Womens T20 : అలా సె”మిస్” అయింది..భారత్ మహిళల ఓటమికి కారణాలివే

Womens T20 : సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో నిరాశ పరిచింది.గ్రూప్ స్టేజ్ చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో భారత మహిళల జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది

Womens T20

మహిళల టీ ట్వంటీ(Womens T20) ప్రపంచ కప్‌లో భారత్ కథ ముగిసింది. పొట్టి ప్రపంచ కప్ గెలవాలనుకున్న వన్డే ఛాంపియన్స్ కల ఈసారి కూడా నెరవేరలేదు. ఈ మెగా టోర్నీలో హర్మన్‌ప్రీత్‌ సారథ్యంలోని భారత్ జట్టు ఓటమికి చాలా కారణాలున్నాయి. టోర్నీ ఆరంభం నుంచీ చెత్త ఫీల్డింగ్, పేసర్ల పస లేని బౌలింగ్, నిలకడ లేని మిడిలార్డర్ బ్యాటింగ్ టోర్నీ నుంచి గ్రూప్ స్టేజ్ లోనే ఇంటిదారి పట్టేలా చేశాయి.

ముఖ్యంగా సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో నిరాశ పరిచింది.గ్రూప్ స్టేజ్ చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో భారత మహిళల జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత్ విధించిన 171 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా మరో ఓవర్ మిగిలి ఉండేలా ఛేదించింది.

అంతకుముందు సౌతాఫ్రికా చేతిలో కూడా భారత్ పరాజయం పాలైంది. నిజానికి ఆస్ట్రేలియా లాంటి అగ్రశ్రేణి జట్టుతో ఆడుతున్నప్పుడు వీలైనంత ఎక్కువ టార్గెట్ ఉంచేలా ఆడాలి. భారత్‌కు ఓపెనర్లు మంచి ఆరంభం ఇచ్చినా పవర్ ప్లే తర్వాత ఆ జోరు కొనసాగించలేకపోయారు.

ఓపెనర్లు స్మృతి మంధాన (38), షెఫాలీ వర్మ (34) మొదటి వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినా, రన్ రేట్ పెంచడంలో విఫలమయ్యారు. వేగంగా ఆడటం కంటే వికెట్ కాపాడుకోవడానికే ప్రాధాన్యత ఇవ్వడంతో స్కోరు వేగం మందగించింది. మిడిల్ ఓవర్లలో భారత బ్యాటర్లు ఒత్తిడికి లోనై ఎక్కువ డాట్ బాల్స్ ఆడారు.

కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (27 బంతుల్లో 56) ఆఖరి ఓవర్లలో మెరుపు హాఫ్ సెంచరీతో రాణించినా సరే, మిగతా బ్యాటర్ల నెమ్మదైన ఆట తీరు వల్ల భారత్ ఆశించిన దానికంటే 15-20 పరుగులు తక్కువగా చేసింది.స్పిన్నర్ల పైనే జట్టు ఎక్కువగా ఆధారపడటంతో పేస్ బౌలింగ్ విభాగం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది.

పవర్‌ప్లేలో మరియు డెత్ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి తీసుకురావడంలో పేసర్లు విఫలమయ్యారు. నిజానికి ఈ టోర్నీ మొత్తం స్పిన్నర్లు మాత్రమే నిలకడగా రాణించారు. పేసర్లు పూర్తిగా విఫలమయ్యారు.

Womens T20

అన్నిటికంటే ముఖ్యంగా మ్యాచ్ గెలవాలంటే బ్యాటింగ్ , బౌలింగ్ మాత్రమే సరిపోదు. ఫీల్డింగ్ కూడా అద్భుతంగా ఉంటేనే విజయాలు దక్కుతాయి.కానీ ఈ టోర్నీలో అత్యంత చెత్త ఫీల్డింగ్ భారతదే. దాదాపు ప్రధాన మ్యాచ్‌లలో ముఖ్యంగా పవర్‌ప్లే ఓవర్లలో వరుసగా క్యాచ్‌లు వదిలేయడం, మిస్ ఫీల్డింగ్ చేయడం వల్ల జట్టు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

బంగ్లాదేశ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో తొలి 5 ఓవర్లలోనే ఏకంగా 4 క్యాచ్‌లు వదిలేశారు.సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ పేలవమైన ఫీల్డింగ్ వల్లే ఓటమి ఎదురయింది. గణాంకాల ప్రకారం.. కేవలం 69.3% క్యాచ్‌లు మాత్రమే అందుకొని, టోర్నీలో అత్యంత చెత్త క్యాచింగ్ ఎఫిషియన్సీని కలిగి ఉన్న జట్లలో ఒకటిగా నిలిచింది. ఫలితంగా మరోసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ అందని ద్రాక్షగా మిగిలింది.

Old Songs : కొన్ని పాటలు వినగానే పాత జ్ఞాపకాలు ఎందుకు గుర్తొస్తాయి? మెదడు ప్లే చేసే సైకాలజీ ట్రిక్ ఏంటి?

Exit mobile version