CM Chandrababu Visakha Tour
సొంతిల్లు ఉండి కూడా, దానికి అసలైన యజమానిని తానే అని చెప్పుకోలేని ఒక మానసిక నరకాన్ని విశాఖలోని కొంతమంది నలభై ఏళ్లుగా అనుభవిస్తున్నారు. వారికి సొంత ఇల్లు ఉంటుంది కానీ అమ్ముకోవడానికి పనికి రాదు, పిల్లల భవిష్యత్తు కోసం దేనికైనా తాకట్టు పెడదామంటే రైట్ డాక్యుమెంట్స్ ఉండవు. ఇలాంటి సమస్యకు ఫుల్ స్టాప్ పెడుతూ, కూటమి ప్రభుత్వం వైజాగ్ చరిత్రలోనే ఛారిత్రక నిర్ణయాన్ని అమల్లోకి తీసుకువచ్చింది.
గవర్నమెంట్ స్థలాల్లో ఇళ్లు కట్టుకుని నలిగిపోతున్న వేలాది పేద, మధ్యతరగతి కుటుంబాల దశాబ్దాల నిరీక్షణకు తెర దించుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం రోజు అంటే సెప్టెంబర్ 19న డైరెక్టుగా విశాఖ(CM Chandrababu Visakha Tour) వేదికగా సంచలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు.
ఏకంగా 28,445 కుటుంబాలకు సంబంధించి, విశాఖ ల్యాండ్ మార్కెట్ విలువ ప్రకారం రూ.8,874 కోట్ల విలువైన భూములపై సర్వహక్కులను కల్పిస్తూ ప్రభుత్వం పూర్తి పట్టాలను అందించనుంది. విశాఖ నగర పరిధిలోని సుమారు 399 ఎకరాల విస్తీర్ణంలో నున్న 19,33,853 చదరపు గజాల విస్తీర్ణాన్ని పూర్తిస్థాయిలో రెగ్యులరైజ్ చేస్తూ అఫీషియల్‌గా డాక్యుమెంట్స్ ఇవ్వనున్నారు. వైజాగ్‌లో ఈ స్థాయిలో భూములను రెగ్యులైజ్ చేసి, ఒకేసారి ప్రజలకు హక్కులు కల్పించడం ఇదే తొలిసారి.
ఈ చారిత్రాత్మక ఘట్టంపై సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. సొంతిల్లు అనేది ప్రతీ కుటుంబానికి ఒక కల అని, ఆ కల నెరవేర్చడానికి తాను విశాఖ ((CM Chandrababu Visakha Tour) )వస్తున్నానని అన్నారు. ఇది కేవలం డాక్యుమెంట్ల పంపిణీ కాదని, 28 వేల కుటుంబాలకు ఒక భరోసా, వారి ఫ్యూచర్‌కు ఇస్తున్న భద్రత,అలాగే వారి పిల్లలకు ఇచ్చే వారసత్వ సంపదతో పాటు ఆత్మగౌరవంతో కూడిన కానుక అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. బాధితుల ముఖాల్లో ఆనందం చూడటమే కూటమి ప్రభుత్వానికి అసలైన సంతృప్తి అని సీఎం రాసుకొచ్చారు.
నిజానికి 2014-19 మధ్యలోనే ఈ సమస్య పరిష్కారానికి అప్పటి టీడీపీ ప్రభుత్వం కొన్ని జీఓలు తెచ్చినా..ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో ఈ ప్రాసెస్ మధ్యలోనే ఆగిపోయింది. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రజాప్రతినిధుల వినతులతో అభ్యంతరాలు లేని గవర్నమెంట్ స్థలాల్లోని ఇళ్లను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని సీఎం ఆదేశించారు.
దీనివల్ల గాజువాక నుంచి భీమిలి వరకు ప్రతీ ప్రాంతంలోని పేదలకు మేలు జరగబోతోంది. మండలాల వారీగా చూస్తే ఎక్కువగా విశాఖ రూరల్‌లో 9వేల261 కుటుంబాలు, గాజువాకలో 4,353 ఫ్యామిలీలు, ములగాడలో 4,213 కుటుంబాలు, గోపాలపట్నంలో 3,253 ఫ్యామిలీలు, పెందుర్తిలో 2,722 కుటుంబాలు, పెదగంట్యాడలో 1910 ఫ్యామిలీలు, మహారాణిపేటలో 1235 కుటుంబాలు, సీతమ్మధారలో 668 కుటుంబాలు, భీమిలిలో 464 కుటుంబాలు, ఆనందపురంలో 349 ఫ్యామిలీలు, పద్మనాభంలో 17 కుటుంబాలకు రిలీఫ్ దక్కనుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటన షెడ్యూల్ విషయానికొస్తే.. శనివారం ఉదయం 10.30 గంటలకు సీఎం విశాఖ చేరుకుంటారు. మొదట ఆర్‌కే బీచ్ వేదికగా జరిగే స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొని పారిశుద్ధ్య కార్మికులు, మత్స్యకారులతో మాట్లాడతారు.
ఆ తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో జరగబోయే భారీ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పట్టాలు పంపిణీ చేసి.. అమరావతికి తిరుగు పయనమవుతారు. మొత్తంగా దశాబ్దాల కన్నీళ్లకు ముగింపు పలికే ఈ శనివారం.. విశాఖ వాసుల జీవితాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయేలా సరికొత్త వెలుగులు నింపబోతోంది.
Hangry : ఆకలేస్తే కోపం వస్తోందా.. ఆకలి కోపానికి బ్రేక్ వేసే సింపుల్ సైకాలజీ ట్రిక్స్..
