AP Panchayat And Municipal Elections
ఏపీ రాజకీయాల్లో లోకల్ బాడీ ఎన్నికల పోరు హీటు రాజేసింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 26 జిల్లాల్లో తొలి విడత పంచాయతీ ఎన్నికలతో పాటు, 23 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన రెండో విడత ఓటింగ్(AP Panchayat And Municipal Elections) ఈరోజు అంటే నవంబర్ 26వ తేదీ ఉదయం 7 గంటల నుంచే మొదలైంది. విశాఖపట్నం, గుంటూరు జిల్లాలలో తప్ప మిగిలిన అన్ని జిల్లాల్లోని 42 డివిజన్లు, 201 మండలాల్లో పోలింగ్ ప్రాసెస్ కొనసాగుతోంది.
మొత్తం 3,240 గ్రామపంచాయతీలకు గాను 709 చోట్ల ఇప్పటికే ఏకగ్రీవాలు పూర్తి కాగా, మిగిలిన 3,189 సర్పంచ్ పదవులు, 25,101 వార్డు స్థానాల కోసం 62వేల863 మంది కేండిడేట్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పట్టణాల్లో శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, కాకినాడ, మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్లలో 4 మేయర్ సీట్లకు 36 మంది పోటీ పడగా, 19 మున్సిపాలిటీలలో 134 మంది చైర్‌పర్సన్ కేండిడేట్స్ బరిలో ఉన్నారు. 964 వార్డుల్లో 2,968 మంది పోటీ పడుతున్నారు. సుమారు 99.43 లక్షల మంది ఓటర్ల కోసం 34,312 పోలింగ్ కేంద్రాలను అధికారులు రెడీ చేశారు.
సీఎం నారా చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణితో కలిసి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకే పోలింగ్‌కు అవకాశం ఉండటంతో.. పల్లెలు, పట్టణాల్లో ఉదయాన్నే ఓటర్లు పోలింగ్ బూత్‌ల ముందు క్యూలు కట్టారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు, టి.నర్సాపురం, కర్నూలు జిల్లా గోస్పాడు, హాలహర్వి వంటి ప్రాంతాల్లో ఓటర్లు ఉత్సాహంతో ఓటును వేస్తున్నారు.
అయితే, కొన్నిచోట్ల రాజకీయ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అన్నమయ్య జిల్లా సంబేపల్లె వద్ద సర్పంచ్ కేండిడేట్ యశోదమ్మతో పాటు వైసీపీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రంలోకి రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారంటూ వివాదం చెలరేగింది. నిరసనకు దిగిన వారిని స్టేషన్‌కు తరలించి గేటుకు తాళం వేయడంతో, అభ్యర్థి ఎన్నికల బహిష్కరణ ప్రకటన చేశారు. మరోవైపు నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే శిల్పారవిని పోలీసులు ఎటువంటి అల్లర్లు జరగకుండానే ముందుగానే హౌస్ అరెస్ట్ చేయడం కలకలం రేపింది.
శ్రీకాకుళం, ఎన్టీఆర్ జిల్లాల్లో పోలీసుల భారీ బందోబస్తు మధ్య ఓటింగ్ కూల్‌గా సాగుతోంది. కాగా గత ఎన్నికల ఇంక్ మార్క్ ఇంకా చెరిగిపోకపోవడంతో ఎటువంటి కన్ఫూజన్ లేకుండా ఓటర్ల ఎడమచేతి చిటికెన వేలుపై సిరా గుర్తు వేయాలని ఇప్పటికే ఎస్‌ఈసీ అనిల్ చంద్ర పునేఠా ఆదేశించడంతో ఓటర్ల చిటికెన వేలుకు సిరా గుర్తు వేస్తున్నారు. పంచాయతీ పోలింగ్(AP Panchayat And Municipal Elections) మధ్యాహ్నం 1 గంటకు ముగిసి, 2 గంటల నుంచే ఓట్ల లెక్కింపు చేపట్టి ఈరోజే ఫలితాలను ఇస్తారు. మున్సిపల్ ఎన్నికల లెక్కింపు మాత్రం ఈ నెల 30వ తేదీన జరగనుంది.
Premature Aging : టెన్షన్ పడితే ఫేస్ షేప్ మారిపోతోందా? చిన్న వయసులోనే ఏజింగ్ ఛాయలొస్తాయా?
