WhatsApp Schedule Messages
మార్నింగ్ లేచిన దగ్గర్నుంచి నైట్ పడుకునే వరకు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ ఎక్కువగా వాడేది వాట్సాప్ అన్న విషయం ఎవరైనా ఒప్పుకుంటారు. అఫీషియల్ ఆఫీస్ చాటింగ్‌ల నుంచి ఫ్రెండ్స్, రిలేటివ్స్‌తో ముచ్చట్ల వరకూ ప్రతీదానికీ ఇదే మెయిన్ అడ్డా అన్నట్లుగా తెగ వాడేస్తుంటాం.
మన దగ్గర వారికి పెళ్లి లేదా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి రాత్రి 12 గంటల వరకూ లేచి ఉండి మెసేజ్‌లో విషెస్ చెప్పి పడకుంటాం. కొన్నిసార్లు నిద్ర ముంచుకురావడంతో విష్ సంగతే మర్చిపోతుంటాం. ఈ ఇబ్బందికి చెక్ పెడుతూ వాట్సాప్ ఒక కిల్లింగ్ ఫీచర్‌ను మనందరి ముందుకు తీసుకొచ్చింది.
ఇప్పటివరకు వాట్సాప్ చాట్‌లో పంపిన మెసేజ్‌ను ఎడిట్ చేయడం, డిలీట్ ఫర్ ఎవరీవన్ చేయడం వంటి అమేజింగ్ ఫీచర్ ఇచ్చిన వాట్సాప్.. ఇప్పుడు తమ యూజర్ల కోసం ఇప్పుడు ‘మెసేజ్ షెడ్యూలింగ్’ (WhatsApp Schedule Messages)ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకు వచ్చేసింది.
ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా వర్షన్‌లో టెస్టింగ్ కోసం కొంతమంది ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చింది. మనం ఎవరికైనా మెసేజ్ పంపాలని అనుకుంటే ఏకంగా రెండు వారాలు అంటే 14 రోజులు ముందే ఆ మెసేజ్‌ను ఏ సమయానికి పంపాలో పక్కా డేట్ అండ్ టైమ్ షెడ్యూల్ చేసి పెట్టుకోవచ్చు.
ఇప్పటికే వాట్సాప్‌లో గ్రూప్ కాల్స్, పర్సనల్ వీడియో, వాయిస్ కాల్స్ కోసం ఇలా ముందుగానే షెడ్యూల్ చేసి లింక్ సెండ్ చేసే ఆప్షన్ ఉందన్న సంగతి మనకు తెలుసు. అదే కాన్సెప్ట్‌ను ఇప్పుడు టెక్స్ట్ మెసేజ్‌లకు కూడా అప్లై చేస్తూ వాట్సాప్(WhatsApp Schedule Messages) ఈ అడుగు వేసింది. త్వరలోనే ఈ అప్‌డేట్ అందరి ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలోకి రాబోతుండటంతో టెక్ ప్రియులు ఫుల్‌గా ఖుషీ అవుతున్నారు.
నిజానికి ఈ ఫీచర్ వల్ల పర్సనల్ లైఫ్‌లోనే కాదు.. ప్రొఫెషనల్ లైఫ్‌లో కూడా బోలెడన్ని ఉపయోగాలున్నాయి. బిజీ షెడ్యూల్ వల్ల ఇంపార్టెంట్ మీటింగ్ నోటిఫికేషన్లు, ఆఫీస్ వర్క్ రిమైండర్లు పంపడం మర్చిపోయే ఉద్యోగులకు ఇది లైఫ్ సేవర్ అనే చెప్పాలి. అంతేకాకుండా క్లయింట్లకు టైమ్‌కు ఇన్ఫర్మేషన్ చేరవేయడానికి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది.
భారత దేశంలో ఎక్కువగా వాడే మెసేజింగ్ యాప్..వాట్సాప్ కావడంతో యూజర్ల అవసరాలను బట్టి కంపెనీ ఎప్పటికప్పుడు ఇలాంటి స్మార్ట్ ఐడియాలను తీసుకువస్తూ యూజర్లను అట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది. ఈ ఏడాదిలోనే యూజర్లందరి హ్యాండ్‌సెట్లలో ఈ సెట్టింగ్ పూర్తిస్థాయిలో ల్యాండ్ కాబోతోంది కాబట్టి.. ఇకపై మెసేజ్‌లు టైమ్‌కు పంపడం మర్చిపోతామనే భయం ఏమాత్రం ఉండదు.
WhatsApp :వాట్సాప్ పర్సనల్ వర్సెస్ వాట్సాప్ బిజినెస్.. మీ అవసరానికి ఏది బెస్ట్?
