Love And Attachment : ప్రేమ నిజంగా ప్రేమేనా..లేక కోల్పోతామనే భయమా? ఓషో చెప్పిన సత్యం..
Love And Attachment : ప్రేమకు, అటాచ్‌మెంట్‌కు మధ్య ఉన్న సన్నని లైన్‌ను తెలుసుకోవడం చాలామందికి కష్టంగా మారుతుంది.
Love And Attachment
ఎవరినైనా ప్రాణంగా ఇష్టపడుతున్నప్పుడు.. ఎక్కడ వారిని కోల్పోతామోననే భయం కూడా ఎక్కడో వెంటాడుతుంది. ఆ భయంతోనే ఎదుటివారిని ఇంకా గట్టిగా పట్టుకుంటూ, ప్రతి చిన్న విషయానికి గ్యారెంటీలు అడిగేలా చేస్తుంది. మనకు తెలీకుండానే వారిని లిమిట్ దాటి పోకుండా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంటారు.
చాలామంది దీనినే గాఢమైన ప్రేమ అనుకుంటారు. కానీ, డీప్‌గా ఆలోచిస్తే అది ప్రేమ కాదు.. ఆ వ్యక్తి లేకపోతే వారు ఒంటరిగా అయిపోతారేమో అనే చిన్న భయం మాత్రమే. ఇలా ప్రేమకు, అటాచ్మెంట్(Love And Attachment)కు మధ్య ఉన్న ఈ సన్నని లైన్‌ను తెలుసుకోవడం చాలామందికి కష్టంగా మారుతుంది.
ఫేమస్ స్పిరుచ్యువల్ థింకర్ ఓషో ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్‌ను చాలా సింపుల్‌గా చెప్పారు. ఓషో మాటల్లోనే దీనిని చెప్పాలంటే.. అటాచ్మెంట్ అనేది ఎదుటి వ్యక్తిని సొంతం చేసుకోవడం, వారిపై డామినేషన్ చెలాయించడం,వారిని బంధించి ఉంచాలనే థాట్ నుంచి బయటకు వస్తుంది.
ఎప్పుడైతే ప్రేమ పేరుతో ఒకరిని తమ స్వంత ఆస్తిగా భావించడం మొదలుపెడతారో, అక్కడ అసూయ, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, స్వార్థం ప్రవేశిస్తాయి. దాంతో ఇద్దరి మధ్య ఉండాల్సిన ప్యూర్ కనెక్షన్ మెల్లగా దెబ్బతింటుంది.
అలాగే ఓషో దృష్టిలో ప్రేమ అంటే ఎదుటి వ్యక్తికి పూర్తి స్పేస్ ఇవ్వడం. మనం ఇష్టపడిన వ్యక్తి మన ఆలోచనలకు తగ్గట్టుగా నడుచుకోవాలని రూల్స్ పెట్టకపోవడమే అసలైన ప్రేమ. మనల్ని కూడా వారు తిరిగి అలాగే ప్రేమించాలని కండిషన్స్ పెట్టకుండా, వాళ్లు ఎలా ఉంటే అలా ఒప్పుకోవడమే ప్యూర్ లవ్. ఇంకా చెప్పాలంటే ప్రేమ అనేది లెక్కలేసుకుని చేసే బిజినెస్ కాదు, అది మనస్ఫూర్తిగా ఇచ్చే గిఫ్ట్.
చెప్పడానికి, వినడానికి కూడా ఇది చాలా బాగున్నా కూడా, రియల్ లైఫ్‌లో దీనిని అప్లై చేయడం అంత ఈజీ కాదు. మెంటల్ పీస్‌ఫుల్‌నెస్ కోసం వేరొకరిపై పూర్తిగా ఆధారపడినప్పుడు, మనం అనుకుంటున్నది ప్రేమా లేక అటాచ్‌మెంటా అని తేల్చుకోవడం కష్టమవుతుంది.

ఇది తెలుసుకోవడం కోసం ఓషో ..దీనిపై మనస్ఫూర్తిగా ఆలోచించడం లేదా ప్రశాంతంగా మనసును అబ్జర్వ్ చేయడం ఒక్కటే మార్గమని చెబుతారు. మన ఆలోచనలు, భయాలు , ఫీలింగ్స్ పట్ల మనం ఒక క్లారిటీ తెచ్చుకున్నప్పుడు మాత్రమే రిలేషన్షిప్లో అటాచ్మెంట్(Love And Attachment) తెచ్చే లూప్ హోల్స్ గుర్తించగలం. ఈ క్లారిటీ పెరిగినప్పుడు ప్రేమ అనేది ఒకరినొకరు శాసించే రిలేషన్‌గా కాకుండా, స్వేచ్ఛగా కలసి ఉండే మంచి ఫ్రెండ్‌షిప్‌లా మారుతుంది.
ఈ క్లారిటీని పెంచుకోవడానికి మైండ్ రీఫ్రెష్ చేసుకోవడం లేదంటే మనసును ప్రశాంతంగా ఉంచుకోవడమే బెస్ట్ ఆప్షన్ అని ఓషో చెబుతారు. మనసును కాసేపు పక్కన పెట్టి లోపలికి తొంగి చూసినప్పుడే.. ఎదుటివారిని మనం నిజంగా ఇష్టపడుతున్నామా లేక వారిని కోల్పోతామనే భయంతో పట్టుకుని ఉన్నామా అనే నిజం అర్థమవుతుంది.





