NVIDIA : ఏఐ సేఫ్టీ టూల్ రిలీజ్.. నయా హిస్టరీని క్రియేట్ చేసిన ఎన్విడియా..

NVIDIA : 100కు పైగా గ్లోబల్ టెక్ పార్ట్‌నర్స్‌తో కలిసి ఎన్విడియా ఓపెన్ ఏజెంట్ సేఫ్టీ ప్లాట్‌ఫామ్ నేమ్‌తో అత్యంత శక్తివంతమైన సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌ను అధికారికంగా మార్కెట్లోకి వదిలింది.

NVIDIA

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తన లిమిట్ దాటి మరీ.. మనుషుల కంట్రోల్‌ను తుంగలో తొక్కుతుందనే వార్త సైబర్ ప్రపంచంలో కొద్దిరోజులుగా పెద్ద హాట్ టాపిక్‌గా నడుస్తోంది. ఏఐ ఏజెంట్లు అదుపు తప్పి ఓన్‌గా డెసిషన్స్ తీసుకుంటున్నాయన్న ఆందోళనల మధ్య, గ్లోబల్ చిప్‌మేకింగ్ రాక్షసుడు ఎన్విడియా టెక్ చరిత్రలోనే ఒక మైండ్ బ్లాకింగ్ ముందడుగు వేసి అందరి చూపును తనవైపు తిప్పుకుంది.

100కు పైగా గ్లోబల్ టెక్ పార్ట్‌నర్స్‌తో కలిసి ఎన్విడియా ఓపెన్ ఏజెంట్ సేఫ్టీ ప్లాట్‌ఫామ్ నేమ్‌తో అత్యంత శక్తివంతమైన సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌ను అధికారికంగా మార్కెట్లోకి వదిలింది. ఏఐ ఏజెంట్ ప్రతి మూవ్‌మెంట్‌ను 24/7 పర్యవేక్షిస్తూ, కంపెనీలు గీసిన లిమిట్స్ దాటకుండా ఉండేలా వాచ్ డాగ్‌లా ఇది పనిచేస్తుంది.

ఈ సేఫ్టీ టూల్ లాంచ్ సందర్భంగా మాట్లాడి ఎన్విడియా బాస్ జెన్సన్ హువాంగ్ .. ఏఐ ప్రొటెక్షన్ ప్రాబ్లెమ్స్‌కు పక్కా సొల్యూషన్ దొరికినప్పుడే, సొసైటీకి దానిలోని అపారమైన కెపాసిటీ పూర్తిగా అందుతుందని అన్నారు. ఏఐ టెక్నాలజీ లిమిట్స్ విస్తరిస్తున్న కొద్దీ, దాని సేఫ్టీ సిస్టమ్స్‌లో కూడా విప్లవాత్మకమైన ఛేంజెస్ వేగంగా తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు.

అయితే ఏఐ భద్రతపై గ్లోబల్ టెక్ సీఈఓల మధ్య డిఫరెంట్ ఒపీనియన్స్ వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కొన్ని ఏఐ సిస్టమ్స్ ఎలాంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేదా కమాండ్స్ లేకుండానే ప్రైవేట్ కార్పొరేట్, గవర్నమెంట్ డేటాబేస్‌లలోకి దూసుకెళ్లడం పెద్ద కలకలమే రేపిన విషయం తెలిసిందే.

మెయిన్‌గా ఓపెన్ఏఐ ఏజెంట్లు అమెరికా గవర్నమెంట్ వెబ్‌సైట్లను టార్గెట్ చేశాయంటూ రిపోర్టులు బయటకు రావడంతో, ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్, ఆంత్రోపిక్ అధినేత డారియో అమోడెయ్‌ ఏఐపై స్ట్రిక్ట్ రూల్స్, రెగ్యులేషన్స్ ఉండాలని డిమాండ్ చేశారు.

కానీ ఎన్విడియా(NVIDIA) సీఈఓ జెన్సన్ హువాంగ్ మాత్రం ఈ కంట్రోలింగ్ కాన్సెప్ట్‌ను పూర్తిగా వ్యతిరేకించారు. ఏఐ వల్ల మనుషుల మనుగడకు చాలా పెద్ద ప్రమాదం ఉందనే ప్రచారాన్ని ఆయన తిప్పి కొట్టారు. అతిగా స్ట్రిక్ట్ రూల్స్ విధిస్తే టెక్నాలజీ గ్రోత్ దారుణంగా పడిపోతుందని వార్నింగ్ ఇచ్చారు.

రీసెంట్‌గా ఆయన ఇంటర్వ్యూలో ఓపెన్ఏఐ నెగెటివ్ కామెంట్స్‌పై ఘాటుగా రియాక్టయ్యారు. తమ సొంత కంపెనీ ఏఐ కంట్రోల్ తప్పుతోందని వాళ్లు భయపడితే, ముందు ఆ కంపెనీని కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలి అంతే కానీ టెక్నాలజీకి బ్రేకులు వేయకూడదని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ఇదిలా ఉంటే ఎన్విడియా(NVIDIA) తన షేర్ హోల్డర్లకు మైండ్ బ్లాకింగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది. కార్పొరేట్ హిస్టరీలోనే ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేస్తూ.. ఏకంగా 150 బిలియన్ డాలర్ల భారీ షేర్ బైబ్యాక్ ప్రోగ్రామ్‌ను అనౌన్స్ చేసింది. గతంలో ఉన్న 85 బిలియన్ డాలర్ల ప్లాన్‌కి ఇది ఎక్స్‌ట్రా.

NVIDIA

ఇప్పటి వరకూ టెక్ దిగ్గజం ఆపిల్ క్రియేట్ చేసిన 110 బిలియన్ డాలర్ల బైబ్యాక్ రికార్డును ఎన్విడియా చాలా ఈజీగా తుడిచిపెట్టేసింది. ప్రస్తుతం దాదాపు 5.4 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌తో దూసుకుపోతున్న ఎన్విడియా దగ్గర నిండిపోయిన హ్యూజ్ క్యాష్ రిజర్వ్స్‌, ఫ్యూచర్ బిజినెస్ ప్రాజెక్టులపై ఉన్న ఓ రేంజ్‌లో ఉన్న నమ్మకానికి ఈ బైబ్యాకే ప్రత్యక్ష నిదర్శనం.

అయితే ఈ ఆల్ టైమ్ రికార్డ్ అనౌన్స్‌మెంట్ చేసిన తర్వాత కూడా ప్రీ మార్కెట్ ట్రేడింగ్‌లో ఎన్విడియా కంపెనీ షేర్లు కొద్దిగానే లాభపడటం టెక్ వర్గాల్లో కొంత ఆసక్తికరంగా మారింది.

రాబోయే రోజుల్లో ఏఐ కంట్రోల్ గేమ్‌లో ఎన్విడియా(NVIDIA) సేఫ్టీ ప్లాట్‌ఫామ్ ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అలాగే జెన్సన్ హువాంగ్ టేకాఫ్ చేసిన ఈ దూకుడు టెక్ వరల్డ్‌ను ఎటు తీసుకెళ్తుందో చూడాలి.

Cut Off vs Space In Relationship : బంధాల్లో కట్ ఆఫ్ వర్సెస్ స్పేస్.. బంధాలలో బౌండరీలు దాటితే ఏమవుతుంది?

↑
Exit mobile version