Dining Manners : తరచూ రెస్టారెంట్‌, హోటల్స్‌కి వెళ్తుంటారా? అయితే ఈ 5 పనులు చేయకండి..

Dining Manners : హోటల్స్, రెస్టారెంట్స్ అనేవి ఎంతోమంది ఒకేచోట కలిసి ఆ వాతావరణాన్ని ఆస్వాదించే ఒక కామన్ స్పేస్ అని గుర్తుంచుకోవాలి.

Dining Manners

వీకెండ్ వచ్చినా, పార్టీకి వెళ్లాలనుకున్నా హోటల్‌కి వెళ్లి నచ్చిన ఐటెమ్‌ను ఆర్డర్ చేసుకుని తినడం చాలామందికి ఇష్టం. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో రెస్టారెంట్‌కి వెళ్లి తినేటపుడు.. అక్కడి వాతావరణం మన ఒక్కరితోనే ముడిపడి ఉండదనే నిజాన్ని కొంతమంది మర్చిపోయినట్లు ప్రవర్తిస్తారు.

నిజానికి హోటల్స్, రెస్టారెంట్స్ అనేవి ఎంతోమంది ఒకేచోట కలిసి ఆ వాతావరణాన్ని ఆస్వాదించే ఒక కామన్ స్పేస్. అయితే మనం రెస్టారెంట్‌లో తెలియక చేసే పనుల వల్ల పక్కన ఉన్నవాళ్లకు మూడ్ పాడవ్వడమే కాకుండా అక్కడి సిబ్బందికి కూడా ఇబ్బంది కలుగుతుంది. అందుకే ఇలాంటి వాటి దగ్గర తింటున్నప్పుడు కొన్ని బేసిక్ కనీస మర్యాదలు పాటించడం చాలా అవసరమన్న విషయాలను తెలుసుకోవాలి.

సిబ్బంది పట్ల ఎప్పుడూ కూడా దురుసుగా ప్రవర్తించకూడదు. ఆర్డర్ కాస్త ఆలస్యమైనా, మనం అనుకున్న ఫుడ్ రాకపోయినా కోపం రావడం కామనే. కానీ ఆ ఫ్రస్ట్రేషన్‌ని అక్కడ పనిచేసే సర్వర్లపై చూపించకూడదు. గట్టిగా అరవడం, అవమానకరంగా పిలవడం వంటివి వాళ్ల సెల్ఫ్ రెస్పెక్ట్‌ను దెబ్బతీస్తాయి. ఏదైనా ఇబ్బంది ఉంటే కూల్‌గా పిలిచి పరిస్థితిని వివరిస్తే మేనేజ్‌మెంట్ తప్పక రియాక్టవుతుంది. రోజంతా నిలబడి, తీవ్రమైన ఒత్తిడిలో పనిచేసే వెయిటర్స్ ప్లేస్‌లో మనల్ని మనం ఒక్కసారి ఊహించుకుంటే ఇలా ఎప్పుడూ ప్రవర్తించం.

కొంతమంది కాల్స్ వచ్చినపుడు, లేదంటే నచ్చిన రీల్స్, సాంగ్స్ స్పీకర్‌లో పెట్టి వింటారు. మనకు నచ్చినట్లుగా చేయడానికి అది మన ప్రైవేట్ ప్లేస్ కాదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. స్పీకర్ ఆన్ చేసి వీడియోలు ప్లే చేస్తే పక్క టేబుల్ వాళ్లకు మనం న్యూసెన్స్ క్రియేట్ చేసినట్లు అవుతుంది. ఒకవేళ కాల్ మాట్లాడాల్సి వస్తే బయటకు వెళ్లి మాట్లాడటం, ఇయర్ ఫోన్స్ వాడుకోవడం మేనర్స్(Dining Manners) అని తెలుసుకోవాలి.

అలాగే ఇంకొంతమంది తమ పిల్లలను పట్టించుకోకుండా వదిలేస్తుంటారు. పిల్లలతో రెస్టారెంట్‌కి రావడం ఎవరికైనా పెద్ద టాస్కే. అలా అని వాళ్లను వదిలేసి టేబుళ్ల మధ్య పరిగెత్తనివ్వడం చాలా డేంజర్. వేడి వేడి సూప్‌లు, గ్లాస్ ఐటమ్స్ పట్టుకుని వెళ్లే సర్వర్ల మధ్య పిల్లలు అటూ ఇటూ ఇలా తిరిగితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.

మరికొంతమంది పక్క టేబుల్ మీదుగా చేయి చాచి సాస్, ఉప్పు డబ్బాలు లాక్కుంటారు. మన టేబుల్ మీద లేకపోతే వెయిటర్‌ను పిలిచి తెప్పించుకోవాలి. కానీ పక్కన ఉన్న అపరిచితుల స్పేస్‌లోకి వెళ్లి లాక్కోవడం మంచి అలవాటు కాదు.

Dining Manners

హోటల్‌లో రష్ ఎక్కువ ఉన్నప్పుడు ఫుడ్ తినేసిన తర్వాత కూడా గంటల తరబడి అక్కడే కూర్చుని టేబుల్ ఖాళీ చేయకుండా కబుర్లు చెప్పుకుంటూ కూర్చోకూడదు . ఖాళీగా ఉన్నప్పుడు ఓకే కానీ, బయట క్యూ ఉండి జనాలు వెయిట్ చేస్తున్నప్పుడు కూడా ఇలా కూర్చోవడం బిజినెస్‌కు నష్టమే కాక, వెయిట్ చేసేవాళ్ల ఓపికకు పరీక్ష పెడుతుంది.

ఇలాంటి చిన్న చిన్న విషయాలు పాటించడం కష్టం కాదు. తోటి మనుషుల పట్ల మనం చూపించే ఈ కొద్దిపాటి గౌరవమే మన వ్యక్తిత్వాన్ని ఇంకాస్త పెంచుతుంది. మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్లకు కూడా ఒక హ్యాపీ డైనింగ్(Dining Manners) ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది.

Relief On Power Charges : కరెంట్ ఛార్జీలపై ఊరట..వినియోగదారుల ఖాతాల్లోకి ట్రూడౌన్ డబ్బులు..

↑
Exit mobile version