Just LifestyleLatest News

Cut Off vs Space In Relationship : బంధాల్లో కట్ ఆఫ్ వర్సెస్ స్పేస్.. బంధాలలో బౌండరీలు దాటితే ఏమవుతుంది?

Cut Off vs Space In Relationship : చాలామంది దూరంగా ఉండటం (Distancing), పూర్తిగా కట్ ఆఫ్ చేయడం (Cutting Ties) రెండూ ఒకటే అని అనుకుంటారు

Cut Off vs Space In Relationship

ఎవరైనా మనల్ని బాగా గాయపరిచినా, మోసం చేసినా , చాలా ఎక్కువ డిజప్పాయింట్ చేసినా వారి నుంచి మన మనశ్శాంతిని కాపాడుకోవడానికి వెంటనే కట్ ఆఫ్ చేస్తుంటాం. అంటే వారి ఫోన్ నెంబర్లు బ్లాక్ చేయడం, సోషల్ మీడియాలో అన్‌ఫాలో కొట్టేసి వారికి పూర్తిగా దూరంగా జరిగిపోవడం వంటివి చేస్తుంటాము. అయితే అసలు ఒక బంధంలో స్పేస్ ఇవ్వడానికి, పూర్తిగా కట్ ఆఫ్ చేయడానికి ఉన్న సన్నని తేడా తెలీకుండా ప్రవర్తిస్తారని మానసిక నిపుణులు అంటున్నారు.

రిలేషన్‌షిప్‌లో బౌండరీ పెట్టుకోవడమంటే.. మీరు ఆ రిలేషన్‌షిప్‌లో దేనిని అంగీకరిస్తారు, దేనిని అంగీకరించరనే విషయాన్ని అవతలి వ్యక్తికి చాలా క్లియర్‌గా చెప్పడమన్నమాట. అంటే మీరు ఆ రిలేషన్‌ను నిలబెట్టుకోవడానికి, లేదంటే దానిని ఇంకా బెటర్‌గా మార్చుకోవడానికి రెడీగా ఉన్నట్లు అర్థం. కాసేపు అంటే కొన్ని గంటలో, రోజులో కామ్‌గా ఉండటానికి కొంత స్పేస్, మంచి కమ్యూనికేషన్ మాత్రం మీకు కావాలని చెప్పడమే దీని అర్థం.

చాలామంది దూరంగా ఉండటం (Distancing), పూర్తిగా కట్ ఆఫ్ చేయడం (Cutting Ties) రెండూ ఒకటే అని అనుకుంటారు. కానీ వీటి మధ్య చాలా డిఫరెన్స్ ఉంది. దూరంగా ఉన్నప్పుడు కూడా మీరు అవతలి పర్సన్‌తో టచ్‌లో ఉండొచ్చు. ఇద్దరి మధ్య గొడవలు జరిగాక.. టెన్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఆ హీట్ తగ్గే వరకు కాస్త వెనక్కి తగ్గి ప్రశాంతంగా ఆలోచించడాన్ని స్పేస్ తీసుకోవడం అంటారు. కానీ కట్ ఆఫ్(Cut Off vs Space In Relationship) చేయడమంటే ఆ వ్యక్తితో ఎలాంటి కాంటాక్ట్ లేకుండా ఆ రిలేషన్‌ను పర్మినెంట్‌గా ముగించేయడం! సింపుల్‌గా చెప్పాలంటే.. బౌండరీ అనేది ఒక రిలేషన్‌షిప్‌కి సరిహద్దులు గీస్తే, కట్ ఆఫ్(Cut Off vs Space In Relationship) అనేది ఆ బంధానికే ఎండ్ కార్ట్ వేసినట్లు. .

అయితే, ఎప్పుడు మాట్లాడి తమ మధ్య సమస్యను పరిష్కరించుకోవాలి? ఎప్పుడు తమ మధ్య ఉన్న బంధానికి స్వస్తి చెప్పాలనేది తెలియాలి. నిజానికి ప్రతి బంధం, ప్రతి పరిస్థితి వేర్వేరుగా ఉంటాయి. మీ ఇద్దరి మధ్య వచ్చింది కేవలం చిన్న అపార్థమే అయితే, మాట్లాడి వెంటనే క్లియర్ చేసుకోవడం ఎంతో మంచిది.

Cut Off vs Space In Relationship
Cut Off vs Space In Relationship

ఒక చిన్న, నిజాయితీతో కూడిన కాన్వర్జేషన్ మీ బంధాన్ని నిలబెడుతుంది. కానీ ఈ కమ్యూనికేషన్ అనేది మాత్రం రెండు వైపులా ఉండాలి. మీరు ఒక్కరే ఎప్పుడూ మీ ఆ బంధాన్ని కాపాడుకోవడానికి సద్దుకుపోతూ, వివరణలు ఇస్తూ ఉన్నప్పుడు.. అవతలి వ్యక్తి అదేమీ అర్ధం చేసుకోకుండా మళ్లీ అదే తప్పు చేస్తూ పోతుంటే మాత్రం.. మీరు ఆ బంధం గురించి సీరియస్‌గా ఆలోచించాల్సిందే.

మీరు మీ సమస్యను చెబుతున్నా కూడా అవతలి వ్యక్తి మీ బౌండరీలను క్రాస్ చేస్తూ, మిమ్మల్ని గౌరవించకుండా ప్రవర్తిస్తుంటే ఆ బంధంలో ఉండటం దండగేనని సైకలాజిస్టులు చెబుతున్నారు. దీనికి చాలా చిన్న ఉదాహరణే తీసుకుంటే.. మీ డ్రెస్‌ల గురించి అవతలి వ్యక్తి చేసే కామెంట్లు మీకు నచ్చక అలా అనొద్దని చెప్పినా.. వారు దానిని ఒక జోక్‌లా తీసిపారేస్తూ..ఇంకా అలాగే మాట్లాడుతుంటే, మీ మాటలకు అక్కడ విలువ లేనట్లే అని అర్ధం. బౌండరీలకు వ్యాల్యూ లేని చోట బంధానికి కూడా అర్థం ఉండదన్న విషయాన్ని గుర్తించాలి.

Apple Pay : డిజిటల్ మార్కెట్లోకి యాపిల్ పే ఎంట్రీ.. ఫోన్‌పే, గూగుల్ పే యాప్‌లకు చెక్ తప్పదా?

Related Articles

Back to top button