Asmita Dey : జూడోలో అస్మితకు స్వర్ణం.. బాక్సింగ్‌లోనూ భారత్ జోరు

Asmita Dey : జూడోలో అస్మిత దే బంగారు పతకం గెలిచి చరిత్ర సృష్టించింది. మహిళల 48 కేజీల జూడో విభాగంలో కెనడాకు చెందిన హైదీ క్వాచ్‌ను ఓడించి స్వర్ణం గెలిచింది.

Asmita Dey

కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. జూడోలో అస్మిత దే(Asmita Dey) బంగారు పతకం గెలిచి చరిత్ర సృష్టించింది. మహిళల 48 కేజీల జూడో విభాగంలో కెనడాకు చెందిన హైదీ క్వాచ్‌ను ఓడించి ఆమె స్వర్ణం గెలిచింది. దీంతో కామన్ వెల్త్ గేమ్స్ జూడోలో స్వర్ణం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది.

గత కామన్ వెల్త్ గేమ్సలో భారత జూడో క్రీడాకారులు ఐదు రజతం , ఆరు కాంస్య పతకాలు సాధించారు. త్రిపుర రాష్ట్రం బెలోనియాకు చెందిన అస్మిత భోపాల్‌లోని సాయ్ రీజినల్ సెంటర్‌లో సీనియర్ కోచ్ యశ్‌పాల్ సోలాంకి పర్యవేక్షణలో శిక్షణ తీసుకుంది.  దీనికంటే ముందు ఆమె మొరాకోలో జరిగిన కాసాబ్లాంకా ఆఫ్రికన్ ఓపెన్ 2025 లోనూ, మకావు జూనియర్ ఏషియన్ కప్ 2023 లోనూ బంగారు పతకాలు సాధించారు.

మరోవైపు గ్లాస్గో గేమ్స్‌లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే 10 మంది పతకాలు ఖాయం చేయగా, ఇప్పుడు పసిడి వేటలోనూ మన బాక్సర్లు దూసుకెళుతున్నారు. బాక్సింగ్ రింగ్‌లో ఆధిపత్యం కనబరుస్తూ ఐదుగురు బాక్సర్లు ఫైనల్లో అడుగుపెట్టారు. ప్రీతి పవార్, జాస్మిన్ లంబోరియా, అరుంధతీ చౌదరి, జాదుమణి సింగ్, అంకుశ్ పంగల్ స్వర్ణానికి అడుగు దూరంలో నిలిచారు.

శుక్రవారం జరిగిన మహిళల 54 కిలోల విభాగం సెమీస్‌లో  ప్రీతి పవార్ అదరగొట్టింది. జాంబికాకు చెందిన జ్వాపేను చిత్తుగా ఓడించింది. అలాగే మహిళల 57 కేజీల విభాగంలో జాస్మిన్ లంబోరియా కూడా ఫైనల్‌కు దూసుకెళ్లింది. అటు మహిళల 70 కేజీల విభాగంలో అరుంధతి చౌదరి పూర్తి ఆధిపత్యం కనబరిచింది. సెమీస్‌లో వేల్స్‌కు చెందిన బర్మింగ్ హామ్ గోల్డ్ మెడలిస్ట్ రోసీపై 4-0తో గెలిచింది.

Asmita Dey

మరోవైపు పురుషల విభాగంలోనూ భారత్ జోరుకు అడ్డే లేకుండా పోయింది. పురుషుల 80 కేజీల విభాగంలో అంకుశ్ పంగల్  స్వర్ణానికి అడుగుదూరంలో నిలిచాడు. సెమీస్‌లో కెనడాకు చెందిన జోసెఫ్‌పై విజయం సాధించాడు. ఇక పురుషుల 50 కేజీల విభాగంలో జాదుమణి సింగ్ కూడా ఫైనల్లో అడుగుపెట్టాడు. సెమీస్‌లో అతను నమీబియాకు చెందిన ఫిలిప్ హోసెబ్‌పై గెలిచాడు. దీంతో ఐదుగురు భారత బాక్సర్లు కనీసం రజతాలను ఖాయం చేశారు.

Bhogapuram Airport : రన్ వే పైకి ఉత్తరాంధ్ర భవిష్యత్తు.. ఏపీ చరిత్రలో అపూర్వమైన ప్రారంభోత్సవ వేడుక విషయాలివే..

Exit mobile version