Just TechnologyLatest News

WhatsApp :వాట్సాప్ పర్సనల్ వర్సెస్ వాట్సాప్ బిజినెస్.. మీ అవసరానికి ఏది బెస్ట్?

WhatsApp : మీ చాటింగ్ అంతా పర్సనల్ అయితే, నార్మల్ వాట్సాప్ యాప్ ఒక్కటి చాలు. ఒకవేళ మీరు ఒక ప్రొడక్ట్ అమ్ముతున్నా, సర్వీస్ ఇస్తున్నా , మీ బిజినెస్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాలనుకుంటే మాత్రం వాట్సాప్ బిజినెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి.

WhatsApp

ఇప్పుడు అందరూ వాట్సాప్ వాడుతున్నా కూడా .. అందులో రెండు రకాలున్నాయన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఒకటి ప్రతీ ఒక్కరికీ తెలిసిన పర్సనల్ వాట్సాప్(WhatsApp), రెండోది వాట్సాప్ బిజినెస్. పేరుకు రెండు వాట్సాప్‌లే అయినా కూడా.. ఫీచర్లు , పనితీరులో చాలా తేడాలు ఉన్నాయి. అసలు ఏది దేనికి వాడాలన్న విషయం చాలామందికి తెలీదు.

పర్సనల్ వాట్సాప్ కేవలం స్నేహితులతో, కుటుంబ సభ్యులతో చాటింగ్ చేసుకోవడానికి మాత్రమే క్రియేట్ చేసింది. దీనిలో కేవలం ఒక ప్రొఫైల్ ఫోటో, స్టేటస్ మాత్రమే ఉంటాయి. దీన్ని మీరు కేవలం పర్సనల్ చాట్స్‌కు మాత్రమే వాడుకోవడానికి యూజ్ చేయాల్సి ఉంటుంది.

ఇక మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నా, వెబ్ సైట్ వంటిది రన్ చేసినా.. లేదా మీరు ఒక కన్సల్టెంట్ అయినా .. వాట్సాప్ (WhatsApp) బిజినెస్ మీకు ఒక ఆఫీసులా పనిచేస్తుంది. దీనిలో ముఖ్యమయినది బిజినెస్ ప్రొఫైల్. మీ ఆఫీసు లేదా షాప్ అడ్రస్, వెబ్‌సైట్ లింక్, ఇమెయిల్, పని చేసే సమయాలను (Business Hours) ఈ ప్రొఫైల్‌లోనే సెట్ చేసుకోవచ్చు. కస్టమర్ చూడగానే అది ప్రొఫెషనల్‌గా అనిపిస్తుంది.

అలాగే దీనిలో ఆటోమేటెడ్ మెసేజెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు బిజీగా ఉన్నప్పుడు కస్టమర్ మెసేజ్ చేస్తే, వాటంతట అవే రిప్లైలు (Greeting messages, Away messages) వెళ్లేలా సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల కస్టమర్‌కి రెస్పాన్స్ వచ్చిందనే గౌరవం, నమ్మకం కలుగుతుంది.

క్విక్ రిప్లైస్ (Quick Replies)కూడా సెట్ చేసుకోవచ్చు. కస్టమర్లు తరచుగా అడిగే ప్రశ్నలలో ముఖ్యంగా ప్రైస్ ఎంత? పేమెంట్ ఎలా చేయాలనేవాటికి ప్రతిసారీ టైప్ చేయకుండా, ఒక షార్ట్‌కట్ కీతో వెంటనే రిప్లై పంపించొచ్చు.

అంతేకాదు మీ వద్ద ఉన్న ప్రొడక్ట్స్ లేదా సర్వీసులను ఫోటోలతో సహా ఒకే చోట క్యాటలాగ్‌గా పెట్టుకోవచ్చు. కస్టమర్లు డైరక్టుగా అక్కడే చూసి ఆర్డర్ చేయొచ్చు.

మీ చాటింగ్ అంతా పర్సనల్ అయితే, నార్మల్ వాట్సాప్ యాప్ ఒక్కటి చాలు. ఒకవేళ మీరు ఒక ప్రొడక్ట్ అమ్ముతున్నా, సర్వీస్ ఇస్తున్నా , మీ బిజినెస్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాలనుకుంటే మాత్రం వాట్సాప్ బిజినెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు పర్సనల్ వాట్సాప్ నంబర్‌ను కూడా బిజినెస్‌కు వాడుకోవచ్చు. కాకపోతే, బిజినెస్‌కు మారినప్పుడు మీ డేటాను (చాట్స్, ఫోటోలు) ఒకసారి బ్యాకప్ తీసుకోవాలి.

అయితే బిజినెస్ అకౌంట్‌లో కొన్ని ప్రైవసీ రూల్స్ ఫాలో అవ్వాలి. బిజినెస్ అకౌంట్‌లో కొంతమంది కస్టమర్‌కి పంపాల్సిన ఆటోమేటెడ్ రిప్లైస్ (Automatic Replies) సెట్ చేసి ఉంచుతారు. అపుడు అదే బిజినెస్ అకౌంట్ నుంచి నువ్వు పర్సనల్ చాట్ చేస్తుండగా, అదే సమయంలో ఏదో ఒక కొత్త కస్టమర్ మెసేజ్ వచ్చిందనుకోండి.

అప్పుడు నీ బిజినెస్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్ రిప్లై వెళ్తుంది. అది నీ పర్సనల్ చాట్‌ మెసేజ్ కూడా కస్టమర్‌కు వెళ్లే ప్రమాదం ఉంది. ఇది చాలా విచిత్రమైన, అసౌకర్యమైన పరిస్థితిని క్రియేట్ చేస్తుంది.

WhatsApp
WhatsApp

అంతేకాదు చాలా కంపెనీల్లో, చిన్న చిన్న బిజినెస్‌లలో ఒకే ఫోన్‌ను లేదా ఒకే వాట్సాప్ బిజినెస్ అకౌంట్‌ను లాప్‌టాప్‌లో (WhatsApp Web) లాగిన్ చేసి ఉంచుతారు. నీ కస్టమర్ల ఆర్డర్లు చూసుకోవడానికి మీ ఆఫీసులో వేరే వాళ్లు లేదా మీ టీమ్ మెంబర్స్ ఆ కంప్యూటర్‌ను వాడతారు కాబట్టి మీ పర్సనల్ చాట్స్ వాళ్లందరికీ కనిపించే అవకాశం ఉంది.

వాట్సాప్ ఆల్గారిథమ్ నీ చాటింగ్ తీరును బట్టి.. అది బిజినెస్ ఆ కాదా అని గుర్తిస్తుంది. ప్రొఫెషనల్ చాట్ ఉండాల్సిన చోట పర్సనల్ గొడవలు, ముచ్చట్లు ఉంటే వాట్సాప్ నీ అకౌంట్‌ను బ్యాన్ (Ban) చేసే అవకాశాలు కూడా ఉంటాయి.

ఒకవేళ నీ బిజినెస్ పెద్దది అయితే.. రేపు పొద్దున్న నీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆడిటింగ్ చేయాల్సి వస్తే, నీ అకౌంట్‌లో బిజినెస్ చాట్స్‌తో పాటు పర్సనల్ చాట్స్ కూడా ఉంటే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Related Articles

Back to top button