 14 మ్యాచ్ లలో 17 వికెట్లు పడగొట్టాడు.

Bhuvneshwar

3అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ప్రదర్శనలు ఐదు ఉన్నాయి. ప్రస్తుత సీజన్ లోనూ ఆర్సీబీ మరోసారి ఐపీఎల్ గెలుచుకోవడంలో భువనేశ్వర్(Bhuvneshwar) కీలకపాత్ర పోషించాడు. 16 మ్యాచ్ లలో ఏకంగా 28 వికెట్లు పడగొట్టాడు. పర్పుల్ క్యాప్ రేసులో రెండో స్థానంలో నిలిచిన భువీకి, టాప్ ప్లేస్ లో ఉన్న రబాడకు ఒక వికెట్ మాత్రమే తేడా ఉంది.

బ్యాటర్ల ఆధిపత్యంగా నిలిచిన ఈ సీజన్ లో భువీ 7.95 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. ఈ ప్రదర్శనతో మరోసారి తన పేస్ పదును నిరూపించుకున్న భువనేశ్వర్ కు టీ20 ఫార్మాట్ లోనైనా సెలక్టర్లు అవకాశమిస్తారేమో చూడాలి.

Cockroach Janta Party : భారత్ కు కాక్రోచ్ పార్టీ ఫౌండర్..జూన్ 6న ఏం జరగబోతోంది ?

Exit mobile version