Bigg Boss 10 : బిగ్ బాస్ హౌస్‌లో వీజే సన్నీ పంచ్‌లు..కంటెస్టెంట్లకు అదిరిపోయే క్లాస్..

Bigg Boss 10 : బిగ్ బాస్ సీజన్ 10 ఎపిసోడ్‌లో వీజే సన్నీ, సిరి ఎంట్రీతో హౌస్‌లో సందడి మొదలైంది. చీర కట్టి ఎంటర్‌టైన్ చేయడం, కంటెస్టెంట్లకు ఇచ్చిన సలహాలతో హౌస్ సందడి సందడిగా మారింది.

Bigg Boss 10

బిగ్ బాస్ ఆట చివరి స్టేజ్‌కు చేరుకుంటున్న సమయంలో హౌస్‌లోకి పాత కంటెస్టెంట్లు ఒక్కొక్కరూ అడుగుపెడుతూ షోకి కొత్త జోష్ తెస్తున్నారు. మొన్నటి వరకూ కొంచెం డల్‌గా, కంటెస్టెంట్‌లు కత్తులు దూసుకునేలా సాగుతున్న సీజన్ 10(Bigg Boss 10) ఎపిసోడ్‌లో వీజే సన్నీ, సిరి హనుమంత్ ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా బిగ్ బాస్ హౌస్ వాతావరణం మారిపోయింది. సీజన్(Bigg Boss 10) ఫైవ్ లో వీళ్లిద్దరి మధ్య ఎప్పుడూ ఉప్పు నిప్పులా సాగిన గేమ్ ఇప్పుడు ఇక్కడ ఎంటర్‌టైన్మెంట్ ట్రాక్‌లోకి మారింది.

సన్నీ హౌస్‌లోకి అడుగుపెట్టిన వెంటనే కంటెస్టెంట్లు అందరి గురించి తనదైన స్టైల్‌లో కౌంటర్లు, సలహాలిచ్చాడు . ముందుగా త్రిగుణ్‌తో మాట్లాడిన సన్నీ.. మంచివాడా చెడ్డవాడా అనేది అర్థం కావడం లేదంటూ తనదైన స్టైల్‌లో కామెడీగా చురకలంటించాడు. నీ గేమ్ ప్లాన్ ఏంటో ఎవరికీ అంతుబట్టడం లేదని, మిగిలిన రెండు వారాలు అందర్నీ కలుపుకొని వెళ్లమని, ఎవరైనా తప్పు చేస్తే నువ్వు కూడా అదే దారి పట్టొద్దంటూ పర్సనల్‌గా మంచి గైడెన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత దేబ్జానీ, వంశీ, సుధీర్, శివ్, నరేష్, అమన్‌పై కూడా పాజిటివ్ కామెంట్స్ చేసి అందరిలో ఉత్సాహం నింపాడు.

ఇక వర్షిణి మీద సన్నీ వేసిన పంచ్‌లు హౌస్‌లో ఓ రేంజ్‌లో నవ్వులు పూయించాయి. వర్షిణి.. ముకేష్ సంరక్షిణీ అంటూ సరదాగా ఆటపట్టిస్తూనే, ఇకపై నీ ఆట నువ్వు ఆడాలంటూ ఫ్రెండ్లీ రిక్వెస్ట్ చేశాడు. టాస్క్‌లలో ముకేష్‌ను బుల్లెట్‌తో పోలుస్తూనే, గేమ్ అయిపోయాక హర్ట్ అయినవాళ్లకు ఒక సారీ లేదా హగ్ ఇస్తే గేమ్‌ ఇంకా బాగుంటుందని చెప్పాడు. చివరికి కప్పు ఇంపార్టెంట్‌ బిగులూ అంటూ ఇండైరెక్టుగా టైటిల్ రేస్‌ను గుర్తు చేశాడు. సుధీర్, ముకేష్ మధ్య ఫ్రెండ్‌షిప్ బాగుందని మెచ్చుకుంటూ.. ఎవరో ఏదో అన్నారని మనసులో పెట్టుకోకుండా చివరి వరకూ కలిసి ఉండాలని సలహా ఇచ్చాడు.

అంతేకాకుండా చివరిలో సన్నీ శారీ కట్టుకుని హౌస్‌మేట్స్‌తో చేసిన సందడి ఎపిసోడ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఎప్పుడూ గొడవలేనా, కాస్త నవ్వించండంటూ తనదైన స్టైల్‌లో అల్లాడించాడు. మరోవైపు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో నరేష్ తరఫున సన్నీ, వర్షిణి తరఫున సిరి పోటీ పడగా.. ఫిజికల్ టాస్క్ కావడంతో సిరి చేతులెత్తేయగా, సన్నీ బాగా ఆడి నరేష్‌ను గెలిపించాడు.

టాస్క్‌లో ఓడిపోయిన బాధతో వర్షిణి వాష్‌రూమ్‌లోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడవటం హౌస్‌లో ఎమోషనల్ టర్న్ తీసుకుంది. తనకు ఎవరూ సపోర్ట్ చేయడం లేదని, ముకేష్ మాత్రమే అండగా నిలబడ్డాడని బాధపడింది. వెంటనే సన్నీ ఇది స్ట్రెంత్ గేమ్, నువ్వు ఇన్నాళ్లు హౌస్‌లో ఉన్నావంటే జనాలు నిన్ను ఇష్టపడుతున్నారనే కదా, ఆ ప్రేమ ఏంటో అర్థం చేసుకోవాలంటూ హర్షిణికి ధైర్యం చెప్పాడు. అలాగే హౌస్‌లో అందరూ నరేష్‌కే సపోర్ట్ చేస్తున్నారని, ఒకరికొకరు తోడుగా నిలబడటం కూడా గేమ్‌లో పార్ట్‌ అని చెప్పాడు. నరేష్‌ను కంటెండర్‌గా ప్రకటిస్తూ.. వర్షిణి పెట్టిన ఎఫర్ట్‌ను కూడా సన్నీ మెచ్చుకున్నాడు.

మొత్తానికి సన్నీ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్‌(Bigg Boss 10)లో గొడవల ప్లేస్‌లో ఎంటర్‌టైన్మెంట్, ఎమోషన్, గేమ్ ప్లాన్‌లపై కొత్త చర్చ షురూ అయింది. ఫినాలే దగ్గరపడుతున్న సమయంలో ఈ హింట్స్, సలహాలు కంటెస్టెంట్ల గేమ్‌ను ఏ మలుపు తిప్పుతాయో చూడాలి.

Meet A Stranger : సిటీలో స్ట్రేంజర్ మీట్, స్పీడ్ డేటింగ్ క్రేజ్..రీఫ్రెష్‌మెంట్ వెనుక రిస్క్‌లున్నాయా?

↑
Exit mobile version