ICC : ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నీ…నలుగురు భారత క్రికెటర్లకు చోటు

ICC : టీ20 ప్రపంచకప్ వరుసగా రెండోసారి గెలిచి చరిత్ర సృష్టించిన భారత్ ఈ టోర్నీలో నిలకడగా రాణించింది. బౌలింగ్ లో కాస్త తడబడినా ఓవరాల్ గా అంచనాలకు తగ్గట్టే ఫైనల్ కు చేరి టైటిల్ పోరులో కివీస్ ను చిత్తు చేసింది

ICC

టీ20 ప్రపంచకప్ వరుసగా రెండోసారి గెలిచి చరిత్ర సృష్టించిన భారత్ ఈ టోర్నీలో నిలకడగా రాణించింది. బౌలింగ్ లో కాస్త తడబడినా ఓవరాల్ గా అంచనాలకు తగ్గట్టే ఫైనల్ కు చేరి టైటిల్ పోరులో కివీస్ ను చిత్తు చేసింది. అయితే ఈ విజయంలో కీలకపాత్ర పోషించిన పలువురికి గుర్తింపు దక్కింది. ఐసీసీ(ICC) ప్రకటించిన టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ 2026లో నలుగురు భారత ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు.

వికెట్ కీపర్ కమ్ ఓపెనర్ గా సంజూ శాంసన్ ఎంపికయ్యాడు. ఈ మెగా టోర్నీలో సంజూ శాంసన్ కీలక మ్యాచ్ లలో చెలరేగిపోయాడు. వరుసగా హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు సాధించాడు. వెస్టిండీస్ పై నాకౌట్ పోరులోనూ, సెమీఫైనల్లో ఇంగ్లాండ్ పైనా, తర్వాత ఫైనల్లో న్యూజిలాండ్ పైనా మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టుకు భారీస్కోరు అందించాడు. ఓవరాల్ గా 199 స్ట్రైక్ రేట్ తో 321 పరుగులు చేశాడు.

అలాగే వన్ డౌన్ లో ఇషాన్ కిషన్, ఐదో స్థానంలో హార్థిక్ పాండ్యా, పేస్ బౌలర్ గా జస్ప్రీత్ బుమ్రా చోటు దక్కించుకున్నారు. ఈ వరల్డ్ కప్ లో ఇషాన్ కిషన్ కూడా విధ్వంసకర ఇన్నింగ్స్  ఆడాడు. 193కు పైగా స్ట్రైక్ రేట్ తో 317 పరుగులు చేశాడు.

ICC

అలాగే ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా కూడా ఎంపికయ్యాడు. హార్థిక్ రెండు హాఫ్ సెంచరీలతో పాటు 9 వికెట్లు పడగొట్టాడు. అటు పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా చోటు దక్కించుకున్నాడు. అత్యంత ఎకానమీ బౌలర్ గానూ, కీలక సమయాల్లో వికెట్లు తీసుకునే బౌలర్ గానూ బుమ్రా నిలిచాడు.

ఫైనల్లో 4 ఓవర్లలో కేవలం 15 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్ గా (ICC )టోర్నీలో 8 మ్యాచ్ లు ఆడిన బుమ్రా 14 వికెట్లు పడగొట్టాడు. మిగిలిన జట్టును చూస్తే సౌతాఫ్రికా మార్క్ రమ్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. పాక్ క్రికెటర్ ఫర్హాన్ ఓపెనర్ గానూ, విల్ జాక్స్ ఆరోస్థానంలోనూ, జాసన్ హోల్డర్ ఏడు, లుంగి ఎంగిడి 9, ఆదిల్ రషీద్ , ముజర్బానీ ఎంపికయ్యారు. 12వ ఆటగాడిగా షాడ్లే వాన్ షాల్ క్విక్ చోటు దక్కించుకున్నాడు.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version