Botsa Chaitanya : కలెక్టర్ చేతిలో బొత్స చైతన్య ఫ్యూచర్..జెడ్పీటీసీ రేసు నుంచి అవుట్?

Botsa Chaitanya : పూసపాటిరేగ జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ పరిశీలనలో వైసీపీ అభ్యర్థి బొత్స చైతన్య నామినేషన్ రిజెక్ట్ అయ్యింది. కలెక్టర్ నిర్ణయం అలాగే పొలిటికల్ అప్‌డేట్స్ ఇక్కడ చూడండి.

Botsa Chaitanya

ఎన్నికల బరిలో నిలబడినపుడు ప్రత్యర్థులపై పైఎత్తులు వేయడం ఎంత ఇంపార్టెంటో, సాంకేతిక లొసుగులను పట్టుకోవడం కూడా అంతే ముఖ్యమని విజయనగరం జెడ్పీటీసీ ఎన్నికల ప్రాసెస్ నిరూపించింది . పూసపాటిరేగ మండలం నుంచి వైసీపీ కేండిడేట్‌గా నామినేషన్ వేసిన బొత్స చైతన్య(Botsa Chaitanya)కు రిటర్నింగ్ ఆఫీసర్ ఊహించని షాక్ ఇచ్చారు. స్థానిక అర్హతలకు సంబంధించిన ఇంపార్టెంట్ రూల్‌ను ఉల్లంఘించారనే కారణంతో చైతన్య నామినేషన్‌ను రిజెక్ట్ చేస్తున్నట్లు ప్రకటించడం వైసీపీ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.

నామినేషన్ల పరిశీలన టైమ్‌లో జనసేన అభ్యర్థి కోట్ల రేవతి లేవనెత్తిన పాయింటే ఇక్కడ పొలిటికల్‌ గేమ్ ఛేంజర్‌గా మారింది. బొత్స చైతన్య(Botsa Chaitanya) స్థానికేతరుడని, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్‌లో ఓటర్ ఐడీ ఉన్న అతను.. రూరల్ జెడ్పీటీసీ స్థానానికి ఎలా అర్హుడవుతారంటూ రేవతి ప్రవేశపెట్టిన పక్కా ప్రూఫ్స్ ముందు వైసీపీ న్యాయవాదుల వాదనలు నిలబడలేకపోయాయి. నిబంధనల ప్రకారమే నామినేషన్ తిరస్కరిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేయడంతో విజయనగరం పొలిటికల్ సర్కిల్స్‌లో ఈ వార్త ఒక్కసారిగా హీట్‌ను పెంచింది.

ఈ అనుకోని నిర్ణయంతో అలర్ట్ అయిన వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ నేతృత్వంలో న్యాయవాదులు వెంటనే జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు. చైతన్య నామినేషన్ సక్రమమేనంటూ రిటర్నింగ్ అధికారి తీర్పుపై.. కలెక్టర్‌కు అప్పీల్ దాఖలు చేశారు. ఒకవేళ రిటర్నింగ్ అధికారి నిర్ణయాన్నే జిల్లా కలెక్టర్ కూడా సమర్థిస్తే మాత్రం పూసపాటిరేగ జెడ్పీటీసీ పోరులో వైసీపీ ప్రాతినిధ్యమే లేకుండా పోతుంది. దీంతో కలెక్టర్ ఇచ్చే ఆఖరి తీర్పుపైనే అందరి చూపు నెలకొంది.

Upasana Konidela : యాంకర్ సుమపై ఉపాసన ప్రశంసలు.. ఆ మహిళలకు ఉపాసన వార్నింగ్..

↑
Exit mobile version