Ebola : హైదరాబాద్‌లో ఎబోలా టెన్షన్..డాక్టర్లు ఏం చెబుతున్నారు?

Ebola : హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ఎబోలా అనుమానిత కేసుల సంఖ్య రెండుకు చేరింది. సూడాన్‌ నుంచి వచ్చిన మరో వ్యక్తిలో ఎబోలా లక్షణాలు కనిపించడంతో ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అందిస్తున్నారు

Ebola

హైదరాబాద్‌లో ఎబోలా వైరస్ కలకలం రేపుతోంది. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఎబోలా(Ebola) వైరస్ లక్షణాలతో ఇద్దరు వ్యక్తులు చేరడంతో వైద్య ఆరోగ్య శాఖ ఒక్కసారిగా అప్రమత్తమైంది. మధ్య ఆఫ్రికా దేశాలలో ఇటీవల ఎబోలా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులపై అధికారులు స్పెషల్ నిఘా ఉంచారు. ఈ సమయంలోనే ఇటీవల సూడాన్ దేశం నుంచి సిటీకి వచ్చిన ఒక వ్యక్తిలో ఎబోలాను పోలిన అనుమానాస్పద వైరస్ లక్షణాలు బయటపడ్డాయి.

వైద్యులు చెబుతున్నదాని ప్రకారం.. సూడాన్‌కు చెందిన 36 ఏళ్ల మహమ్మద్ యగౌచ్ అహ్మద్ అనే వ్యక్తి తాజాగా హైదరాబాద్ వచ్చాడు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకు నిర్వహించే సాధారణ స్క్రీనింగ్ , హెల్త్ చెకప్ సమయంలో అతడిలో ఎబోలా(Ebola) వైరస్ లక్షణాలున్నట్లు ఎయిర్‌పోర్ట్ అధికారులు గుర్తించారు.

దాంతో వెంటనే అతడిని తక్షణమే గాంధీ ఆసుపత్రికి పంపించి, అక్కడ దీనికోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆ వ్యక్తి హైదరాబాద్‌లో చదువుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే అతడితో పాటు సన్నిహితంగా మెలిగిన మరో వ్యక్తిని కూడా డాక్టర్లు ఐసోలేషన్‌లో ఉంచారు. ప్రస్తుతం వీరిద్దరికీ స్పెషల్ డాక్టర్స్ టీమ్‌ ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ జరుగుతోంది.

బాధిత రోగి బాడీ నుంచి సేకరించిన బ్లడ్ శాంపిళ్లను పరీక్షల కోసం హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపించినట్లు అక్కడి డాక్టర్లు చెప్పారు. అక్కడి నుంచి ఆ శాంపిల్స్‌ను మరింత లోతుగా పరీక్షించడం కోసం పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు తరలించనున్నట్లు తెలిపారు. ఈ ల్యాబ్ రిపోర్టులు పూర్తిగా చేతికి అందడానికి సుమారు వారం రోజుల సమయం పట్టే అవకాశముందని అన్నారు.

Ebola

వైరస్ పూర్తిగా కన్ఫమ్ అయ్యే వరకు డాక్టర్లు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి గాంధీ ఆసుపత్రిలో 20 పడకలతో కూడిన స్పెషల్ ఐసోలేషన్ వార్డును రెడీ చేశారు. కాగా ఈ విషయంపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. అయితే విపరీతమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, అలసట , రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు.

Mysterious Places : ప్రపంచంలోనే 5 టాప్ మిస్టరీ ప్లేసెస్.. సామాన్య ప్రజలకు అక్కడ నో ఎంట్రీ

Exit mobile version