Jana Nayagan : జననాయకుడికి లైన్ క్లియర్‌..సంక్రాంతి మిస్ అయినా జూలైలో దళపతి వేట షురూ..

Jana Nayagan : జన నాయగన్ మూవీకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) 'A' సర్టిఫికేట్ ఇచ్చిందని..త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ క్లియరెన్స్ పత్రాలు రానున్నట్లు తెలుస్తోంది.

Jana Nayagan

కోలీవుడ్ దళపతి, ప్రస్తుత తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ సినీ కెరీర్‌లో లాస్ట్ మూవీగా తెరకెక్కిన జన నాయగన్(Jana Nayagan) రిలీజ్‌కు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో అడుగుపెట్టడానికి ముందు విజయ్ నటించిన ఆఖరి మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.

పొలిటికల్ రీజన్స్ వల్ల కొన్ని నెలలుగా సెన్సార్ ఇబ్బందుల్లో చిక్కుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కొత్త అప్‌డేట్ బయటకు రావడంతో .. ఆ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది.

నిజానికి డైరెక్టర్ హెచ్. వినోద్ కాంబినేషన్‌లో పాన్ ఇండియా లెవెల్‌లో తీసిన జననాయకుడు చిత్రాన్ని.. 2026 సంక్రాంతి బరిలోనే రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ ప్లాన్ చేసింది. దీని కోసం 2025 డిసెంబర్‌లోనే ఈ మూవీని సెన్సార్ బోర్డ్‌కు పంపించారు.

అయితే స్టోరీలో ఉన్న కొన్ని ఘాటైన రాజకీయ డైలాగులు, వివాదాస్పద సీన్స్ వల్ల సెన్సార్ సభ్యులు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. దీంతో జననాయకుడు మూవీ అనుకున్న సమయానికి థియేటర్లలోకి రాలేకపోయింది.

ఆ తర్వాత కోర్టు కేసులు, ఇతర సమస్యల వల్ల సుమారు 7 నెలల పాటు ఈ మూవీ రిలీజ్‌పై సస్పెన్స్ కొనసాగింది.కాగా ఇప్పుడు ఈ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ సెన్సార్ చిక్కులన్నీ కూడా కొలిక్కివచ్చినట్లు కోలీవుడ్ సినీ వర్గాలు చెబుతున్నాయి.

Jana Nayagan

ఈ మూవీకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ‘A’ సర్టిఫికేట్ ఇచ్చిందని..త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ క్లియరెన్స్ పత్రాలు రానున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ జూలై నెలలోనే జననాయకుడుని థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ రెడీ అవుతున్నట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాకపోయినా.. సెన్సార్ ప్రక్రియ ఫైనల్ స్టేజ్‌కు చేరిందనే ప్రచారం ఇండస్ట్రీలో జోష్ తెప్పిస్తోంది.

Amarnath Yatra : రేపటి నుంచే అమర్‌నాథుడి దర్శనం.. వెళ్లాలనుకుంటే మాత్రం ఈ 5 జాగ్రత్తలు పాటించాల్సిందే..

Exit mobile version