Enumeration
తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రాసెస్ శరవేగంగా సాగుతోంది. ఆగస్ట్ 3 వ తేదీతో ఎన్యూమరేషన్ ఫామ్‌లు స్వీకరణకు గడువు ముగియనుండటంతో పనిని మరింత స్పీడప్ చేశారు. అయితే అధికారులు పంపిణీ చేసిన ఫామ్‌లలో సుమారు 20 నుంచి 30 శాతం వరకు తిరిగి రావడం లేదని లెక్కలు తేలుతున్నాయి.
ఎందుకంటే హైదరాబాద్‌లో స్థిరపడ్డ చాలామంది ఇక్కడ కాకుండా తమ సొంతూళ్లలోనే ఓటు హక్కును ఉంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, యూపీ వంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ జాబ్‌లు,బిజినెస్‌లు చేసుకుంటున్నవారు సొంత ఊళ్లలోనే ఓటేస్తామని స్పష్టం చేస్తున్నారు.
బీఎల్వోలు వారి వారి ఇళ్లకు వచ్చి ఇస్తున్న ఎన్యూమరేషన్(Enumeration) ఫామ్‌లను తీసుకుని పక్కన పడేస్తున్నారు. అంతే తప్ప, వాటిని నింపి తిరిగి ఇవ్వడం లేదు. సిటీలో పూర్తిగా స్థిరపడిన కొద్దిమంది మాత్రమే హైదరాబాద్‌లో ఓటు కోసం ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.
ఉదాహరణకు గోషామహల్ నియోజకవర్గంలో రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాలకు చెందినవారు ఎక్కువ మంది ఉంటారు. ఆ రాష్ట్రాల్లో ఇటీవల ఓటర్ల సవరణ జరిగినపుడు వారు అక్కడే ఎన్యూమరేషన్(Enumeration) ఫామ్‌లు నింపి ఓటు హక్కును అక్కడే ఉండేలా చేసుకున్నారు. అందుకే ఇప్పుడు హైదరాబాద్‌లో అధికారులు ఇస్తున్న ఎన్యూమరేషన్ ఫామ్‌లను చాలామంది అస్సలు పట్టించుకోవడం లేదు.
ప్రస్తుతం ఈ సమగ్ర సవరణ ప్రక్రియ తెలంగాణతో పాటు మరో 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో నడుస్తోంది. ఇప్పటికే సొంతూళ్లలో ఓటును కన్ఫర్మ్ చేసుకున్నవారు, హైదరాబాద్‌లో ఉన్న ఓటు పోయినా పర్వాలేదని సైలెంట్ అయిపోతున్నారు. అయితే పాతబస్తీ ప్రాంతంలో మాత్రం ఈ ఓటర్ల వివరాలు ఎంటర్ చేసే ప్రక్రియ కొంత మెరుగ్గానే సాగుతోంది.
మరోవైపు ఇప్పుడు ఈ ఎన్యూమరేషన్(Enumeration) ఫామ్ నింపకుండా తేలికగా తీసుకుంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ ఎస్‌ఐఆర్-2026 ఓటర్ల లిస్టే ప్రామాణికంగా మారబోతోంది. కొత్త ఓటరుకు అప్లై చేయాలన్నా , భవిష్యత్తులో వచ్చే సవరణలకైనా ఇదే మెయిన్ డేటాగా ఉండబోతోంది.
Omicron RF.5 : 10 జిల్లాలకు పాకిన ఒమిక్రాన్ ఆర్ఎఫ్.5..మళ్లీ మాస్కుల బాట పట్టాల్సిందేనా?
