Team India : శ్రీలంక టూర్ ముగియగానే పరిమిత ఓవర్ల మోడ్..న్యూజిలాండ్‌ పర్యటన షెడ్యూల్ ఇదే..

Team India : టెస్టు సిరీస్ కంటే ముందే భారత్, న్యూజిలాండ్ జట్లు పొట్టి ఫార్మాట్, వన్డేలలో ఫేస్ టు ఫేస్ డీ కొట్టబోతున్నాయి.

Team India

కొలంబో వేదికగా ప్రజెంట్ శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ ఆగస్టు 27వ తేదీతో ముగియనుండటంతో .. టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్‌కు టెంపరరీగా కాస్త బ్రేక్ ఇవ్వబోతోంది. ఆ వెంటనే లిమిటెడ్ ఓవర్ల మోడ్‌లోకి మనోళ్లు షిఫ్ట్ అవబోతున్నారు.

సెప్టెంబర్, అక్టోబర్ అంతా వైట్ బాల్ మ్యాచ్‌లతో ఫుల్ బిజీగా గడిపే టీమిండియా జట్టు, ఆ తర్వాత నవంబర్ 2026లో న్యూజిలాండ్ టూర్‌కు ఫ్లైట్ ఎక్కబోతోంది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 సైకిల్‌లో భాగంగా ఈ సిరీస్ మన క్రికెటర్స్‌కు చాలా క్రూషియల్‌గా మారనుంది.

మామూలుగానే న్యూజిలాండ్ పిచ్‌లపై ఎక్స్‌ట్రా బౌన్స్, స్వింగ్, పేస్ ఓ రేంజ్‌లో ఉంటాయి. అలాంటి హార్డ్ వెదర్‌లో భారత బ్యాటర్లు, బౌలర్లు ఎలా రాణిస్తారనేదే ఇప్పుడు అందరి మైండ్‌ను తొలిచేస్తుంది.

అయితే టెస్టు సిరీస్ కంటే ముందే భారత్, న్యూజిలాండ్ జట్లు పొట్టి ఫార్మాట్, వన్డేలలో ఫేస్ టు ఫేస్ డీ కొట్టబోతున్నాయి. అక్టోబర్ 22వ తేదీ నుంచి మొత్తం 5 టీ20లు, ఆ తర్వాత నవంబర్‌లో 5 వన్డే మ్యాచ్‌లు జరగబోతున్నాయి. ఈ వైట్ బాల్ రచ్చ పూర్తయ్యాకే రెండు టెస్టుల సుదీర్ఘ సమరం షురూ అవుతుంది.

దీనిలో మొదటి టెస్టు మ్యాచ్ నవంబర్ 19వ తేదీ నుంచి 23 వ తేదీ వరకు వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్ వేదికగా సాగనుంది. ఇక రెండో టెస్టు నవంబర్ 27 వ తేదీ నుంచి డిసెంబర్ 1 వ తేదీ వరకు క్రైస్ట్‌ చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ గ్రౌండ్‌లో జరగనుంది.

ఈ రెండు మ్యాచులు అక్కడ లోకల్ టైమింగ్స్ ప్రకారం ఉదయం 11 గంటలకే స్టార్ట్ అయినా..మన టైమింగ్స్ ప్రకారం చూస్తే మాత్రం తెల్లవారుజామున 3 గంటలకే టాస్ పడి.. 3:30 గంటలకు మొదటి బాల్ పడుతుంది. అంటే మన ఫ్యాన్స్ ఈ మ్యాచులను లైవ్‌లో చూడాలంటే మాత్రం ఎర్లీ మార్నింగ్‌ నిద్ర లేవాల్సిందే అన్నమాట.

ప్రజెంట్ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ కోసం జరుగుతున్న రేసులో ఈ రెండు టెస్టుల సిరీస్ టీమిండియా(Team India) ఫ్యూచర్‌ను పూర్తిగా డిసైడ్ చేసే ఛాన్స్ ఉంది. రూల్స్ ప్రకారం ఒక టెస్ట్ గెలిస్తే 12 పాయింట్లు వస్తాయి. కాబట్టి ఈ రెండు మ్యాచుల్లోనూ మనోళ్లు ప్రతాపం చూపిస్తే భారత్‌ అకౌంట్‌లో ఏకంగా 24 పాయింట్లు చేరతాయి.

Team India

ప్రజెంట్ న్యూజిలాండ్ కూడా ఫైనల్ రేసులోనే పోటీ పడుతుండటంతో.. ఈ పాయింట్ల ఫైట్ చాలా హాట్ గా మారబోతోంది. టీమిండియా(Team India) ఫైనల్ హోప్స్ సజీవంగా ఉండాలంటే ఈ రెండు మ్యాచ్‌లలోనూ గెలిచి పాయింట్ల పర్సెంటేజ్‌ను గట్టిగా మెరుగుపరుచుకోవడం తప్ప భారత్‌కు వేరే మార్గం లేదు. శ్రీలంక పర్యటన తర్వాత కొంతకాలం టెస్టులకు దూరంగా ఉండబోతన్న టీమిండియా, నవంబర్‌లో కివీస్ విసిరే ఈ ఛాలెంజ్‌ను ఏ విధంగా ఫేస్ చేస్తుందో చూడాలి.

Adulterated Food : తెలుగు రాష్ట్రాల్లో కల్తీ మాఫియా పంజా.. FSSAI ర్యాంకింగ్స్‌లో దారుణ ప్రదర్శన ఉన్నా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయ్?

Exit mobile version