Supreme Court
పెళ్లి కాకుండా ఒక అబ్బాయి, అమ్మాయి కలిసి ఉంటే .. సమాజం వారి క్యారెక్టర్‌పై ఒక ముద్ర వేస్తుంది. కానీ, సొసైటీ చూసే చూపుతో చట్టానికి సంబంధం లేదని, నైతికత పేరుతో ఎవరి వ్యక్తిగత ఫ్రీడమ్‌ను లాక్కోలేరని చెబుతూ సుప్రీంకోర్టు(Supreme Court) ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తోంది.
మేజర్లు అయిన ఇద్దరు వ్యక్తులు తమ పూర్తి ఇష్టంతో శారీరక సంబంధం పెట్టుకుంటే దానిని నేరంగా చూడలేమని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
అయితే ఈ సంచలన తీర్పుకు అసలు బీజం ఎక్కడ పడిందంటే.. తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ టైములో ఒక అభ్యర్థి తనపై గతంలో ఉన్న ఒక పర్సనల్ కేసు వివరాలను అప్లికేషన్‌లో నిజాయితీగా అంగీకరించాడు.
అయితే, ఆ ఒక్క రీజన్‌ను చూపిస్తూ రిక్రూట్‌మెంట్ బోర్డ్ అతనికి ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.. అభ్యర్థి తన గతాన్ని దాచకుండా నిజాయితీగా చెప్పినపుడు అతని పర్సనల్ లైఫ్‌ను సాకుగా చూపిస్తూ అతని కెరీర్‌ను నాశనం చేయడం అన్యాయమని తేల్చి చెప్పింది. అంతేకాదు వెంటనే అతనికి ఉద్యోగాన్ని ఇవ్వాలని ఆదేశించింది. ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక పెద్ద సామాజిక చర్చకు తెరలేపింది.
ఈ తీర్పు వెనుక ఉన్న అసలు చట్టపరమైన కోణాన్ని ఒకసారి గమనిస్తే.. ఇద్దరు మేజర్లు తమ సొంత ఇష్టంతో తీసుకునే నిర్ణయాలు వారి వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రైవసీ పరిధిలోకి వస్తాయని కోర్టు గుర్తు చేసింది. కేవలం వివాహం జరగలేదనే ఒకే ఒక్క కారణాన్ని పట్టుకుని, ఆ బంధాన్ని , ఆ వ్యక్తి విలువను తక్కువ చేసి మాట్లాడటం చట్టప్రకారం చెల్లదని పాయింట్ అవుట్ చేసింది.
ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాల సమయంలో అభ్యర్థులు తమ గతాన్ని దాచకుండా ఓపెన్‌గా చెప్పినప్పుడు, వారి పర్సనల్ లైఫ్‌ను సాకుగా చూపిస్తూ వాళ్ల కెరీర్‌ను నాశనం చేయడం కరెక్ట్ కాదనే భరోసాను ఈ తీర్పు ఇచ్చింది.
అయితే ఈ తీర్పుపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సాంప్రదాయ శైలిలో ఆలోచించే కొన్ని హైందవ, సామాజిక సంఘాలు ఈ తీర్పును అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇలాంటి రూల్స్ వల్ల సొసైటీలో నైతిక విలువలు పూర్తిగా పడిపోతాయని, యూత్ ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించి తప్పుదోవ పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇటు ఇలాంటి తీర్పుల వల్ల మన సంస్కృతీ సంప్రదాయాల భవిష్యత్తు ఏమైపోతుందో అని కుటుంబాల్లోని పెద్దలు కూడా భయపడుతున్నారు. ఫ్యూచర్‌లో బంధాలకు, పెళ్లిళ్లకు విలువ లేకుండా పోతుందేమోనని కంగారు పడుతున్నారు.
కానీ ఇంకోవైపు మానవ హక్కుల వాదులు, సామాజిక విశ్లేషకులు మాత్రం ఈ తీర్పును హర్షిస్తున్నారు. ఒక మనిషి ప్రైవసీకి, ఫ్రీడంకు చట్టం ఇచ్చిన పెద్ద రక్షణే ఈ తీర్పు అంటూ వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ తీర్పు వల్ల యూత్‌పై ఎలాంటి ప్రభావం పడుతుందనేది కూడా ఆలోచించాల్సిన విషయమే. ఒక రకంగా చూస్తే, తమ పర్సనల్ నిర్ణయాలకు చట్టబద్ధమైన రక్షణ ఉందనే ధైర్యం వీరిలో పెరుగుతుంది. అదే సమయంలో, స్వేచ్ఛ దొరికింది కదా అని బాధ్యతను మర్చిపోయే ప్రమాదం కూడా ఉంది.
ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తి ఇష్టాన్ని గౌరవించడం, హద్దులు దాటకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు ఇలాంటి చట్టాలను తప్పుగా అర్థం చేసుకుని, ఇక మనల్ని అడిగేవాడే లేడని ప్రవర్తిస్తే లైఫ్ ఇబ్బందుల్లో పడుతుంది.
అయితే, పోలీస్ రిక్రూట్‌మెంట్ వంటి జాబులలో గతంలో జరిగిన చిన్న చిన్న పర్సనల్ విషయాల వల్ల ..ఉద్యోగ అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఉండదనే నమ్మకం అభ్యర్థులకు కలగడం మాత్రం ఒక పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పాలి.
మొత్తంగా.. కేవలం చట్టపరమైన హక్కులను మాత్రమే కోర్టులు కాపాడగలవు..కానీ సమాజంలో నైతికతను నిలబెట్టాల్సింది మాత్రం ఇళ్లల్లో నేర్పే సంస్కారం, బాధ్యతాయుతమైన ప్రవర్తన మాత్రమేనని అందరూ గుర్తుంచుకోవాలి.
Peddi Box Office : మెగా పవర్ స్టార్ వన్ మ్యాన్ షో.. పెద్ది బాక్సాఫీస్ విధ్వంసం
