Vaibhav
మామూలుగా పది పదిహేనేళ్ల కుర్రవాళ్లంతా మ్యాచ్‌లు చూస్తూనో లేదంటే స్కూల్ క్రికెట్ ఆడుతూనో కనిపిస్తారు. కానీ కేవలం 15 ఏళ్ల వయసున్న బుడ్డోడు ..వైభవ్ సూర్యవంశీ మాత్రం దులీప్ ట్రోఫీ వంటి ప్రతిష్ఠాత్మకమైన టోర్నమెంట్‌లో ఏకంగా ఈస్ట్ జోన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.
బెంగళూరు వేదికగా సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న హోరాహోరీ సెమీ ఫైనల్‌లో.. ఈస్ట్ జోన్ రెగ్యులర్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అనుకోని విధంగా గాయపడటంతో, ఆ జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న వైభవ్.. అనూహ్యమైన పరిస్థితుల్లో కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించాల్సి వచ్చింది. దీంతో భారత దేశవాళీ క్రికెట్ హిస్టరీలోనే ఎవరూ ఊహించని సంఘటన బెంగళూరు మైదానంలో ఆవిష్కృతమైనట్లు అయింది.
ఇదంతా సెంట్రల్ జోన్ ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో జరిగింది. వికెట్ కీపింగ్ చేస్తున్న ఇషాన్ కిషన్ కుడి చేతి మణికట్టుకు..బాల్ బలంగా తగలడంతో తీవ్రమైన నొప్పితో మైదానంలోనే కుప్పకూలిపోయాడు. వెంటనే ఫిజియోలు మైదానంలోకి వచ్చి ప్రైమరీ ట్రీట్మెంట్ అందించినా కూడా నొప్పి ఏమాత్రం తగ్గకపోవడంతో ఇషాన్ గ్రౌండ్ వీడి బయటకు వెళ్లక తప్పలేదు.
ఈ అత్యవసర పరిస్థితిలో ఇషాన్ ప్లేస్‌లో కుమార్ కుశాగ్ర వికెట్ కీపింగ్ బాధ్యతలను స్వీకరించగా, టీమ్‌ను నడిపించే అరుదైన కెప్టెన్సీ పగ్గాలు మాత్రం 15 ఏళ్ల వైభవ్ చేతికి వచ్చాయి. దీంతో ఫస్ట్ క్లాస్ క్రికెట్ హిస్టరీలోనే ఇంత చిన్న వయసులో ఒక సీనియర్ ఫస్ట్ క్లాస్ టీమ్‌కి కెప్టెన్‌గా వహించిన కుర్రాడిగా వైభవ్ పేరు మీద ఒక అరుదైన రికార్డు నమోదైంది.
నిజానికి టోర్నీ స్టార్ట్ అయ్యే ముందే 15 ఏళ్ల వైభవ్‌ను వైస్ కెప్టెన్‌గా సెలక్ట్ చేయడంపై దేశవాళీ క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలు, అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈస్ట్ జోన్ సెలెక్టర్లు మాత్రం తమ డెసిషన్‌ను చాలా స్పష్టంగా సమర్థించుకున్నారు.
కేవలం ఇప్పటి అవసరాల కోసమే కాకుండా ఫ్యూచర్‌లో భారత క్రికెట్‌ను నడిపించే గొప్ప లీడర్‌గా తీర్చిదిద్దాలనే ఆలోచనతోనే ఈ కుర్రాడికి వైస్ కెప్టెన్సీ అప్పగించామని అప్పుడే క్లారిటీ ఇచ్చేశారు. 2024 ప్రారంభంలోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన వైభవ్‌కు.. ఇది కేవలం పదో ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కాగా ఇది రెండో దులీప్ ట్రోఫీ మ్యాచ్ మాత్రమే కావడం మరో విశేషంగా నిలుస్తోంది.
అయితే ఎలాంటి ముందుగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా.. హఠాత్తుగా కెప్టెన్సీ భారం భుజాన పడినా వైభవ్(Vaibhav) ఏమాత్రం ఒత్తిడికి గురి కాకుండా గ్రౌండ్‌లో చూపించిన మెచ్యూరిటీ అందరినీ ఆశ్చర్యపరిచింది. మైదానంలో ఉన్న ఆటగాళ్లందరిలోకి తానే చాలా చిన్నవాడయినా సరే, మహ్మద్ షమీ, ముఖేష్ కుమార్, అభిమన్యు ఈశ్వరన్ వంటి ఇంటర్నేషనల్, రంజీ అనుభవజ్ఞులైన స్టార్ ప్లేయర్లతో కూడిన టీమ్‌ను చాలా కూల్‌గా నడిపించాడు.
ఇంటర్నేషనల్ స్థాయిలో మెరిసిన వరల్డ్ క్లాస్ బౌలర్లకు ఫీల్డింగ్ పొజిషన్లు సెట్ చేస్తూ, పక్కా స్ట్రాటజీనీ ఫాలో అవుతూ లంచ్ బ్రేక్‌కు సెంట్రల్ జోన్‌ను 81 పరుగులకే 3 ముఖ్యమైన వికెట్లు కోల్పోయేలా చేశాడు. ఇషాన్ కిషన్ ఈ గాయం నుంచి కోలుకోవడానికి ఎంత టైమ్ పట్టినా, ఈ మ్యాచ్ మాత్రం ఇండియన్ క్రికెట్‌లో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అంతేకాదు రాకెట్‌లా దూసుకుపోతున్న వైభవ్ కెరీర్‌లో ఇదొక మైలురాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి డౌట్ కూడా లేదు.
CAPTAIN VAIBHAV SOORYAVANSHI 🔥
— Johns. (@CricCrazyJohns) August 30, 2026
– Vaibhav Sooryavanshi is currently leading the Easy Zone team in Duleep Trophy. pic.twitter.com/cGaFDpceMD
Nepal : నేపాల్‌ను వదలని ఉపద్రవం..నాలుగు జిల్లాల ప్రజలు ఖాళీ చేయాలని ఆదేశాలు..
