Pawan Kalyan
ఏపీ రాజకీయాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా తనదైన ముద్ర వేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హస్తిన వేదికగా పొలిటికల్ హీట్ పెంచారు.దేశ రాజధాని ఢిల్లీలో జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ..జనసేన ప్రస్థానం-జాతీయ సమగ్రత కోసం అనే ప్రత్యేక సమావేశం ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్‌లోనూ చర్చనీయాంశంగా మారింది.
తమ పార్టీ స్థాపించి విజయవంతంగా పన్నెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సదస్సులో జనసేనాని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మరోసారి కూడా తన పవర్‌ఫుల్ అండ్ ఎమోషనల్ స్పీచ్‌తో ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. తాను కేవలం అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనే స్వార్థంతోనో, కుర్చీ కోసమో పార్టీ పెట్టలేదని, దేశ సమగ్రతతో పాటు జాతీయ భద్రతను కాపాడటమే జనసేన పార్టీ యొక్క పరమావధి అని..అదే తమ ముఖ్య లక్ష్యమని క్లారిటీ ఇచ్చారు.
ఈ పన్నెండేళ్ల ప్రయాణంలో జనసేన పార్టీ ఎన్నో ప్రజా పోరాటాలను, ఉద్యమాలను, ఆందోళనలను చేసి ప్రజల పక్షాన నిలిచిందని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రస్తుత రోజుల్లో కొన్ని రాజకీయ పార్టీలు కేవలం తమ ఉనికిని కాపాడుకోవడం కోసం,అలాగే ఓట్ల కోసం దేశ సమగ్రతను కూడా పణంగా పెట్టడానికి వెనుకాడటం లేదని పవన్ ఆరోపించారు.
దేశభక్తిని, జాతీయ స్ఫూర్తిని ప్రతి తరం కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పవన్ పిలుపునిచ్చారు. ఇదే వేదికపై తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అంశంపై తన వైఖరిని మరోసారి చాలా స్పష్టంగా వివరించారు.
తానెప్పుడూ, ఏనాడు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించలేదని చెప్పిన పవన్.. అయితే ఆరోజు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ను విభజించిన అనాలోచిత తీరుపైన మాత్రం తాను తీవ్ర ఆవేదన వ్యక్తం చేశానని మరోసారి క్లారిటీ ఇచ్చారు.
ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన విభజన విధానం వల్లే ..ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అసంతృప్తి, అశాంతి వంటి పరిస్థితులు అలాగే మిగిలిపోయాయని పవన్ పాయింట్ అవుట్ చేశారు.
ఆస్తుల పంపకాలే కాదు నీటి వివాదాల వంటి కీలక సమస్యలు కూడా ఒక కొలిక్కి రాకుండా ఇప్పటికీ కొనసాగుతుండటానికి ఆనాడు చేసిన విభజన లోపాలే కారణమని పవన్ ఎత్తి చూపారు.
అలాగే కొంతమంది లోకల్ లీడర్స్‌ను టార్గెట్ చేస్తూ పవన్ గట్టిగానే విమర్శలు గుప్పించారు. రాష్ట్రాల్లోనే ఉంటూ ఢిల్లీకి వెళ్లి కేంద్రం మెడలు వంచుతామంటూ గంభీరంగా మాట్లాడే నాయకులంతా.. ఇక్కడికి రాగానే మాత్రం మౌన ముద్ర దాల్చుతారని ఎద్దేవా చేశారు.
దేశ రక్షణకు, భద్రతకు కూడా ఢిల్లీ అనేది ప్రధానమైన కేంద్రమని, అంతేకాకుండా భారత రాజ్యాంగం పుట్టిన పవిత్ర స్థలం కూడా ఇదే కాబట్టే ఈరోజు జాతీయ సమగ్రతపై మాట్లాడటానికి తాను ఈ వేదికను ఎంచుకున్నట్లుగా పవన్ కళ్యాణ్ వివరించారు.
JanaSena Chief, Hon'ble Deputy Chief Minister Sri@PawanKalyan Speech at "Sena Prasthanam" Meeting at New Delhi. #JanaSenaniInNewDelhi #SenaPrasthanam pic.twitter.com/h12blnFBBX
— JanaSena Party (@JanaSenaParty) June 15, 2026
Scorpio : పైకి గంభీరం..లోపల భావోద్వేగాల సముద్రం..వృశ్చికరాశి వారు ఈ తప్పులు చేయకూడదట..
