International Coffee Day : చంద్రబాబు, పవన్ మురిసిపోయే అరకు కాఫీ సీక్రెట్ ఇదే.. కొండ లోయల నుంచి గ్లోబల్ కప్పుల వరకు అద్భుత జర్నీ..

International Coffee Day : ఎలాంటి కెమికల్స్ కూడా వాడకుండా సంప్రదాయ పద్ధతిలో, ఆర్గానిక్‌గా గిరిజన కుటుంబాలు పండించడమే ఈ కాఫీకి అంతర్జాతీయంగా అంత డిమాండ్ తేవడానికి అసలు కారణం.

International Coffee Day

ఉదయం లేవగానే వేడివేడి కాఫీ కప్పు గొంతులో పడితే ఆ కిక్కే వేరు అంటారు కాఫీ లవర్స్. అయితే, ఎంతోమందికి ఏదొక కాఫీతో రోజు షురూ అయితే.. మన ఏపీ సీఎం చంద్రబాబు దినచర్య మాత్రం ఘుమఘుమలాడే అరకు కాఫీతో స్టార్టవుతుంది.

అంతర్జాతీయ కాఫీ దినోత్సవం సందర్భంగా ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మన ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న గొప్ప వారసత్వానికి, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజన సోదరుల శ్రమకు అరకు కాఫీ ఓ సజీవ సాక్ష్యమని బాబు కొనియాడారు. పచ్చటి గిరిజన కొండల్లో మొదలైన ఈ కాఫీ ప్రయాణం, ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా ఉన్న కాఫీ లవర్స్ కప్పుల్లోకి చేరడం నిజంగా మనందరికీ గర్వకారణమని అన్నారు.

మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అరకు కాఫీ విశిష్టతపై సోషల్ మీడియాలో ఎమోషనల్ కామెంట్స్ చేశారు. అరకు కాఫీలోని ప్రతీ కప్పు తూర్పు కనుమల కమ్మని సువాసనని, మట్టి సారాన్ని, గిరిజన రైతుల చెమటను తనలో ఇముడ్చుకుందని కొనియాడారు. ఈ కాఫీని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరిస్తూనే, మరోవైపు తూర్పు కనుమలను, అక్కడ కాఫీని పండించే గిరిజన రైతుల సంక్షేమాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

International Coffee Day

ఇక అరకు కాఫీ బ్యాక్‌‌గ్రౌండ్ అండ్ సక్సెస్ కథ విషయానికొస్తే.. అసలు కాఫీ ఉత్పత్తి చేసే దేశంలోని 12 మెయిన్ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో సముద్ర మట్టానికి ఏకంగా 3,600 అడుగుల ఎత్తులో దాదాపు లక్షన్నర ఎకరాల్లో అత్యంత స్వచ్ఛమైన, నాణ్యమైన కాఫీ తోటలు సాగవుతున్నాయి.

ఎలాంటి కెమికల్స్ కూడా వాడకుండా సంప్రదాయ పద్ధతిలో, ఆర్గానిక్‌గా గిరిజన కుటుంబాలు పండించడమే ఈ కాఫీకి అంతర్జాతీయంగా అంత డిమాండ్ తేవడానికి అసలు కారణంగా చెబుతారు. ఈ కాఫీ గింజలను ప్రైవేట్ వ్యాపారులతో పాటు గిరిజన సహకార సంస్థ (GCC) సేకరించి, ఇ-వేలం ద్వారా, అలాగే అరకువ్యాలీ కాఫీ పేరుతో మార్కెటింగ్ చేస్తోంది.

IMD Report : ఈశాన్య రుతుపవనాలపై ఐఎండీ రిపోర్ట్.. అక్టోబర్ – డిసెంబర్ వరకు పొడి వాతావరణమేనట..

↑
Exit mobile version