Milad Un Nabi Holiday
స్కూల్ పిల్లల నుంచి గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేసే ఎంప్లాయ్స్ వరకు ప్రతి ఒక్కరూ కూడా..ఈ నెలలోనో, ఈ వారంలోనో పబ్లిక్ హాలీడే ఏమైనా ఉందా అంటూ క్యాలెండర్ వైపు ఆశగా చూస్తుంటారు. అయితే అలా త్వరలోనే రాబోతున్న ఒక ముఖ్యమైన సెలవు షెడ్యూల్‌లో ..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊహించని విధంగా తాజాగా సవరణ చేసింది.
ముందుగా అనుకున్న తేదీ ప్రకారం కాకుండా.. ఆ హాలిడే డేట్‌ను మార్చుతూ స్టేట్ గవర్నమెంట్ సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. శ్రావణ మాసం ముగిసే సమయంలో ఎప్పుడూ వచ్చే మిలాద్ ఉన్ నబీ పండగ సందర్భంగా..ఈ ఏడాది కూడా ప్రభుత్వం పబ్లిక్ హాలిడేగా డిక్లేర్ చేసింది.
అయితే, పాత అకడమిక్ క్యాలెండర్ ,గవర్నమెంట్ క్యాలెండర్ జాబితా ప్రకారం.. ఈ సెలవును ఆగస్టు 25న ఇస్తున్నట్లు ఉంది. కానీ ముస్లిం మత పెద్దల నుంచి వచ్చిన ప్రత్యేక విజ్ఞప్తితో అలాగే నూతన చంద్రుని దర్శనం టైమింగ్స్‌ను పరిగణనలోకి తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఆగస్టు 25న ఉండాల్సిన హాలిడేను ఆగస్టు 26కి (బుధవారం) మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సవరించిన జీఓను రిలీజ్ చేశారు.
దీంతో ఆగస్టు 25న మామూలుగానే స్కూల్స్, కాలేజీలు, ఆఫీస్‌లు అన్నీ కూడా ఎప్పటిలాగే పనిచేస్తాయి. దానికి బదులుగా ఆగస్టు 26, బుధవారం రోజు మిలాద్ ఉన్ నబీ పబ్లిక్ హాలిడే(Milad Un Nabi Holiday )అమలులో ఉంటుంది.
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటికే మిలాద్ ఉన్ నబీ సెలవును ఆగస్టు 26వ తేదీకే ఫైనలైజ్ చేయడంతో.. ఈసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక్కటే తేదీన ఈ పండగ సెలవు అమల్లోకి రాబోతోంది.
Gold And Silver : శ్రావణ మాసంలో పసిడి మంటలు.. పెరిగిన బంగారం, వెండి ధరలు.
