Enumeration : బీఎల్‌వో రాకపోయినా టెన్షన్ వద్దు..మొబైల్ నుంచే ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసేయొచ్చు

Enumeration : బీఎల్వోల కోసం వెయిట్ చేయకుండా..ఆన్‌లైన్ ద్వారా మీరే సొంతంగా.ఈ ఎన్యూమరేషన్ ఫామ్‌ను చాలా ఈజీగా పూర్తి చేసుకోవచ్చు.

Enumeration

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల లిస్ట్‌ ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ప్రస్తుతం ఎంతో ముమ్మరంగా సాగుతోంది. ఈ సర్వేలో భాగంగా ప్రతి ఓటరు తమ వివరాలను సరిచూసుకోవడం, కొత్తగా ఎంటర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సాధారణంగా దీని కోసం బూత్ లెవెల్ అధికారులు (BLO) ప్రతి ఇంటికీ తిరిగి ఎన్యూమరేషన్(Enumeration) ఫామ్‌లను పూర్తి చేస్తుంటారు. అయితే, ఉద్యోగాల వల్ల, ఇతర పనుల వల్ల బీఎల్వోలు వచ్చే టైమ్‌కి చాలా మంది ఇంటి వద్ద ఉండటం లేదు.

అలాంటి వారెవరూ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. నిజానికి బీఎల్వోల కోసం వెయిట్ చేయకుండా ఆన్‌లైన్ ద్వారా మీరే సొంతంగా ఈ ఎన్యూమరేషన్ ఫామ్‌ను చాలా ఈజీగా పూర్తి చేసుకోవచ్చు.

మొదటి స్టెప్‌లో భాగంగా మీరు మీ మొబైల్‌లో కానీ, ల్యాప్‌టాప్ ద్వారా భారత ఎన్నికల సంఘం అధికారిక పోర్టల్ అయిన https://voters.eci.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. వెబ్‌సైట్ హోమ్ పేజీ ఓపెన్ అవ్వగానే లాగిన్ లేదా సైన్ అప్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి.

మీరు ఇప్పటికే దీనిలో రిజిస్టర్ అయి ఉంటే డైరెక్టుగా లాగిన్ అవ్వొచ్చు. లేదంటే మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేదా ఓటర్ ఐడీ కార్డుపై ఉండే ఎపిక్ (EPIC) నెంబర్‌ను ఎంటర్ చేసి పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ (OTP)ని ఎంటర్ చేసి వెరిఫికేషన్ పూర్తి చేయాలి.

రెండో స్టెప్‌లో మీరు పోర్టల్‌లోకి లాగిన్ అయిన తర్వాత స్క్రీన్ మీద ఫిల్ ఎన్‌రోల్‌మెంట్ ఫామ్ (Fill Enrollment Form) లేదా ‘ఎస్‌ఐఆర్ ఎన్యూమరేషన్ ఫామ్’ అనే లింక్ కనిపిస్తుంది. ఆ లింక్‌ క్లిక్ చేయగానే డిజిటల్ ఎన్యూమరేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. దీనిలో మీ పేరు, తండ్రి లేదా భర్త పేరు, డేట్ ఆఫ్ బర్త్, ప్రెజెంట్ అడ్రస్ , మీ ఓటర్ ఐడీ వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా ఎంటర్ చేయాలి.

మీ వివరాలన్నీ కరెక్ట్‌గా ఉన్నాయని ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకున్న తర్వాత సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఆ వెంటనే పేజీ మిమ్మల్ని ఈ-సైన్ (E-Sign) ప్రాసెస్ వైపునకు తీసుకువెళుతుంది.

మూడో స్టెప్‌లో భాగంగా డిజిటల్ సైన్ లేదా ధ్రువీకరణ కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు మరోసారి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేయగానే మీ ఎన్యూమరేషన్ ఫామ్ ఆన్‌లైన్‌లో అఫీషియల్‌గా అప్‌లోడ్ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా పూర్తయ్యాక స్క్రీన్ మీద ఒక అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. వెంటనే ఆ నెంబర్‌ను స్క్రీన్ షాట్ తీసుకోవడం కానీ ఒక దగ్గర రాసి పెట్టుకోవడం కానీ మంచిది. మీ అప్లికేషన్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడానికి ఇది అవసరం అవుతుంది.

Enumeration

ఒకవేళ మీకు ఆన్‌లైన్‌లో కనుక ఎన్యూమరేషన్(Enumeration) ఫామ్ ఫిల్ చేయడం కుదరకపోతే.. బీఎల్వోలు ప్రతి ఇంటికి  కనీసం మూడు సార్లు అయినా వెళ్లి ఓటరుకు రెండు ఎన్యూమరేషన్ ఫామ్‌లను అందజేస్తారు. వాటిని ఎలా నింపాలో కూడా వారే చెబుతారు. ఆ రెండు ఫామ్‌లను పూర్తి చేసిన తర్వాత ఒక ఫామ్‌ను బీఎల్వోలు తీసుకుని, రెండో ఫామ్‌ను మనకు రశీదుగా ఇస్తారు.

ఒకవేళ మీ ఇంటికి బీఎల్వోలు రాకపోతే తెలంగాణ ఎన్నికల శాఖ వెబ్‌సైట్ కానీ ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా కానీ మీ ఏరియా బీఎల్వో ఫోన్ నెంబర్ తెలుసుకుని మాట్లాడొచ్చు. లేకపోతే ఎన్నికల సంఘం హెల్ప్‌లైన్ నెంబర్ 1950కు కాల్ చేసి కూడా ..దీనిపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు.

Numerology : లీడర్‌షిప్ క్వాలిటీస్, అంతులేని ధైర్యం..నెంబర్ 9 స్పెషాలిటీలు ఇంకా చాలా ..

Exit mobile version