Healthy Seeds : మంచివి కదా అని ఆ గింజలు తింటున్నారా? ఈ చిన్న తప్పు చేస్తున్నారా?

Healthy Seeds : సబ్జా విత్తనాలను మలబద్ధకం లేదా జీర్ణ సమస్యలతో బాధపడేవారు కాసేపు నీళ్లలో నానబెట్టి తీసుకోవచ్చు.

Healthy Seeds

ఇప్పుడు చాలామందికి హెల్త్‌పై కేర్ బాగా పెరిగింది. దాంతో ప్రతి ఒక్కరి డైలీ మెనూలో వివిధ రకాల విత్తనాలు లేదా సీడ్స్‌(Healthy Seeds)కి చాలా ఇంపార్టెన్స్ పెరిగింది. మెయిన్‌గా చియా సీడ్స్, అవిసె గింజలు, గుమ్మడి విత్తనాలు, నువ్వులు, సబ్జా గింజలు వంటి సీడ్స్‌ను చాలామంది రెగ్యులర్‌గా తీసుకుంటున్నారు.

అయితే ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సిన అసలైన విషయమేంటంటే.. వీటిని మనం ఏ విధంగా తింటున్నామన్నది చాలా ఇంపార్టెంట్ అని న్యూట్రిషనిస్ట్‌లు చెబుతున్నారు. ఈ విత్తనాలను సరైన కాంబినేషన్‌లో సరిగ్గా తీసుకుంటేనే సీడ్స్‌(Healthy Seeds)లోని పూర్తి పోషకాలను మన బాడీ గ్రహించగలుగుతుంది.

మొదటగా చియా గింజల విషయానికొస్తే, వీటిని డైరెక్టుగా కానీ లడ్డూలలో కానీ తినకూడదు. ముందుగా కాసేపు నీటిలో బాగా నానబెట్టాలి. అలా నానిన విత్తనాలను పెరుగులో కలిపి తీసుకోవడం చాలా మంచిది. చియా గింజల్లో పుష్కలంగా ఉండే ఫైబర్, ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు, కర్డ్‌లో ఉండే ప్రో బయోటిక్ ప్రయోజనాలు కూడా బాడీ లభించి జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి.

Chia Seeds

అలాగే అవిసె గింజలు (Flax seeds)ను డైరెక్టుగా తింటే జీర్ణం కాకుండా అలాగే బయటకు వచ్చేస్తాయి. వీటిని వేయించి లడ్డూలుగా, లేదంటే అన్నంలో కలుపుకొనే ఫ్లేక్స్ సీడ్స్ పౌడర్ తయారు చేసుకోవచ్చు. అలాగే అవిసె గింజలను పాన్‌పై దోరగా వేయించి, చల్లారాక వాటిని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడికి కొద్దిగా సోంపు కలిపి ఉంచుకోవాలి. ప్రతిరోజూ భోజనం చేసిన తర్వాత దీనిని నేచురల్ మౌత్ ఫ్రెష్‌నర్‌లా తీసుకోవడం వల్ల కడుపుబ్బరం తగ్గడమే కాకుండా గ్యాస్ సమస్యల నుంచి రిలీఫ్ లభిస్తుంది.

Flax Seeds

నువ్వులను నువ్వుల లడ్డూగా చేసుకుని తినొచ్చు. మెత్తటి పొడిగా చేసుకుని రొట్టెలు చేసుకునే గోధుమ పిండి, రాగి పిండిలో కలపాలి. ఈ కాంబినేషన్‌తో రొట్టెలు చేసుకుని తినడం వల్ల నువ్వులలో అలాగే రాగిలోని క్యాల్షియం కూడా కలిసి బాడీకి ఎముకల పుష్టిని ఇచ్చే కొండంత బలం లభిస్తుంది.

Sesame Seeds

గుమ్మడి గింజల (Pumpkin seeds)ను చాలామంది డైరెక్టుగా తినకూడదు. వీటిని నేరుగా తినడం కన్నా కొద్దిగా వేయించి డైలీ తీసుకోవాలి. అలాగే వీటిని తాజా పండ్ల ముక్కల (Fruit Salad)పై చల్లుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. దీని వల్ల శరీరానికి అవసరమైన మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తుంది.

Pumpkin seeds

అలాగే సబ్జా విత్తనాలను మలబద్ధకం లేదా జీర్ణ సమస్యలతో బాధపడేవారు కాసేపు నీళ్లలో నానబెట్టి తీసుకోవచ్చు. అలాగే వాటిని కొబ్బరి నీళ్లలో కలిపి తాగితే.. ఇది కడుపులోని వేడిని తగ్గించి, జీర్ణక్రియను స్పీడప్ చేసి మలబద్ధకం నుంచి వెంటనే రిలీఫ్ అందిస్తుంది.

Sabja Seeds

Appreciation : మనసులోని మెచ్చుకోలును దాచుకోకండి..ఎదుటివారిలో కాన్ఫిడెన్స్ నింపండి..

↑
Exit mobile version