Pawan Kalyan Divorce : రాజకీయాల్లో కొత్త మెచ్యూరిటీ.. పవన్ విడాకుల అంశంపై వైరి వర్గాలు కూడా సైలెంట్ ..

Pawan Kalyan Divorce : పవన్ కళ్యాణ్ విడాకుల ప్రకటనపై రాజకీయ పార్టీల స్పందన అందరినీ ఆలోచనలో పడేసింది. రాజకీయాల్లో వస్తున్న ఈ కొత్త మెచ్యూరిటీపై సామాన్యులు కూడా ఆశ్చర్యపోతున్నారు.

Pawan Kalyan Divorce

ఇండియన్ పాలిటిక్స్‌లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నాయకుల పర్సనల్ జీవితాలు ఎన్నికల సమయంలో ప్రధాన చర్చనీయాంశంగా మారడం చాలా సాధారణం. గత ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం, ఆయన మూడు వివాహాల చుట్టూ వైసీపీ నేతలు ఎలాంటి రాజకీయ రచ్చ చేశారో అందరికీ తెలిసిందే.

పవన్‌ను ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతో పీకే పర్సనల్ విషయాలనే ప్రధాన అస్త్రంగా మలుచుకున్న పార్టీలకు, ఆ వ్యూహం ఏ రేంజ్‌లో డ్యామేజ్ చేసిందో, ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకతను తీసుకు వచ్చిందో గత ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి.

అలా వ్యక్తిగత అంశాలను రాజకీయం చేయడం ఓ స్థాయిలో బెడిసికొట్టడంతో పవన్ వ్యతరేక పార్టీలకు గట్టి పాఠమే లభినయించినట్లయింది. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన సతీమణితో విడిపోతున్నట్లు(Pawan Kalyan Divorce) ప్రకటించినా, ఏ ఒక్క నేత కూడా ఆ విషయాన్ని అడ్డంపెట్టుకుని పవన్‌పై విమర్శలు గుప్పించే సాహసం చేయలేదు.

ఈసారి టీవీ ఛానెళ్లలో బడా నేతలతో పెద్ద పెద్ద డిబేట్లు, సోషల్ మీడియాలో రంజురంజుగా ట్రోల్స్ నడుస్తాయని అందరూ ఊహించారు. కానీ అందుకు విరుద్ధంగా పొలిటికల్ సినారియో ఎంతో ప్రశాంతంగా, సైలెంట్‌గా ఉండిపోయింది. దీని కోసం ఇప్పటికే టీడీపీ, వైసీపీ వంటి ప్రధాన పార్టీలు తమ సోషల్ మీడియా విభాగాలు, కేడర్‌కు ముందుగానే కఠినమైన హెచ్చరికలు జారీ చేశాయి.

ఈ పరిణామాన్ని గమనించిన టీడీపీ సోషల్ మీడియా విభాగమైన ఐటీడీపీతో పాటు వైసీపీ కూడా వెంటనే అప్రమత్తమై తమ కేడర్‌కు, సోషల్ మీడియా కార్యకర్తలకు స్ట్రిక్ట్ ఆదేశాలు జారీ చేశాయి. లీడర్స్ వ్యక్తిగత జీవితాలు, వివాహ సంబంధాలపై సోషల్ మీడియాలో ఎలాంటి అనుచిత కామెంట్లు చేయొద్దని, నెగిటివ్ పోస్టులు పెట్టడం గానీ, ఇతరులు చేసే వ్యక్తిగత విమర్శలను ప్రచారం చేయడం గానీ చేయొద్దని రెండు పార్టీలు స్పష్టం చేశాయి. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించి ఎవరైనా పర్సనల్ విషయాలపై పోస్టులు పెడితే ఆ వ్యక్తుల చర్యలకు పార్టీలు బాధ్యత వహించవని, కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించాయి

ఎన్నికల సమయంలో ఎదురైన చేదు అనుభవాల నుంచి నేర్చుకున్న గుణపాఠమో, లేక రాజకీయాలకు అతీతంగా పర్సనల్ ప్రైవసీని గౌరవించాలనే పరిణతి సాధించడమో తెలీదు కానీ, ఈ ముందుచూపు మాత్రం అభినందనీయమనే అనాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పొలిటికల్ విమర్శలు, సిద్ధాంతాల పరమైన పోరాటాలు ఉండాలి తప్ప, ఒకరి పర్సనల్ లైఫ్‌లను రాజకీయ కక్ష సాధింపులకు వేదికగా మార్చుకోకూడదనే క్లారిటీ ఇప్పుడు అందరిలోనూ కనిపిస్తోంది. పెద్ద ప్లాట్‌ఫామ్‌లు, డిబేట్లు పెట్టాల్సిన చోట లీడర్లు ఇలా సంయమనం పాటించడం, సైలెంట్‌గా ఉండటం నిజంగానే ఆరోగ్యకరమైన రాజకీయ పరిణామంగా విశ్లేషకులు చెబుతున్నారు.

ఎలాంటి రాజకీయ నాయకుడైనా, సాధారణ వ్యక్తి అయినా ఎవరి పర్సనల్ స్పేస్ వారికి ఉంటుందని అంతా గుర్తించి, ఆ ప్రైవసీని గౌరవించడం ఈరోజు కనిపిస్తూ..నేటి రాజకీయాల్లో ఒక కొత్త సంస్కృతికి తెరలేపినట్లు అయింది. మొత్తానికి పవన్ విడాకుల(Pawan Kalyan Divorce) వ్యవహారంలో రాజకీయ పార్టీలు ప్రదర్శించిన ఈ మెచ్యూరిటీతో కూడిన సంయమనం అందరి ప్రశంసలను అందుకుంటోంది.


Nvidia CEO Jensen Huang : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కింగ్‌కు మరో బిగ్ షాక్.. ఎన్వీడియా సీఈఓ చుట్టూ వివాదాల ఉచ్చు..

↑
Exit mobile version