Live AP Municipal Elections Results
ఓట్ల లెక్కింపు(Live AP Municipal Elections Results )మొదలైన కాసేపటికే తొలి ఫలితం వెలువడి టీడీపీ ఎకౌంట్ తెరిచింది. కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని 39వ వార్డు ఓట్ల కౌంటింగ్ పూర్తి కాగా, అక్కడ టీడీపీ విజయదుందుభి మోగించింది.
03 Nov 2026 12:35 PM
చిలకలూరిపేటలో కౌంటింగ్ కొనసాగుతుండగా.. 181 ఓట్ల మెజార్టీతో 4వ వార్డు టీడీపీ అభ్యర్థి బెజ్జం రవి విజయం సాధించారు. 16వ వార్డులో లీడ్‌లో జనసేన కొనసాగుతుండగా.. ఎమ్మిగనూరులో 31 వార్డులో 852 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి మురహరి పద్మావతి గెలిచారు.
03 Nov 2026 12:25 PM
తెనాలిలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపులో..11 వార్డుల్లో కూటమి అభ్యర్థులు గెలిచారు. 6 వార్డును టీడీపీ అభ్యర్థులు
5 వార్డులో జనసేన అభ్యర్థులు విజయం సాధించారు.
03 Nov 2026 12:11 PM
అంబేద్కర్ జిల్లా: కోనసీమలో బీజేపీ బోణి కొట్టింది.రామచంద్రపురం ఏడో వార్డులో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు.
12 వార్డులకు ఓట్ల లెక్కింపు పూర్తవగా.. చెరో ఐదు వార్డుల్లో టీడీపీ, జనసేన విజయం సాధించగా..చెరో ఒక వార్డును బీజేపీ, వైసీపీ కైవసం చేసుకున్నాయి.
03 Nov 2026 12:09 PM
ఎన్టీఆర్ జిల్లా: జగ్గయ్యపేటలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో మున్సిపాలిటీల్లో మొత్తం 36 వార్డులు ఉండగా 12 ఏకగ్రీవం అవగా.. 24 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు 12 వార్డుల్లో కౌంటింగ్ పూర్తికాగా 7 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. మూడు వార్డుల్లో జనసేన విజయం సాధించింది. చెరో వార్డును వైసీపీ, బీజేపీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు.
03 Nov 2026 12:01 PM
డోన్ మున్సిపాలిటీలో చేరో 5 వార్డుల్లో టీడీపీ, వైసీపీ విజయం సాధించాయి. డోన్ మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా ఇప్పటికే ఐదు వార్డులో టీడీపీ అభ్యర్థుల విజయం సాధించగా.. మరో ఐదు వార్డులను వైసీపీ కైవసం చేసుకుంది. 1, 2, 4, 5, 6 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు గెలవగా..3, 7, 8, 9 వార్డుల్లో వైసీపీ నెగ్గింది.
03 Nov 2026 11:55 AM
కాకినాడ: తుని మున్సిపాలిటీలో హోరాహోరీ పోరు జరుగుతోంది. తుని మున్సిపాలిటీలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపులో..ఐదు వార్డుల్లో వైసీపీ అభ్యర్థుల విజయం సాధించగా..4 వార్డుల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపొందారు.
మరో వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.
03 Nov 2026 11:52 AM
పెనుకొండ మున్సిపాలిటీలో కూటమి హవా కొనసాగుతోంది. పెనుకొండ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. 23 వార్డులకు 21 స్థానాలు టీడీపీ కైవసం చేసుకోగా..చెరో స్థానంలో బీజేపీ, జనసేన విజయం సాధించాయి.
03 Nov 2026 11:39 AM
Punganur Municipality: పుంగనూరు మున్సిపాలిటీ టీడీపీ కైవసం చేసుకుంది. 30 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. జనసేన-2, బీజేపీ-2, సీపీఐ-1, ఇతరులు-1.. 36 వార్డుల్లో 32 ఏకగ్రీవం కాగా.. 4 వార్డులకు పోలింగ్ జరిగింది.
03 Nov 2026 11:37 AM
కుప్పం కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం జరగగా..అక్రమాలకు పాల్పడుతున్నారని వైసీపీ నేతల ఆరోపించారు. కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు పంపారంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
03 Nov 2026 11:36 AM
మచిలీపట్నం మేయర్ పోరులో టీడీపీ అభ్యర్థి లీడ్‌లో ఉన్నారు. మచిలీపట్నం మేయర్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో పోస్టల్ బ్యాలెట్‌లలో ఓట్ల లెక్కింపులో టీడీపీ లీడ్‌లో ఉన్నారు. పోలైన మొత్తం 334 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కాగా254 ఓట్ల ఆధిక్యంతో లీడ్‌లో టీడీపీ ఉంది.
YCP – 68; INC – 2, NOTA- 4, OTH: 06
03 Nov 2026 11:32 AM
Nagari Municipality: నగరిలో మున్సిపాలిటీలో టీడీపీ ముందంజలో ఉంది. చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపులో మూడు వార్డుల్లో టీడీపీ విజయాన్ని సాధించింది. 1, 16, 17, వార్డులను టీడీపీ కైవసం చేసుకుంది. 8వ వార్డులో జనసేన అభ్యర్థి విజయం సాధించగా.. కుప్పం 11వ వార్డులో 531 ఓట్ల మెజార్టీతో టీడీపీ కేండిడేట్ కళ మురుగేష్ విజయం సాధించారు.
నవంబర్ 2026, 11:29 AM
ఉమ్మడి కర్నూలు జిల్లాలో పురపోరు లెక్కింపు
ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు అత్యంత వేగంగా సాగుతోంది. ఆత్మకూరు మున్సిపాలిటీలో 4 వార్డుల కౌంటింగ్ పూర్తికాగా టీడీపీ, వైసీపీ, సీపీఎం చెరో స్థానంలో విజయం సాధించాయి. మిగిలిన ఒక వార్డును ఇండిపెండెంట్ అభ్యర్థి దక్కించుకున్నారు. డోన్ మున్సిపాలిటీలో 9 వార్డుల రిజల్ట్ తేలగా టీడీపీ 5 చోట్ల, వైసీపీ 4 స్థానాల్లో గెలుపొందాయి. నందికొట్కూరులో వైసీపీ రెండు వార్డులను సొంతం చేసుకుంది.
03 నవంబర్ 2026, 11:18 AM
నిడదవోలులో హోరాహోరీ టైట్ ఫైట్..
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీలో ఫలితాల పోరు అత్యంత ఆసక్తికరంగా మారింది. ఇక్కడ టీడీపీ, వైసీపీ అభ్యర్థులు చెరో నాలుగు వార్డులు గెలుచుకుని ఈక్విల్‌గా నిలిచారు. టీడీపీ 2, 4, 5, 6 వార్డులను దక్కించుకోగా.. వైసీపీ 3, 7, 8, 9 వార్డులను తన ఖాతాలో వేసుకుంది.
03 నవంబర్ 2026, 11:14 AM
ప్రకాశం, బాపట్లలో కౌంటింగ్‌పై ఉత్కంఠ
వర్షాల తీవ్రత దృష్ట్యా ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో కౌంటింగ్ ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా సమీక్షిస్తోంది. వాతావరణ పరిస్థితులను మరో గంట పాటు గమనించి నిర్ణయాన్ని తీసుకోనున్నారు. ఒకవేళ వర్షం తగ్గకపోతే లెక్కింపును రేపటికి వాయిదా వేసే యోచనలో అధికారులు ఉన్నారు.
03 నవంబర్ 2026, 11:13 AM
పిఠాపురంలో జనసేన జెండా
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురం మున్సిపాలిటీలో జనసేన గాలి జోరుగా వీస్తోంది. ఇక్కడ 3, 5, 6, 7 వార్డులలో జనసేన అభ్యర్థులు బొజ్జ వెంకటేశ్వరరావు, కొత్తపల్లి పద్మ, శిరీష, కారణం రుద్రయ్య ఘనవిజయం సాధించారు. 2వ వార్డును టీడీపీ కైవసం చేసుకోగా.. 1, 8, 9 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.
03 నవంబర్ 2026, 10:59 AM
మైదుకూరులో ముందంజలో కూటమి..
కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపులో కూటమి కేండిడేట్స్ జోరు చూపిస్తున్నారు. 10, 12 వార్డుల్లో టీడీపీ జయభేరి మోగించగా.. 21వ వార్డులో బీజేపీ విజయం సాధించింది. 23వ వార్డును ఇండిపెండెంట్ అభ్యర్థి దక్కించుకున్నారు.
03 నవంబర్ 2026, 10:57 AM
బొబ్బిలి తొలి వార్డులో టీడీపీ లీడ్..
విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీ మొదటి వార్డు ఓట్ల లెక్కింపులో టీడీపీ కేండిడేట్ కర్రి ఈశ్వరరావు 312 ఓట్ల స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
03 నవంబర్ 2026, 10:54 AM
గుంటూరు కార్పొరేషన్‌లో తెలుగుదేశం హవా..
గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలోని 76 వార్డులకు గానూ లెక్కింపు శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం 9 వార్డుల్లో టీడీపీ, 2 వార్డుల్లో జనసేన, మరో 2 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.
03 నవంబర్ 2026, 10:46 AM
పుట్టపర్తిలో తమ్ముళ్ల ఏకపక్ష విజయం
శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీలో టీడీపీ రికార్డ్ విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే 12 వార్డులను టీడీపీ, 1 వార్డును జనసేన గెలుచుకోగా.. మరో 15 వార్డుల్లో పసుపు జెండా స్పష్టమైన ముందంజలో ఉంది.
Liver : లివర్ డ్యామేజ్ అయ్యే ముందు బాడీ ఇచ్చే సైలెంట్ వార్నింగ్స్ .. అస్సలు నిర్లక్ష్యం చేయకండి..
