YouTube Monetization : యూట్యూబ్ క్రియేటర్లకు మళ్లీ షాక్..మారిన మోనిటైజేషన్ రూల్స్‌తో డబ్బులు సంపాదించడం ఈజీ కాదా?

YouTube Monetization : 365 రోజుల్లో 1,000 మంది సబ్‌స్క్రైబర్‌లు అలాగే 8,000 అర్హత కలిగిన వాచ్ అవర్స్ సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ షార్ట్స్ ద్వారా కనుక ఇన్కమ్ పొందాలనుకుంటే మాత్రం 90 రోజుల్లో 20 మిలియన్ల వ్యూస్ రావాలి.

YouTube Monetization

యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ లక్షలకు లక్షలు సంపాదించొచ్చనే మాట చాలాసార్లు చాలామంది దగ్గర వింటుంటాం. కొంత మంది డిజిటల్ క్రియేటర్లు తమ కెరీర్‌ను దీనిలోనే బిల్డ్ చేసుకుంటున్నారు కూడా. అయితే, ఇకపై యూట్యూబ్‌లో ఒక ఛానెల్ పెట్టి డబ్బులు సంపాదిద్దామనుకునే ఆలోచనను ఇకపై మానుకోవాల్సిందే.

ఎందుకంటే క్రియేటర్ల కష్టానికి మరింత వ్యాల్యూ ఇస్తూ, క్వాలిటీ కంటెంట్‌ను ప్రోత్సహించడానికి యూట్యూబ్ తన పార్టనర్ ప్రోగ్రామ్ (YPP) కండీషన్లను ఇంకా మార్చేసింది. ఈ కొత్త రూల్స్ ఫిబ్రవరి 1, 2027 నుంచి అమల్లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు ఉన్న కండీషన్లతో పోలిస్తే ఇకపై టార్గెట్స్ కాస్త స్ట్రాంగ్‌గానే ఉండబోతున్నాయి. కొత్తగా వైపీపీలో చేరి పూర్తి స్థాయిలో యాడ్స్ ఇన్కమ్ పొందాలనుకునే వారు, 365 రోజుల్లో 1,000 మంది సబ్‌స్క్రైబర్‌లు అలాగే 8,000 అర్హత కలిగిన వాచ్ అవర్స్ సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ షార్ట్స్ ద్వారా కనుక ఇన్కమ్ పొందాలనుకుంటే మాత్రం 90 రోజుల్లో 20 మిలియన్ల వ్యూస్ రావాలి. అంటే ఇకపై కేవలం సబ్‌స్క్రైబర్ల నెంబర్ పెరిగితే మాత్రమే సరిపోదు, మీ వీడియోలను జనాలు ఎంత సమయం చూస్తున్నారనేదే అసలు పాయింట్.

ఈ మార్పు మన కంటెంట్ క్రియేటర్ల మార్కెట్‌పై చాలా ఎక్కువ ఎఫెక్ట్ చూపించబోతోంది. అంటే కంటెంట్ క్రియేటర్లు యూట్యూబ్‌ను ఏదో పార్ట్‌టైమ్ సరదాగా కాకుండా, ప్రోపర్ బిజినెస్‌లా , ఒక ఫుల్ టైమ్ జాబ్‌లా తీసుకుని సీరియస్‌గా ఉండాల్సిన సమయం వచ్చింది.

ఏఐ సాధనాలు వచ్చాక అందరూ ఒకే టైప్‌ స్క్రిప్టులు, వాయిస్‌లతో ఫేక్ లేదా ఒకే విధమైన వీడియోలు తెగ అప్‌లోడ్ చేసేస్తున్నారు. దీన్ని అరికట్టడానికే యూట్యూబ్ ఇలాంటి స్ట్రిక్ట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఏఐని టైమ్ సేవ్ చేయడానికి వాడితే ఓకే కానీ, మొత్తం కంటెంట్‌ను దానికే వదిలేస్తే మాత్రం మోనిటైజేషన్(YouTube Monetization) దక్కడం కష్టమే అని నిపుణులు చెబుతున్నారు.

YouTube Monetization

అయితే ఇక్కడ ఇంకో పాజిటివ్ యాంగిల్ కూడా ఉంది. తెలివైన క్రియేటర్లు ఎప్పుడూ కూడా కేవలం యూట్యూబ్ యాడ్‌సెన్స్(YouTube Monetization) డబ్బులపైనే ఆధారపడరు కాబట్టి వారికి వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు. ఎందుకంటే వారు బ్రాండ్ స్పాన్సర్‌షిప్‌లు, అఫిలియేట్ మార్కెటింగ్, మర్చండైజ్ సేల్స్, పెయిడ్ ప్రమోషన్ల ద్వారానే 65 నుంచి 85 శాతం వరకు ఇన్కమ్ పొందుతున్నారు.

కాబట్టి, ఎవరికైనా , ఎప్పుడైనా కూడా క్వాలిటీ కంటెంట్‌తో సొంతగా రీచ్ పెంచుకుంటూ, ఇతర ఇన్కమ్ సోర్సెస్‌ను వెతుక్కునే వారికి ఏ కొత్త రూల్స్ ఎలాంటి ఇబ్బంది కలిగించవనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

Love And Attachment : ప్రేమ నిజంగా ప్రేమేనా..లేక కోల్పోతామనే భయమా? ఓషో చెప్పిన సత్యం..

Exit mobile version