Vangaveeti Radha
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల హిస్టరీలోనే అత్యంత ఘనమైన, భావోద్వేగపూరితమైన ఘట్టం విజయవాడలో ఈరోజు కనిపించింది. అన్ని వర్గాలలో ఉత్కంఠ రేపిన విజయవాడ మేయర్ పీఠాన్ని జనసేన అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ కైవసం చేసుకుని ఘన విజయాన్ని నమోదు చేశారు. ఈరోజే వంగవీటి రాధా పుట్టినరోజు నాడే ఈ విక్టరీ అతని అకౌంట్లో యాడ్ అవడంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. బెజవాడ గడ్డ తన ప్రియతమ నేత రంగా తనయుడిపై ఉన్న అపారమైన అభిమానాన్ని ఓట్ల రూపంలో కురిపించి..రాధా రాజకీయ జీవితంలో ఎప్పటికీ చెరిగిపోని బర్త్‌డే గిఫ్ట్‌ను అందించింది.
ఈ ఎన్నికల్లో విజయవాడ కార్పొరేషన్ పీఠం కోసం ముక్కోణపు పోరు నెలకొన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్-వామపక్షాల కూటమి తరఫున మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, వైసీపీ నుంచి మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి బలమైన పోటీ ఇవ్వడానికి ప్రయత్నించారు.
ఏబీవీ గట్టి పోటీ ఇచ్చినా కూడా ఓట్ల లెక్కింపు ప్రారంభమైన మొదటి రౌండ్ నుంచి రాధా(Vangaveeti Radha) సాధించిన ఆధిక్యం చివరి వరకు కంటిన్యూ అయింది. ఏబీ వెంకటేశ్వరరావు రెండో స్థానంతో సరిపెట్టుకోగా, వైసీపీ అభ్యర్థి మూడో స్థానానికి పడిపోయారు. ప్రత్యర్థులు వేసిన ఏ పొలిటికల్ వ్యూహం కూడా రాధా జనాకర్షణ ముందు నిలవలేకపోయింది.
తండ్రి వంగవీటి మోహన రంగా వారసత్వాన్ని, రంగా ఆశయాలను గుండెల్లో మోస్తున్న రాధాకృష్ణకు(Vangaveeti Radha) విజయవాడ ప్రజలు అందించిన ఈ పట్టాభిషేకం బెజవాడ పాలిటిక్స్‌లో ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. పుట్టినరోజు నాడే విజయవాడ మేయర్ పీఠం దక్కించుకోవడంతో నగరవ్యాప్తంగా పండుగ వాతావరణం కనిపిస్తోంది. కూటమి నాయకులు, కార్యకర్తలు, వంగవీటి అభిమానులు కేకులు కట్ చేస్తూ, బాణసంచా కాలుస్తూ బెజవాడ వీధులను హోరెత్తిస్తున్నారు.
Dhanteras : ధనత్రయోదశి రోజు బంగారమే కొనక్కరలేదు..చీపురు, ఉప్పు, ధనియాలు కొన్నా సరిపోతుందట
