AP EAPCET
ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ , ఫార్మసీ కోర్సుల్లో చేరాలనుకునే స్టూడెంట్స్‌కు కీలక సమయం ఆసన్నమైంది. ఏపీ ఈఏపీసెట్ 2026 ఎంట్రన్స్ టెస్టుకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే సాధారణ గడువు ముగిసిపోగా, భారీ లేట్ ఫీతో అప్లై చేసుకోవడానికి ఈరోజు అంటే ఏప్రిల్ 10వ తారీఖు రాత్రి 11 గంటల వరకు మాత్రమే చివరి అవకాశం ఉంది.
ఇప్పటివరకు టెక్నికల్ ఇష్యూల వల్లో లేదా ఇతర ఇబ్బందుల వల్లో అప్లై చేయలేని అభ్యర్థులు ఈ కొన్ని గంటల సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యమని అధికారులు చెబుతున్నారు. దరఖాస్తు ప్రక్రియ ముగిసిన వెంటనే, అంటే ఏప్రిల్ 11 నుంచి 13 వరకు అభ్యర్థులు తమ అప్లికేషన్లలో జరిగిన పొరపాట్లను సరిచేసుకోవడానికి ఎడిట్ విండో అవయిలబుల్‌గా ఉంటుంది. అయితే ఇది కేవలం గతంలో అప్లై చేసిన వారికి మాత్రమే వర్తిస్తుందని, కొత్తగా దరఖాస్తు చేయడానికి వీలుండదని గమనించాలని అధికారులు వివరిస్తున్నారు.
ఈ ఏడాది అభ్యర్థులను వేధిస్తున్న మెయిన్ డౌట్ ఇంటర్ మార్కుల వెయిటేజీ గురించే ఉంటుంది. గత విద్యా సంవత్సరాల్లో ఉన్నట్లే ఇప్పుడు కూడా ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంటుందని ఉన్నత విద్యామండలి ఇప్పటికే స్పష్టం చేసింది. అంటే ఈఏపీసెట్ ర్యాంకును నిర్ణయించేటప్పుడు ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులకు 75 శాతం, ఇంటర్మీడియట్ గ్రూపు మార్కులకు 25 శాతం ప్రాధాన్యత ఇస్తారు.
కాబట్టి విద్యార్థులు రెండు పరీక్షలపైన కూడా సమాన దృష్టి సారించాల్సి ఉంటుంది. పరీక్షా విధానం విషయానికి వస్తే, మొత్తం 160 మార్కులకు ఆబ్జెక్టివ్ తరహాలోనే ప్రశ్నలుంటాయి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్‌కు మ్యాథమెటిక్స్‌లో 80, ఫిజిక్స్‌లో 40, కెమిస్ట్రీలో 40 మార్కులు ఉండగా, అగ్రికల్చర్ స్ట్రీమ్ వారికి బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల్లో ఒక్కొక్క దాని నుంచి 40 మార్కుల చొప్పున ప్రశ్నలు వస్తాయి. నెగిటివ్ మార్కులు లేకపోవడం స్టూడెంట్స్‌కు కలిసొచ్చే అంశంగా మారుతుంది.
ఎగ్జామ్స్ షెడ్యూల్ విషయానికి వస్తే, మే 12, 15, 18 తారీఖులలో ఇంజనీరింగ్ విభాగం వారికి, మే 19 , 20 తేదీల్లో అగ్రికల్చర్ , ఫార్మసీ విభాగం వారికి ఆన్‌లైన్‌లోనే ఎగ్జామ్స్ జరుగుతాయి. ఏప్రిల్ 28 నుంచి అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 23న ప్రాథమిక కీ రిలీజ్ కానుండగా, జూన్ 1న ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంటుంది.
సమయం తక్కువగా ఉండటంతో అభ్యర్థులు ప్రిపరేషన్ స్పీడప్ చేయడంతో పాటు, అప్లికేషనల్‌లలో ఏవైనా తప్పులు ఉంటే రేపటి నుంచి అంటే ఏప్రిల్ 11నుంచి ప్రారంభమయ్యే ఎడిట్ ఆప్షన్ ద్వారా వాటిని సరిదిద్దుకోవాలి. ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌తో పాటు,గవర్నమెంట్ అందించే వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా లేటెస్ట్ సమాచారాన్ని పొందే వీలుంటుంది.
Dacoit Movie : డెకాయిట్ గా అడివి శేష్ మెప్పించాడా ?…రొమాంటిక్ యాక్షన్ మూవీ రివ్యూ
