AI Impact : మాకు ఏఐ సేవలు వద్దు బాబోయ్ ..ఉద్యోగులను వెనక్కి పిలుస్తున్న కంపెనీలు..

AI Impact : ఏఐను ఎక్కువగా నమ్ముకుని, ప్రస్తుతం ఉద్యోగులను మళ్లీ చేర్చుకుంటున్న కొన్ని ప్రముఖ సంస్థలలో ఫోర్డ్ , క్లార్నా, ఐబీఎం, డ్యుయోలింగో, స్టార్‌బక్స్ వంటివి ఉన్నాయి.

AI Impact

ఎవరు చేసే పని వాళ్లే చేయాలి అని ఒక సామెత మన పెద్దవాళ్లు చెప్పేవారు. ఇది దిగ్గజ కార్పొరేట్ కంపెనీలకు ఇప్పుడు బోధపడింది. నిన్నటి వరకూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ హడావిడిగా ఉద్యోగులను తీసేసిన కంపెనీలు..ఇప్పుడు ఏఐ సేవలు తమకు వద్దు అంటున్నాయి. తాము తొలగించిన ఉద్యోగులను మళ్లీ వెనక్కి పిలుస్తున్నాయి.

ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే దీనికి చాలా కారణాలున్నాయి. ప్రారంభంలో ఖర్చులు తగ్గించుకోవడానికి, ఉత్పాదకత పెంచుకోవడానికి చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగించి ఏఐ టూల్స్‌ను ప్రవేశపెట్టాయి. అయితే, కేవలం సాంకేతికతతోనే పనులు పూర్తి కాకపోవడం, సేవల నాణ్యత పడిపోవడంతో కంపెనీలు తమ తప్పును తెలుసుకుని మళ్లీ మనుషుల వైపు మొగ్గు చూపిస్తున్నాయి. ఇటీవలి నివేదికల ప్రకారం సుమారు 55 శాతం కంపెనీలు ఏఐ కోసం ఉద్యోగులను తీసేసినందుకు పశ్చాత్తాపపడుతున్నాయి. అందులో 32 శాతానికి పైగా కంపెనీలు తాము తొలగించిన స్థానాల్లో మళ్లీ ఉద్యోగులను చేర్చుకుంటున్నాయి.

ఏఐ కేవలం(AI Impact) సమాచారాన్ని వేగంగా ప్రాసెస్ చేయగలదు కానీ, క్లిష్టమైన సమయాల్లో మనుషుల్లా సరైన నిర్ణయాలు తీసుకోలేదు.కస్టమర్ సర్వీస్ విభాగాల్లో ఏఐ చాట్‌బాట్‌ల సంభాషణలు మూస పద్ధతిలో ఉండటం వల్ల కస్టమర్లు చికాకు పడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో సేవల నాణ్యత దారుణంగా పడిపోయింది.

మానవ సంబంధాలు, భావోద్వేగాలను అర్థం చేసుకోవడం, సృజనాత్మకత వంటి విషయాల్లో ఏఐ పూర్తిగా విఫలమైందనీ నిపుణులు చెబుతున్నారు. పెరిగిన నిర్వహణ ఖర్చులు మరో ప్రధాన కారణం. చాలా కంపెనీలు అనుకున్నట్లు ఏఐ చౌకగా మారలేదు. క్లిష్టమైన పనుల కోసం ఏఐ ఏపీఐ, క్లౌడ్ ఖర్చులు ఉద్యోగుల జీతాల కంటే ఎక్కువగా మారుతున్నట్లు గుర్తించారు.

AI Impact

ఏఐను(AI Impact) ఎక్కువగా నమ్ముకుని, ప్రస్తుతం ఉద్యోగులను మళ్లీ చేర్చుకుంటున్న కొన్ని ప్రముఖ సంస్థలలో ఫోర్డ్ , క్లార్నా, ఐబీఎం, డ్యుయోలింగో, స్టార్‌బక్స్ వంటివి ఉన్నాయి. ఫోర్డ్ కంపెనీనే తీసుకుంటే ఆటోమేటెడ్ ఏఐ కెమెరాలు క్వాలిటీ చెకింగ్‌లో తప్పులు చేయడంతో నాణ్యత లోపించింది. దీనిపై కస్టమర్ నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో.. 300 మందికి పైగా అనుభవజ్ఞులైన హ్యూమన్ క్వాలిటీ ఇన్‌స్పెక్టర్లను తిరిగి విధుల్లోకి తీసుకుంది.

అలాగే ఐబీఏంలో హెచ్‌ఆర్ విభాగంలో ఆస్క్ హెచ్ ఆర్ అనే వర్చువల్ ఏఐని ప్రవేశపెట్టినా క్లిష్టమైన సమస్యలు పరిష్కారం కాలేదు.సమస్యల పరిష్కారానికి, ప్లానింగ్‌కు మళ్లీ మానవ ఉద్యోగులను తీసుకుంటోంది.ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ ప్రకారం, ఏఐ అనేది కేవలం ఉద్యోగుల పనిని సులువు చేసే ఒక టూల్ మాత్రమేనని కంపెనీలు గ్రహిస్తున్నాయి.

Karma : మంచి వాళ్లకే అన్ని కష్టాలా? కర్మ మనతో ఆడుకునే ఆట వెనుక రహస్యం

Exit mobile version