Nvidia CEO Jensen Huang
టెక్ ప్రపంచాన్ని తన చిప్ పవర్‌తో కొన్నాళ్లుగా శాసిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామ్రాజ్యపు రాజు.. ఎన్వీడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్(Nvidia CEO Jensen Huang) కొద్దిరోజులుగా కెరీర్‌లోనే అత్యంత పెద్ద తుపాన్‌ను ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు ఎక్కడ చూసినా టెక్నాలజీ అచీవ్‌మెంట్స్ కోసం వినిపించిన జెన్సెన్ హువాంగ్..ఇప్పుడు ఒక భారీ పర్సనల్ స్కాండల్, గూఢచార ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఈ మొత్తం వివాదానికి చైనా బిజినెస్ ఉమెన్ అలిస్ హువాంగ్‌తో జెన్సెన్ హువాంగ్‌కు ఉన్న క్లోజ్ రిలేషన్‌షిప్ అంటూ గుప్పుమని బయటికి వచ్చిన నివేదికలే అసలు రీజన్. అంతేకాదు అమెరికా నిఘా వర్గాలు ఈ అలిస్ హువాంగ్‌ను చైనాకి చెందిన గూఢచారిగా అనుమానిస్తున్నాయి.
ఒక టెక్ జెయింట్‌గా ఉన్న ఎన్వీడియా బాస్‌కు ఇలాంటి దేశ భద్రతను తాకే సెన్సిటివ్ ఇష్యూతో లింక్ పడటంతో ఒక్కసారిగా ప్రపంచం మొత్తం చూపు అతనిపైనే పడింది. ఈ పరిణామంతో ఎన్వీడియా బోర్డు వెంటనే అలర్ట్ అయ్యి, ఆయన వ్యక్తిగత సంబంధాలపై ఇండిపెండెంట్ ఎంక్వైరీకి ఆదేశించింది.
కాగా ఈ ప్రకటన ఇలా బయటికి వచ్చిందో లేదో..అలా మార్కెట్‌లో ఎన్వీడియా షేర్లు కుప్పకూలిపోయాయి. సోమవారం ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు ఏకంగా ఏడు శాతం వరకు డౌన్ అవగా, సెషన్ సమయంలో అయిదు శాతం లాస్ అయ్యాయి. దీని ప్రభావం ఆయన పర్సనల్ ఇన్కమ్‌పై పడి, ఒక్కరోజే ఏకంగా 7.4 బిలియన్ డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల సుమారు 69 వేల కోట్ల రూపాయలకు పైగా ఆవిరైపోయాయి. దీంతో ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్న ఆయన ఒక్కసారిగా పదో స్థానానికి పడిపోయారు.
ఈ ఊహించని పరిణామాలతో ఉక్కిరిబిక్కిరైన జెన్సెన్ హువాంగ్(Nvidia CEO Jensen Huang) వెంటనే రియాక్ట్ అయి.. తన కంపెనీ ఉద్యోగులకు పంపిన ఒక మెసేజ్‌లో, తన భార్య లోరీ హువాంగ్‌కు తాను ద్రోహం చేసినట్లు ఒప్పుకున్నారు. తన తప్పు వల్ల ఫ్యామిలీలో మనశ్శాంతి కరువయిందని ఆయన క్షమాపణలు కోరారు.
అయితే కంపెనీ బోర్డు జరిపిన ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్‌లో మాత్రం జాతీయ భద్రతకు గానీ, కంపెనీ రహస్యాలకు గానీ ఎలాంటి ముప్పు వాటిల్లినట్లు ప్రూఫ్స్ దొరకలేదని స్పష్టమైంది. అయినా కూడా ఈ వివాదాల మధ్య ఆయన సీఈఓగా కొనసాగుతున్నా, ఆయన పర్సనల్ లైఫ్ మాత్రం పూర్తిగా రోడ్డున పడిందనే చెప్పాలి.
అంతేకాకుండా 1985లో లోరీని పెళ్లి చేసుకున్న హువాంగ్ ఇప్పుడు ఆమెతో విడాకులు తీసుకునే ఛాన్స్ ఉందంటూ జోరుగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఒకవేళ నిజంగా కనుక వీరే విడిపోతే, కాలిఫోర్నియా కమ్యూనిటీ ప్రాపర్టీ చట్టాల ప్రకారం మ్యారేజ్ తర్వాత సంపాదించిన ఆస్తులను ఇద్దరూ ఈక్వల్‌గా పంచుకోవాల్సి ఉంటుంది.
ప్రస్తుతం హువాంగ్ టోటల్ వెల్త్ సుమారు 155 నుంచి 162 బిలియన్ డాలర్ల మధ్య ఉంది. దీనిలో సగం అంటే దాదాపు 75 నుంచి 81 బిలియన్ డాలర్లను అంటే వేల కోట్ల రూపాయలను భరణం కిందే భార్యకు చెల్లించాల్సి రావొచ్చని ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు.
మొత్తానికి ఏఐతో వరల్డ్ మొత్తాన్ని శాసించిన ఒక జీనియస్, చిన్న పర్సనల్ తప్పు వల్ల తన సామ్రాజ్యాన్ని, పరువును ఎలా రిస్క్‌లో పడేసుకున్నారో చూస్తుంటే కాలం ఎవరినైనా ఎప్పుడు ఎక్కడ ఎలా ఆడుకుంటుందో అర్థం కాదన్న విషయం మరోసారి ప్రూవ్ అయింది.
