Tomato Pickle : 6 నెలలు నిల్వ ఉండే టమాటో పచ్చడి..ఎండతో పనే లేకుండా పక్కా కొలతలతో రెసిపీ..

Tomato Pickle : 6 నెలల పాటు ఫ్రెష్‌గా ఉండే టమాటో నిల్వ పచ్చడిని ఇంట్లోనే పక్కా కొలతలతో చేసుకోవడం ఎలాగో ఇప్పుడు చూద్దాం.

Tomato Pickle

చాలామంది ఆవకాయ తర్వాత అంతగా ఇష్టపడేది టమాటా పచ్చడినే. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి తింటే ఆ రుచే వేరు అంటూ లాగించేస్తుంటారు. అలాంటి పచ్చడిని ఎండలో పెట్టే పని లేకుండా, ఎక్కువ సేపు కష్టపడే శ్రమే లేకుండా తయారు చేసుకుంటే చాలు 6 నెలల పాటు ఇంటిల్లిపాది తినొచ్చు. ఇలా ఫ్రెష్‌గా ఉండే టమాటో నిల్వ పచ్చడిని(Tomato Pickle) ఇంట్లోనే పక్కా కొలతలతో చేసుకోవడం ఎలాగో ఇప్పుడు చూద్దాం.

అర కిలో టమాటాలు తీసుకుంటే..దాని కోసం 50 గ్రాముల చింతపండు, 50 గ్రాముల సాల్ట్, 50 గ్రాముల కారం, ఒక టీస్పూన్ పసుపు, పావు కప్పు తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు, ఒక టీస్పూన్ మెంతిపిండి, రెండు టీస్పూన్ల ఆవపిండి కావాలి.

ముందుగా టమాటాలను వాటర్‌తో శుభ్రంగా కడిగి, పొడి క్లాత్‌తో ఏమాత్రం తడి లేకుండా తుడిచి గంట సేపు గాలికి ఆరబెట్టాలి. ఆ తర్వాత వాటిని ముక్కలుగా కోసి, ఒక కడాయిలో ఆయిల్ వేయకుండానే టమాటో ముక్కలు, చింతపండు వేసి మూతపెట్టి మెత్తగా మగ్గనివ్వాలి. నీరంతా ఆవిరయి గుజ్జులా మారిన తర్వాత దానిని పూర్తిగా చల్లారనివ్వాలి.

Tomato Pickle

చల్లారిన గుజ్జును మిక్సీ జార్‌లోకి తీసుకుని సాల్ట్, కారం, పసుపు, మెంతిపిండి, ఆవపిండి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో కాస్త ఆయిల్ ఎక్కువగానే వేసి,వెల్లుల్లి రెబ్బల్ని వేసి అవి వేగాక ఈ పచ్చడి మిశ్రమాన్ని సిమ్‌లో పెట్టి 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా వేయించాలి.

పచ్చడిలోని పచ్చిదనమంతా పోయి ఆయిల్ పైకి తేలే వరకు వేయించడమే ఈ రెసిపీలో అసలైన సీక్రెట్. నూనె తేలాక స్టవ్ ఆపేసి, పచ్చడి(Tomato Pickle) పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే గాలి చొరబడని గాజు సీసాలో దాచుకుంటే ఆరు నెలలైనా చెక్కు చెదరకుండా అదే రుచితో ఉంటుంది.

Hangry : ఆకలేస్తే కోపం వస్తోందా.. ఆకలి కోపానికి బ్రేక్ వేసే సింపుల్ సైకాలజీ ట్రిక్స్..

Exit mobile version