Gold Price
గోల్డ్ లవర్స్‌కు వరుస గుడ్‌న్యూస్‌లు అందుతున్నాయి. కొద్ది రోజులుగా దిగి వస్తున్న పసిడి ధరలు, ఈ వారం ప్రారంభంలో నవంబర్ 23 సోమవారం రోజు కూడా అదే బాటలో నడిచాయి. మార్కెట్ ఓపెన్ అవ్వగానే పుత్తడి రేట్లు గణనీయంగా పడిపోయాయి.
గ్లోబల్ మార్కెట్లలో అమెరికా డాలర్ బలంగా పుంజుకోవడం దీనికి మెయిన్ రీజన్ కాగా, డిసెంబర్లో జరగబోయే సమీక్షా సమావేశంలో యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను మరింతగా పెంచొచ్చనే న్యూస్ గోల్డ్ మార్కెట్‌ను బాగా దెబ్బతీసింది. ఫెడ్ రేట్లు పెరిగితే పసిడి ధరలు మరింత క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంటుందని ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. గోల్డ్‌తో పాటు సిల్వర్ కూడా భారీగానే ధర తగ్గించుకుంది.
ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాలలో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ కాస్ట్(Gold Price) రూ.1లక్ష25వేల70 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల జ్యువెలరీ కాస్ట్ రూ.1లక్ష14వేల640 వద్ద లభిస్తోంది.
బెంగళూరు, చెన్నై సిటీలలో కూడా 24 క్యారెట్ల బంగారం ధర(Gold Price) రూ.1లక్ష25వేల70 వద్ద ట్రేడవుతుండగా, 22 క్యారెట్ల రేటు రూ.1లక్ష14వేల640 గా ఉంది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1లక్ష25వేల220 వరకూ పలుకుతుండగా, 22 క్యారెట్ల రేటు రూ.1లక్ష14వేల790 వద్ద అందుబాటులో ఉంది.
బంగారంతో పాటు సిల్వర్ కూడా దిగి వచ్చింది. హైదరాబాద్‌లో ఆదివారం కేజీ సిల్వర్ కాస్ట్ రూ.1లక్ష75వేలు ఉండగా, సోమవారానికి రూ.1లక్ష74వేల900కి చేరింది. ఇక చెన్నై, ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.1.75 లక్షల వద్ద మార్కెట్లో ట్రేడవుతోంది. బంగారం కొనాలనుకునే వారికి ఇది మంచి టైమ్‌గా అనుకుంటున్నా కూడా డిసెంబర్ నాటికి మరింతగా రేట్లు తగ్గే అవకాశం ఉందన్న అంచనాలు కొనుగోలుదారులను బంగారం కొనాలా వద్దా అనే డైలమాలో పడేస్తున్నాయి.
Lava Smart 4 Pro : పవర్ ఫుల్ బ్యాటరీ, ఐఫోన్ లుక్..రూ.10,999 కే అదిరిపోయే ఫీచర్లు..
