Araku Valley Hot Air Balloon
పచ్చటి ఎత్తయిన కొండలు, దట్టంగా అల్లుకున్న గుబురు లోయలు, దానికి తోడు పొద్దు పొద్దునే వణికించే చలిలో ఆప్యాయంగా పలకరించే తెల్లటి పొగమంచు.. వినడానికే ఎంతో ఆహ్లాదంగా ఉంది కదూ. అందుకే శీతాకాలం వచ్చిందంటే చాలు, ప్రకృతి ప్రేమికులు, టూరిస్టుల మనసంతా అరకు, పాడేరు వైపే గుంజుతుంది.
ముఖ్యంగా పాడేరులోని వంజంగి, అరకు వ్యాలీలోని మాడగడ కొండల మీదకు వెళ్తే.. మేఘాలన్నీ మన పాదాల కింద తేలుతున్నాయా అనేంత అద్భుతమైన భావన కలుగుతుంది. ఇలాంటి భూతల స్వర్గాన్ని ఇప్పటివరకు కేవలం నేల మీద నుంచో లేదా కొండ చివర నిలబడో లేదంటే సినిమాలలోనే చూసి ఆనందించాం.
కానీ, అవే ప్రకృతి అందాలను 300 మీటర్ల ఎత్తులో గాలిలో తేలుతూ మనమే చూస్తే ఆ అనుభూతి ఎలా ఉంటుంది? ఊహించుకుంటేనే ఎంతో ఎక్సయిటింగ్‌గా ఉంది కదూ. సరిగ్గా ఇలాంటి ఒక వర్ణించలేని థ్రిల్లింగ్ అనుభవాన్ని టూరిస్టులకు అందించడానికి పర్యాటక శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
అరకులోని ఫేమస్ అయిన పద్మాపురం గార్డెన్స్‌లో హాట్ ఎయిర్ బెలూన్(Araku Valley Hot Air Balloon) విహారాన్ని మళ్లీ గ్రాండ్‌గా అందుబాటులోకి తీసుకువచ్చారు. అరుకు జిల్లా కలెక్టర్ నిశాంతి ఈ సేవలను పునఃప్రారంభించి, మొదటగా తనే బెలూన్‌లో కాసేపు గాల్లో విహరించి ఆ అద్భుతమైన దృశ్యాలను వీక్షించారు.
ఈ బెలూన్ రైడ్(Araku Valley Hot Air Balloon) ద్వారా టూరిస్టులను సుమారు 300 మీటర్ల ఎత్తు వరకు తీసుకెళ్తారు. అక్కడ నుంచి చుట్టూ ఉన్న ఎత్తయిన కొండలు, దట్టమైన లోయల అందాలు కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంటే.. ఆ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధిస్తుంటే మరువలేని అనుభూతిని పంచుతుంది. వింటర్ సీజన్ మొదలైన ఈ సమయంలో ఈ ఎయిర్ బెలూన్ అడ్వెంచర్ అందుబాటులోకి రావడం టూరిస్టులకు లభించిన పెద్ద ఆఫర్ అనే చెప్పాలి.
అయితే గాల్లోకి వెళ్లడానికి ఏమాత్రం భయపడకుండా… అంతర్జాతీయ స్థాయి సేఫ్టీ స్టాండర్డ్స్ పాటిస్తూ, పాడేరు ఐటీడీఏ పూర్తి పార్ట్‌నర్‌షిప్‌తో ఈ రైడ్‌ను చాలా జాగ్రత్తగా డిజైన్ చేశారు. పర్యాటకులకు సరికొత్త ఫీల్‌తో పాటు పూర్తి రక్షణ కల్పించడమే మెయిన్ టార్గెట్‌గా ఈ రైడ్‌ను స్టార్ట్ చేశారు. అందుకే చల్లటి గాలులలో, మేఘాల అంచులలో తేలుతూ ప్రకృతిని ఆస్వాదించే ఈ మ్యాజికల్ రైడ్ ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఒక్కసారైనా ట్రై చేస్తే రోలర్ కోస్టర్ వంటి అనుభవం దక్కుతుంది.
Honey Trap : బోర్డర్ దాటుతున్న డిఫెన్స్ సీక్రెట్స్..రక్షణ దళాలు కూడా హనీట్రాప్ మాయలో ఎందుకు పడతాయి?
