Trump : ఇరాన్‌పై దాడులకు లాస్ట్ మినిట్‌లో బ్రేక్ వేసిన ట్రంప్..సౌదీ రాజు ఫోన్ కాల్‌తోనే యుద్ధం ఆగిందా?

Trump : ఇరాన్‌పై విరుచుకుపడటానికి ఆయుధాలు సిద్ధం చేసుకున్న సమయంలో.. చివరి నిమిషంలో తమ వైమానిక దాడుల ప్లాన్‌ను టెంపరరీగా హోల్డ్‌లో పెడుతున్నట్లు ప్రకటించిన ట్రంప్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.

Trump

ప్రపంచమంతా ఊపిరి బిగబట్టుకుని చూస్తున్న టైమ్‌లో, పశ్చిమాసియాలో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న తీవ్ర ఉత్కంఠ నడుమ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Trump) ఒక ఊహించని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌పై విరుచుకుపడటానికి ఆయుధాలు సిద్ధం చేసుకున్న సమయంలో.. చివరి నిమిషంలో తమ వైమానిక దాడుల ప్లాన్‌ను టెంపరరీగా హోల్డ్‌లో పెడుతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంతటి భయంకరమైన స్థాయిలో విధ్వంసం సృష్టించడానికి యుఎస్ బలగాలు సర్వసన్నద్ధమైన సమయంలో, ఈ అనూహ్యమైన యు టర్న్ రావడం వెనుక పశ్చిమాసియా రాజకీయాల్లో చాలా పెద్ద వ్యూహాత్మక డ్రామానే నడిచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అసలు ఈ దాడులు ఎందుకు ఆగాల్సి వచ్చిందో డొనాల్డ్ ట్రంప్(Trump) స్వయంగా తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్ ద్వారా క్లియర్‌గా వెల్లడించారు. ఇరాన్‌తో పాటు మధ్య ప్రాచ్యంలోని ఇతర మిత్రదేశాలు తమను డైరెక్టుగా అభ్యర్థించడం వల్లే ఈ బాంబింగ్ ప్లాన్‌ను పక్కన పెట్టాల్సి వచ్చిందని ట్రంప్ అన్నారు.

అయితే ఇది శాశ్వత విరమణ కాదని, రెండు వర్గాల మధ్య వేగంగా ఒక అగ్రిమెంట్ కుదరడంపైనే ఈ శాంతి ఆధారపడి ఉంటుందని డొనాల్డ్ ట్రంప్ చాలా తీవ్రంగా హెచ్చరించారు. ఒకవేళ చర్చలు అనుకున్నట్లు సాగకపోతే మాత్రం ఏ క్షణంలోనైనా మునుపెన్నడూ చూడని స్థాయి దాడిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలనే సంకేతాలను కూడా ఆయన ఇచ్చేశారు.

ఈ క్లిష్ట సమయంలో పశ్చిమాసియా దేశాలు అమెరికాను ఆశ్రయించి, ఒక అవగాహనకు వచ్చేలా గడువు ఇవ్వాలని కోరడంతోనే ఈ టెంపరరీ యుద్ధ విరామం సాధ్యమైంది. గ్లోబల్ ప్రశాంతతను, అలాగే ఇరాన్ ఉనికిని, మనుగడను దృష్టిలో ఉంచుకునే ఈ అడుగు ముందుకు వేసినట్లు ట్రంప్ స్పష్టం చేశారు. ఈ రకమైన చర్చలు, దౌత్య ప్రక్రియల్లో తమ మిత్ర దేశమైన ఇజ్రాయెల్ కూడా తమతో భాగస్వామిగా పూర్తి సహకారాన్ని అందిస్తోందని అన్నారు.

Trump

అయితే ఈ దాడులు ఆగడానికి మెయిన్ టర్నింగ్ పాయింట్ సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఒక ఇంపార్టెంట్ పిలుపేనని అంతర్జాతీయ వర్గాల్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. దాడులకు కొద్ది సమయం ముందు సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అమెరికా అధ్యక్ష్యుడు డోనాల్డ్ ట్రంప్‌తో స్వయంగా ఫోన్‌లో మాట్లాడారు.

ఇరాన్‌పై విరుచుకుపడితే ప్రాంతీయంగా వచ్చే వినాశకర పరిణామాలను సౌదీ అరేబియా యువరాజు వివరించి.. ఈ వైమానిక దాడుల నిర్ణయాన్ని మరొక్కసారి పునరాలోచించాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ దౌత్యపరమైన ఒత్తిడి, మిత్రదేశాల విజ్ఞప్తుల వల్లే వినాశనానికి దారితీసే యుద్ధానికి టెంపరరీగా బ్రేకులు పడ్డాయి.

Tirumala Laddu : 310 ఏళ్ల తిరుమల లడ్డూ చరిత్ర..శతాబ్దాల నాటి శ్రీవారి లడ్డూ చరిత్రలో సరికొత్త అధ్యాయం

Exit mobile version