NCPI:నాడు అనామక పార్టీ..నేడు దేశ రాజకీయాల్లో కింగ్‌మేకర్ ఎలా అయింది?

NCPI:పశ్చిమ బెంగాల్‌ పాలిటిక్స్‌లో ఎప్పుడూ ఏదో ఒక హడావుడి ఉంటూనే ఉంటుంది. కానీ ఈసారి ఏర్పడిన సంక్షోభం మాత్రం ఏ మాత్రం ఊహించని రేంజ్‌లో ఉంది.

NCPI

ఓడలు బండ్లు అవడం, బండ్లు ఓడలవడం అనే సామెత రాజకీయాలకు బాగా వర్తిస్తుంది. అక్కడ ఏ పార్టీలో ఏం జరుగుతుందో, ఏ పార్టీ జాతకం ఎలా మారిపోతుందో ఊహించడం ఎవరి తరం కాదు.

అలా మొన్నటి వరకూ అసలు పేరే వినపడని ఒక చిన్న లోకల్ పార్టీ, ఈరోజు దేశాన్ని శాసించే స్థాయికి చేరిపోవడమే హాట్ టాపిక్ అయింది. పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్‌లో ఏర్పడిన తీవ్ర రాజకీయ సంక్షోభం వల్ల, తన బ్యాంక్ అకౌంట్‌లో కేవలం రూ. 75 నగదు మాత్రమే ఉన్న ఒక చిన్న అనామక పార్టీ.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఓటమి చవిచూసిన తర్వాత ఆ పార్టీలో పెద్ద ఎత్తున చీలికలు ఏర్పడిన విషయం తెలిసిందే.

అయితే ఆ పార్టీకి చెందిన ఏకంగా 20 మంది లోక్‌సభ ఎంపీలు అధిష్టానంపై తిరుగుబాటు జెండా ఎగురవేసి, నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (NCPI) అనే చిన్న పార్టీలో విలీనం అవుతామని ప్రకటించడమే ఇప్పుడు దేశ రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేస్తోంది.

నిజానికి పశ్చిమ బెంగాల్‌ పాలిటిక్స్‌లో ఎప్పుడూ ఏదో ఒక హడావుడి ఉంటూనే ఉంటుంది. కానీ ఈసారి ఏర్పడిన సంక్షోభం మాత్రం ఏ మాత్రం ఊహించని రేంజ్‌లో ఉంది.

పవర్ కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్‌లో వరుసగా అసంతృప్తి జ్వాలలు రగులుకోవడమే కాదు..ఏకంగా 20 మంది లోక్‌సభ సభ్యులు ఒకే తాటిపైకి వచ్చి మమతా బెనర్జీకి షాక్ ఇచ్చారు.

వీరంతా ఎన్‌సీపీఐ(NCPI) పార్టీలో విలీనం అవ్వడమే కాకుండా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ లీడర్‌షిప్‌లోని ఎన్డీయే కూటమికి తమ పూర్తి మద్దతును ఇస్తామని చెప్పారు.

ఈ తిరుగుబాటు ఎంపీల విలీన ప్రక్రియను గనక లోక్‌సభ స్పీకర్ అధికారకంగా ఆమోదిస్తే.. ఇప్పటివరకు దేశానికి పెద్దగా తెలీని ఎన్‌సీపీఐ పార్టీ ఒక్కసారిగా పార్లమెంట్‌లో ఐదో అతిపెద్ద పొలిటికల్ పార్టీగా అవతరిస్తుంది.

అంతేకాదు కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీయే కూటమి తరఫున సెకండ్ అతిపెద్ద భాగస్వామ్య పక్షంగా గుర్తింపును కూడా పొందుతుంది.ఇదే ధీమాతో ఇప్పటికే ఈ 20 మంది ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ను పర్సనల్‌గా కలిసి .. సభలో తమకు స్పెషల్‌గా సీటింగ్ అరేంజ్‌మెంట్ చేయాలని రిక్వెస్ట్ కూడా చేశారు.

అంతేకాదు వీరంతా పార్టీ ఫిరాయింపుల చట్టం తమకు వర్తించకుండా ఉండటానికి కావలసిన మూడింట రెండొంతుల మెజారిటీ బలం పక్కాగా ఉందన్న పూర్తి ధీమాతో ఉన్నారు.

ఇక ఈ ఎన్‌సీపీఐ పార్టీ పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ విషయం చూస్తే కనుక.. అది మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా(NCPI) పేరుతో 2023 జనవరిలో భారత ఎన్నికల సంఘం దగ్గర ఈ పార్టీ రిజిస్టర్ అయింది.

ఈసీ రికార్డుల ప్రకారం ఎన్‌సీపీఐ(NCPI) పార్టీ ఆఫీస్ పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లా సంకరైల్ అనే ప్రాంతంలో ఉంటుంది. 2022 – 23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అధికారిక ఆడిట్ రిపోర్ట్ చూస్తే, ఈ పార్టీకి విరాళాల రూపంలో మొత్తం వచ్చిన అమౌంట్ కేవలం 1లక్ష13వేల75 రూపాయలు మాత్రమే.

అయితే అలా వచ్చిన ఆ కొద్దిపాటి ఫండ్స్‌ను కూడా పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా ఖర్చు చేసేసింది. ఆ ఫైనాన్షియల్ ఇయర్ ముగిసే టైమ్‌కు పార్టీ ఖజానాలో కేవలం అంటే కేవలం రూ. 75 మాత్రమే మిగిలి ఉన్నట్లు పార్టీ స్వయంగా డిక్లేర్ చేసింది.

2023లో జరిగిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల క్యాంపెయిన్‌లో ఈ పార్టీ ఫస్ట్ టైమ్ పాల్గొంది. ఆ ఎన్నికల క్యాంపెయిన్‌ కోసం పార్టీ పెట్టిన మొత్తం ఖర్చు అక్షరాలా రూ. 49వేల400 మాత్రమే కావడం గమనార్హం.

NCPI

ఈ పార్టీని నడిపించడానికి నిధులు ఇచ్చిన వారిలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు షెవ్లీ కుండు రూ. 15 వేలు విరాళం ఇవ్వగా, వైస్ ప్రెసిడెంట్ ఉత్తియా కుండు రూ. 18 వేలు విరాళం అందించారు.

ఏది ఏమైనా, కేవలం 75 రూపాయలు మాత్రమే పార్టీ ఫండ్ ఉన్న ఒక అనామక రాజకీయ పార్టీ.. ఈరోజు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే స్థాయికి చేరడంతో విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోతున్నారు.

Sagittarius : నిజాయితీ, మొహమాటం లేని మాటలు..ధనస్సురాశి మైండ్ సెట్ ఇదే

Exit mobile version