Weight Loss : వెయిట్ లాస్ కోసం పండ్లు తింటున్నారా?.. బరువు పెరుగుతారేమో చూసుకోండి..

Weight Loss : వెయిట్ తగ్గాలనే తొందరలో మిగతా పోషకాహారాన్ని పక్కన బెట్టి కేవలం ఫ్రూట్స్‌నే మెయిన్ ఫుడ్‌గా మార్చుకుంటే బాడీలో న్యూట్రిషన్ ఇంబ్యాలెన్స్ ఏర్పడే అవకాశం ఉంటుందది.

Weight Loss

వెయిట్ తగ్గాలని డిసైడ్ అవ్వగానే చాలామంది ముందుగా అన్నాన్ని పక్కనపెట్టి ప్లేట్ నిండా పండ్లు పెట్టుకుని తినడం స్టార్ట్ చేస్తారు. పండ్లు చాలా హెల్దీ అని వాటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని ఎంత తిన్నా బరువు పెరగం అని ఫీలవుతుంటారు.

నిజమే ఫ్యూట్స్‌లో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ వాటితో పాటే నేచురల్ షుగర్ (ఫ్రక్టోజ్) కూడా భారీగానే ఉంటుందనే విషయాన్ని వీరు మర్చిపోతుంటారు. పండ్ల పేరు చెప్పి మోతాదుకు మించి క్యాలరీలు కడుపులోకి వేసేస్తే వెయిట్ తగ్గడం మాట పక్కన పెడితే రివర్స్‌లో పెరిగిపోతారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మెయిన్‌గా మామిడి పండ్లు, అరటి పండ్లు, ద్రాక్ష, సపోటా, సీతాఫలం వంటి ఫ్రూట్స్‌లో క్యాలరీలు, షుగర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. వీటిని అన్నానికి బదులు ప్లేట్ల కొద్దీ తినేస్తే డైలీ తీసుకోవాల్సిన క్యాలరీ లిమిట్ కూడా దాటిపోతుంది.

అయితే ప్రాసెస్డ్ స్నాక్స్, చిప్స్, కూల్ డ్రింక్స్‌కు బదులుగా ఆపిల్ , అరటిపండు తీసుకోవడం వల్ల క్యాలరీలు తగ్గుతాయి కాబట్టి వెయిట్ లాస్‌‌కి ఉపయోగపడుతుంది. కానీ ఫ్రూట్స్ హెల్దీ ఫుడ్ కదా అని రోజంతా అవే తింటూ ఉంటే మాత్రం మీ వెయిట్ లాస్ గోల్‌ను అక్కడే మర్చిపోవాల్సిందే.

న్యూట్రిషన్ నిపుణులు చెబుతున్నదాని ప్రకారం ఒక సాధారణ మనిషి రోజుకి 2 నుంచి 3 పోర్షన్లు పండ్లు తింటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ అస్సలు అవసరం లేదు. పైగా ఫ్రూట్ జ్యూస్‌లను తాగడం కంటే డైరెక్టుగా పండును నమిలి తినడమే మంచిది.

Weight Loss

ఎందుకంటే పండును డైరెక్టుగా తిన్నప్పుడు జ్యూస్‌ తాగినప్పటిలా షుగర్ లెవెల్స్ త్వరగా పెరిగిపోవు. అలాగే ఫ్రూట్ వల్ల లభించే ఫైబర్ వల్ల కడుపు త్వరగా నిండి ఎక్కువ సేపు ఆకలి కూడా వేయకుండా ఉంటుంది. పండ్లను కొన్ని ప్రోటీన్లు లేదంటే హెల్దీ ఫ్యాట్స్‌తో కలిపి తీసుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి.

మొత్తంగా చెప్పాలంటే వెయిట్ తగ్గాలనే(Weight Loss) తొందరలో మిగతా పోషకాహారాన్ని పక్కన బెట్టి కేవలం ఫ్రూట్స్‌నే మెయిన్ ఫుడ్‌గా మార్చుకుంటే బాడీలో న్యూట్రిషన్ ఇంబ్యాలెన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి పండ్లను లిమిట్‌గా, సరైన టైమ్‌లో తింటూ హెల్దీగా బరువు తగ్గడానికి(Weight Loss) చూడాలి.

Weaponised Vulnerability : బంధాల్లో వెపనైజ్డ్ వల్నరబిలిటీ గురించి విన్నారా? మీరూ ఆ ఎమోషనల్ ట్రాప్‌లో ఉన్నారా?

↑
Exit mobile version