GT vs SRH : టాప్ లేపేది ఎవరు ?..గుజరాత్ తో సన్ రైజర్స్ ఢీ

GT vs SRH : ఐపీఎల్ నిర్ణయాత్మక చివరి దశకు చేరుకోవడంతో, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ , మూడో స్థానంలో ఉన్న గుజరాత్ అహ్మదాబాద్‌లో జరిగే కీలక పోరుకు తలపడబోతున్నాయి.

GT vs SRH

ఐపీఎల్ 19వ సీజన్ లో సెకండాఫ్ చివరి దశలో ఉంది. ఇప్పటికే టోర్నీ నుంచి రెండు జట్లు ఇంటిదారి పట్టగా ప్లే ఆఫ్ రేసులో 8 జట్లు నిలిచాయి. ప్రస్తుతం ప్లే ఆఫ్ బెర్తుల కోసం పోటీ ఆసక్తికరంగా మారిన వేళ వరుస విజయాలతో జోరు మీదున్న సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్(GT vs SRH) తలపడబోతున్నాయి. అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు టాప్ ప్లేస్ కు దూసుకెళుతుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. ఇప్పటి వరకూ 11 మ్యాచ్ లు ఆడిన ఆరెంజ్ ఆర్మీ ఏడింటిలో గెలిచింది. వరుసగా ఐదు మ్యాచ్ లు గెలిచిన తర్వాత హోంగ్రౌండ్ లో కోల్ కతాపై ఓడిపోవడం షాక్ కు గురిచేసింది. అయితే తర్వాతి మ్యాచ్ లో పటిష్టమైన పంజాబ్ కింగ్స్ ను చిత్తు చేసింది.

బ్యాటింగ్ లో అందరూ ఫామ్ లోకి రావడం సన్ రైజర్స్ విజయాలకు కారణంగా చెప్పొచ్చు. అభిషేక్ శర్మ, హెడ్ , ఇషాన్ కిషన్, క్లాసెన్ , నితీశ్ రెడ్డి అదరగొడుతున్నారు. అత్యధిక పరుగుల జాబితాలో సన్ రైజర్స్ బ్యాటర్లదే ఆధిపత్యంగా ఉంది. ముఖ్యంగా క్లాసెన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. దాదాపు ప్రతీ మ్యాచ్ లోనూ కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు. 1

1 మ్యాచ్ లలో 494 పరుగులతో ఆరెంజ్ క్యాప్ క్లాసెన్ తోనే ఉంది. అభిషేక్ శర్మ ఈ జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అటు బౌలింగ్ లో ప్యాట్ కమిన్స్ వచ్చిన తర్వాత సన్ రైజర్స్ మరింత పుంజుకుంది. కమిన్స్ రాకముందే యువ బౌలర్లు కొన్ని మ్యాచ్ లలో అదరగొట్టారు. సాకిబ్ హొస్సేన్, ఎహసాన్ మలింగ, శివాంగ్ కుమార్, హర్ష దూబే రాణిస్తున్నారు.

మరోవైపు గుజరాత్ టైటాన్స్ కూడా మంచి ఫామ్ లో ఉంది. ఆరంభంలో తడబడినా తర్వాత కమ్ బ్యాక్ ఇచ్చింది. వరుసగా నాలుగు విజయాలతో టాప్ 4లోకి దూసుకొచ్చింది. చెన్నై , బెంగళూరు, పంజాబ్, రాజస్థాన్ జట్లపై అదిరిపోయే ఆటతీరుతో విజయాలను అందుకుంది. బ్యాటింగ్ లో గుజరాత్ కీలక ఆటగాళ్ళందరూ ఫామ్ లో ఉన్నారు.

GT vs SRH

సాయి సుదర్శన్ , గిల్ ఇచ్చే ఆరంభాలకు ఆ జట్టు సునాయాసంగా భారీస్కోర్లు చేస్తోంది. బట్లర్ , వాషింగ్టన్ సుందర్ , హోల్డర్ మెరుపులు మెరిపిస్తున్నారు. అటు బౌలింగ్ లో సైతం గుజరాత్ అదరగొడుతోంది. రబాడ, సిరాజ్ తో పాటు జాసన్ హోల్డర్ కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా హోల్డర్ బంతితో చివరి ఓవర్లలో ప్రత్యర్థి జట్లకు సవాల్ గా మారాడు.

స్పిన్ విభాగంలో రషీద్ ఖాన్ సెకండాఫ్ లో తన మ్యాజిక్ చూపిస్తున్నాడు. వాషింగ్టన్ సుందర్ కూడా రాణిస్తుండడంతో గుజరాత్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. గత రికార్డులను చూస్తే గుజరాత్ ఏడు మ్యాచ్ లలో ఐదు గెలవగా..సన్ రైజర్స్(GT vs SRH) ఒకటే గెలిచింది. అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని అంచనా.

SIT : బండి కుమారుడిపై కేసు..సిట్ తో విచారణకు సీఎం ఆదేశం

Exit mobile version