Tirumala Vaikunta Dwara Darshanam
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శుభవార్త అందించింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఈ ఏడాది డిసెంబర్ 20 వ తేదీ నుంచి 29వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు(Tirumala Vaikunta Dwara Darshanam) కల్పించనున్నట్లు ప్రకటించింది. ఈ 10 రోజుల్లో మొత్తం 8.34 లక్షల మంది భక్తులకు స్వామివారి దర్శనం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సామాన్య భక్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మొత్తం దర్శన సమయాల్లో 92 శాతం వారికే కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది.
తిరుమలలోని అన్నమయ్య భవనంలో తిరుమల తిరుపతి దేవస్థానం సాధికారిక మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించిన ఛైర్మన్ ముద్దాడ రవిచంద్ర.. గత ఏడాది వైకుంఠ ద్వార దర్శనాల(Tirumala Vaikunta Dwara Darshanam) సమయంలో 7.83 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, ఈసారి ఆ సంఖ్యను మరింత పెంచి 8.34 లక్షలకు చేర్చాలని నిర్ణయించారు.
మొదటి 2 రోజులు ప్రత్యేక ఏర్పాట్లు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.ఈ రెండు రోజులకు సంబంధించి స్లాటెడ్ సర్వదర్శనం (SSD) టోకెన్లను ఆన్లైన్లో రిలీజ్ చేయనున్నారు. మొదటి రెండు రోజులు టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాన్ని కల్పిస్తారు. ఈ రోజుల్లో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం ఉండదని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.
మిగిలిన 8 రోజుల పాటు భక్తులకు సర్వదర్శనం కల్పించనున్నారు. దీని ద్వారా సామాన్య భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. శ్రీవారి దర్శనాల సమయంలో రద్దీని నియంత్రించడానికి క్యూలైన్లు, భద్రత, తాగునీరు, ఇతర సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.
భక్తుల కోసం రూ.2,750 కోట్లతో యాత్రికుల టౌన్షిప్ తిరుపతిలోని అలిపిరి ఎస్వీ జూ పార్క్ రోడ్డు దగ్గరలో రూ.2,750 కోట్లతో యాత్రికుల టౌన్షిప్ నిర్మించడానికి టీటీడీ అధికారులు నిర్ణయించారు.
దీనికి సంబంధించిన డీపీఆర్, డిజైన్లు, నిర్మాణ పర్యవేక్షణ కోసం కన్సల్టెన్సీ సంస్థను సెలెక్ట్ చేయనున్నారు. అలాగే శ్రీవారిమెట్టు మార్గంలో రహదారి అభివృద్ధికి రూ.9.50 కోట్లను కేటాయించారు.
ఉద్యోగులు, వైద్య సేవలకు ఇంపార్టెన్స్ ఇస్తూ టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ కానుకగా శాశ్వత ఉద్యోగులకు రూ.16,940, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు రూ.8,289 చొప్పున అందించాలని నిర్ణయించారు. స్విమ్స్ ఆసుపత్రిలో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి రూ.41.23 కోట్ల ప్రత్యేక గ్రాంటును మంజూరు చేశారు.
ఎస్వీ ఆయుర్వేద కాలేజీలు బీఏఎంఎస్ సీట్లను 40 నుంచి 60కి పెంచడానికి ఆమోదం తెలిపారు. అలాగే 229 మంది విద్యార్థులకు వసతి కల్పించేలా రూ.23 కోట్లతో కొత్త హాస్టల్ నిర్మించబోతున్నారు.తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంరక్షణ, భక్తుల భద్రత కోసం అటవీ శాఖకు రూ.16.40 కోట్ల ఆర్థిక సహాయం అందించనున్నారు.
మొత్తంగా వైకుంఠ ద్వార దర్శనాల(Tirumala Vaikunta Dwara Darshanam) నిర్వహణతో పాటు భక్తుల సౌకర్యాలు, తిరుమల అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమానికి టీటీడీ అధికారులు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
After Retirement : 60 ఏళ్లు దాటినా ఆగని జోష్.. ఉద్యోగానికే రిటైర్మెంట్, అనుభవానికేం కాదు..
