Amaravati
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఏపీ రాజధాని విషయంలోనే ఎక్కువ చర్చ జరిగింది. చివరకు అమరావతి(Amaravati)ని అప్పటి సీఎం చంద్రబాబు రాజధానిగా ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉన్న వైయస్ జగన్ దీనికి మద్దతు తెలిపారు. మళ్ళీ 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిపై వైఖరి మార్చుకున్నారు.
మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారు. దీనిపై బిల్లు తీసుకొచ్చినా అది అసెంబ్లీలో వీగిపోయింది. తీరా 2024 ఎన్నికల ఫలితాల తర్వాత ఘోర పరాజయం వల్ల తాము అమరావతికి వ్యతిరేకం కాదని వైఎస్సార్సీపీ ప్రకటించింది. మళ్ళీ ఇటీవల జగన్ మావిగన్ అంటూ మరో ప్రతిపాదన తీసుకొచ్చారు.
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలిపి మావిగన్(Mavigun) కారిడార్‌ను ఆయన తెరపైకి తెచ్చారు.ఈ ప్రాంతంలో ఇప్పటికే ఉన్న పోర్టు, రైలు, రోడ్డు, ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ వల్ల తక్కువ ఖర్చుతో వేగంగా అభివృద్ధి చేయవచ్చని ప్రతిపాదించారు.
అమరావతి గ్రీన్‌ఫీల్డ్ సిటీ కోసం లక్ష కోట్లకు పైగా ఖర్చు చేయడం ఆర్థికంగా సాధ్యం కాదని, నదీ పరివాహక ప్రాంతంలో రాజధాని నిర్మించడం భౌగోళికంగా ప్రమాదకరమని జగన్ విమర్శించారు.మరోవైపు తెలుగుదేశం,జనసేన,బీజేపీ కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
2028 చివరి నాటికి అమరావతిలో మెజారిటీ మౌలిక సదుపాయాల పనులను పూర్తి చేయాలని కూటమి లక్ష్యంగా పెట్టుకుంది. 2029 ప్రారంభంలో ఐకానిక్ భవనాలను ప్రధాని మోదీ చేత ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.పార్లమెంట్‌లో ప్రత్యేక బిల్లు ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి ఏకైక శాశ్వత రాజధానిగా చట్టబద్ధమైన హోదాను కూడా కల్పించారు.
జగన్ పదే పదే మాట మారుస్తున్నారని మావిగన్ పేరుతో పెట్టుబడిదారులను భయపెడుతూ అమరావతి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని టీడీపీ మండిపడుతోంది.తాజాగా రాజధాని విషయంలో జగన్ క్లారిటీ ఇచ్చేశారు. అమరావతిని సమర్థించేవారు టీడీపీ కూటమికి, వికేంద్రీకరణతో కూడిన మావిగన్ అభివృద్ధిని కోరుకునేవారు వైఎస్సార్‌సీపీకి ఓటు వేయాలని ఆయన సవాల్ విసిరారు.
దీంతో 2029 ఎన్నికల్లో అధికారం ఎవరిది అనేది రాజధాని విషయమే తేల్చబోతోంది. అప్పటి వరకు అమరావతి(Amaravati) వర్సెస్ మావిగన్ మధ్యనే ఏపీ రాజకీయాలు నడవబోతున్నాయి.
Date Of Birth : ఈరోజు వారికి కొత్త పరిచయాలు.. కానీ ఆ డేట్‌లో పుట్టినవారు మాత్రం కోపం తగ్గించుకోవాలి
